ఆర్థిక మంత్రిత్వ శాఖ
రుణ ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రుణదాతలతో సమావేశమైన - కేంద్ర ఆర్థిక మంత్రి.
అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఈ.సి.ఎల్.జి.ఎస్.); మరియు పాక్షిక ఋణ హామీ పథకం (పి.సి.జి.ఎస్) 2.0; తో పాటు, సబార్డినేట్ ఋణ పథకం ప్రగతిని కూడా సమీక్షించిన - కేంద్ర ఆర్ధికమంత్రి.
Posted On:
03 SEP 2020 3:46PM by PIB Hyderabad
కోవిడ్-19 సంబంధిత ఒత్తిడి కోసం రుణాల తీర్మానం ఫ్రేమ్ వర్కు అమలు కోసం వారి సంసిద్ధతను సమీక్షించడానికి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సి. ల అధిపతులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ, రుణాల తిరిగి చెల్లింపులపై తాత్కాలిక నిషేధాన్ని ఎప్పుడు ఎత్తివేస్తే, అప్పుడు, రుణగ్రహీతలకు మద్దతు ఇవ్వాలనీ, కోవిడ్-19 సంబంధించిన ఒత్తిడి, రుణ గ్రహీతల క్రెడిట్ విలువను అంచనా వేసేటప్పుడు వారిపై పడకూడదనీ, రుణదాతలను కోరారు.
పరస్పర చర్చల్లో భాగంగా, ఆర్థిక మంత్రి కింది విషయాలపై దృష్టి సారించారు
* రుణదాతలు వెంటనే తీర్మానం కోసం బోర్డు ఆమోదించిన విధానాన్ని అమలు చేయడం, అర్హతగల రుణగ్రహీతలను గుర్తించడం మరియు వారిని చేరుకోవడం
* ప్రతి ఆచరణీయ వ్యాపారం యొక్క పునరుజ్జీవనం కోసం రుణదాతలు నిరంతర పరిష్కార ప్రణాళికను త్వరగా అమలు చేయడం
2020 సెప్టెంబర్ 15వ తేదీ లోగా రుణదాతలు తమ తీర్మానం పథకాలను రూపొందించుకోవాలనీ, వాటిపై అవగాహన కల్పించడానికి నిరంతర మీడియా ప్రచారం నిర్వహించాలనీ, ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. తీర్మానాల ఫ్రేమ్‌వర్క్ పై ఎప్పటికప్పుడు నవీకరించిన తరచుగా అడిగే ప్రశ్నలు, సమాధానాలను వారి వెబ్‌సైట్లలో హిందీ, ఇంగ్లీషు మరియు ప్రాంతీయ భాషలలో అప్‌లోడ్ అయ్యేలా చూడాలనీ, వాటిని వారి కార్యాలయాలు మరియు శాఖలకు కూడా పంపిణీ చేయాలనీ, ఆమె రుణదాతలకు సూచించారు.
తమ తీర్మానాల విధానాలతో సిద్ధంగా ఉన్నామనీ, అర్హతగల రుణగ్రహీతలను గుర్తించడం, వారిని చేరుకోవడం అనే ప్రక్రియను ప్రారంభించామనీ, మరియు అవి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) నిర్దేశించిన కాలపరిమితులకు అనుగుణంగా ఉంటాయనీ, రుణదాతలు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
తీర్మానం ప్రక్రియలో రుణదాతలకు ఆర్.బి.ఐ. సహకరించే విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆర్.బి.ఐ. ని కోరడం జరిగింది.
‘ఆత్మ నిర్భార్ భారత్ అభియాన్’ లో భాగంగా ప్రకటించిన ఈ.సి.ఎల్.జి.ఎస్; పి.సి.జి.ఎస్-2.0 మరియు సబార్డినేట్ రుణ పధకాల కింద వివిధ రుణదాతలు సాధించిన పురోగతిని కూడా ఆర్థిక మంత్రి సమీక్షించారు. అదేవిధంగా, పండుగ సీజన్ కు ముందు రుణగ్రహీతలకు సాధ్యమయ్యే గరిష్ట ఉపశమనాన్ని ప్రయత్నించమని కూడా ఆమె రుణదాతలకు సలహా ఇచ్చారు. ఈ.సి.ఎల్.జి.ఎస్. కింద 31.8.2020 నాటికి 1.58 లక్షల కోట్ల రూపాయలు మంజూరు కాగా, అందులో 1.11 లక్షల కోట్ల రూపాయల మేర పంపిణీ చేయడం జరిగింది. పి.సి.జి.ఎస్-2.0 కింద, ప్రభుత్వ రంగ బ్యాంకులకు బాండ్లు / సి.పి. లను కొనుగోలు చేయడానికి, ఇప్పటివరకు 25,055.50 కోట్ల రూపాయలు ఆమోదించగా, వీటిలో, అందులో 13,318.50 కోట్ల రూపాయలు, పోర్ట్ ఫోలియోలో 53 శాతం కంటే ఎక్కువ, ఏ.ఏ.- కంటే తక్కువ రేటింగ్ ఉన్న బాండ్లు / సి.పి.లకు సంబంధించినవి ఉన్నాయి. ఈ విధంగా, తక్కువ రేటెడ్ బాండ్లు / సి.పి. లకు ఈ పధకం చాలా కీలకమైనది.
లాక్ డౌన్ సమయంలో, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మరియు ఆత్మా నిర్భర్ భారత్ సంబంధిత చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో, బ్యాంకులు మరియు ఎన్.బి.ఎఫ్.సి. లు చేసిన కృషిని ఆర్థిక మంత్రి ప్రశంసించారు. కంపెనీలు మరియు వ్యాపారాల అవసరాలకు, అలాగే వ్యక్తిగత రుణగ్రహీతల అవసరాలకు ముందుగానే స్పందించాలని ఆర్థిక మంత్రి రుణదాతలను ప్రోత్సహించారు. అలాగే, కోవిడ్-19 వల్ల నష్టపోయిన వ్యాపారాలను పునర్నిర్మించే ప్రయత్నాలను ముందుకు నడిపించాలని కూడా ఆమె సూచించారు.
*****
(Release ID: 1651118)
Visitor Counter : 279