ప్రధాన మంత్రి కార్యాలయం

శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి

Posted On: 03 SEP 2020 2:43PM by PIB Hyderabad

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారులతో 2020 సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.

అకాడమి లో 42 వారాల పాటు సాగిన 28 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 131 మంది ఐపిఎస్ ప్రొబేషనర్లు ఒకటో దశ ప్రాథమిక కోర్సు ను పూర్తి చేశారు.

వారు ముస్సోరీ లోని లాల్ బహాదుర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమి లోను, తెలంగాణ లోని హైదరాబాద్ లో గల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లోను ఇతర సర్వీసులైన ఐఎఎస్, ఐఎఫ్ఎస్ లతో పాటే తమ ప్రాథమిక కోర్సు ను ముగించిన తరువాత 2018 డిసెంబర్ 17వ తేదీ నాడు ఈ అకాడమీ లో చేరారు.  

ఎస్ విపి, ఎన్ పిఎ లో ప్రాథమిక కోర్సు శిక్షణ క్రమం లో, న్యాయ శాస్త్రం, దర్యాప్తు, న్యాయ-వైద్య శాస్త్రం, నాయకత్వం, నిర్వహణ, నేర విచారణ శాస్త్రం, ప్రజా వ్యవస్థ & అంతర్గత భద్రత, నీతి శాస్త్రం, మానవ హక్కులు, ఆధునిక భారతదేశం లో పౌర రక్షణ, ఫీల్డ్ క్రాఫ్ట్, వ్యూహరచన, ఆయుధ ప్రయోగ సంబంధ శిక్షణ తో పాటు తుపాకి కాల్పుల వంటి వివిధ ఇన్ డోర్ సబ్జెక్టులో, అవుట్ డోర్ సబ్జెక్టుల లో శిక్షణను ఇవ్వడం ద్వారా నేర్పరితనాన్ని గురించి ప్రొబేషనర్లకు బోధించారు.  


 

***


(Release ID: 1651024) Visitor Counter : 250