జల శక్తి మంత్రిత్వ శాఖ
పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న - జల్ జీవన్ మిషన్
Posted On:
03 SEP 2020 12:27PM by PIB Hyderabad
2024 నాటికి గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఫంక్షనల్ గృహ ట్యాప్ కనెక్షన్ ఉండేలనే లక్ష్యంతో, జల్ జీవన్ మిషన్ రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేయడం జరుగుతోంది. ప్రతి గ్రామీణ గృహానికీ క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన, తగినంత పరిమాణంలో (రోజుకు ఒక వ్యక్తికి 55 లీటర్ల చొప్పున) నిర్ణీత నాణ్యతతో, త్రాగునీటిని సరఫరా చేయాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
జల్ జీవన్ మిషన్ ప్రారంభమై ఒక ఏడాది గడించిన సందర్భంగా, ప్రధానమంత్రి 2020 ఆగష్టు 15వ తేదీన ఎర్రకోట బురుజుల నుండి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ, మొత్తం దేశంలో, ఈ కాలంలో 2 కోట్ల గృహాలకు పంపు నీటి కనెక్షన్లు అందజేసినట్లు ప్రకటించారు. ప్రతి రోజూ ఒక లక్ష కు పైగా కుటుంబాలకు నీటి పంపు కనెక్షన్లు ఇస్తున్నారు.
గ్రామీణ తాగునీటి సరఫరా అనేది, జియో-జెనిక్ మరియు ఆంత్రోపోజెనిక్ నీటి నాణ్యత సమస్యలు; కఠినమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులలో దీర్ఘకాలిక త్రాగునీటి సరఫరా; మరియు విపత్తు సంభవించే ప్రాంతాలు, నీటి సరఫరా సేవల వివరాలు మరియు పర్యవేక్షణ; ప్రవర్తన మార్పు నిర్వహణ, ఖర్చుతో కూడిన నీటి శుద్ధి ప్రక్రియ మరియు పునర్వినియోగం వంటి, వివిధ సామాజిక, పర్యావరణ మరియు సాంకేతిక సవాళ్లతో కూడిన సంక్లిష్టమైన అంశం. ఈ విధంగా, జల్ జీవన్ మిషన్ ను గ్రామీణ నీటి భద్రత యొక్క భవిష్యత్తుతో పాటు వేగం మరియు ప్రమాణంతో అమలు చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు జ్ఞాన అంతరాలను చూస్తే, నీటి సరఫరా రంగంలో గణనీయమైన పరిశోధన మరియు ఆవిష్కరణల తక్షణ అవసరం చాలా ఉంది.
గతంలో కంటే, ఇప్పుడు, జాతీయ జల్ జీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పరిశోధన మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చి, ప్రోత్సహించి, కొనసాగిస్తోంది. యువ ఆవిష్కర్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, వ్యవస్థాపకులతో పాటు, ఈ రంగంలో పనిచేస్తున్న అంకురసంస్థల నుండి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడానికీ, జ్ఞాన అంతరాలను పూరించడానికీ, జాతీయ జల్ జీవన్ మిషన్ ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. దీనితో పాటు, గ్రామీణ నీటి సరఫరాను సమర్థవంతంగా, ప్రభావవంతంగా ఆర్థికంగా నిర్వహించడానికి సాక్ష్యం ఆధారిత సాంకేతిక జోక్యాన్ని అనుసరించడానికి, డిపార్టుమెంటు / జాతీయ మిషన్ / ఎస్.డబ్ల్యూ.ఎస్.ఎమ్., కార్యాచరణ పరిశోధన మరియు ఏకకాలిక మూల్యాంకన అధ్యయనాలను నిర్వహిస్తున్నాయి. శాస్త్రవేత్తలు, ఆర్ అండ్ డి సంస్థలు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులతో భాగస్వామ్యాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు తాగునీటి రంగంలో వివిధ సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడే ఉపయోగకరమైన జ్ఞానాన్ని సృష్టించడానికీ, జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలోని ఈ ఆర్. & డి. ప్రాజెక్టులు దోహదపడతాయి
ఆర్. & డి మార్గదర్శకాలు డిపార్ట్‌మెంటుకు సంబంధించిన - https://jalshakti-ddws.gov.in/. అనే వెబ్-సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అన్ని వ్యక్తులు / ఏజెన్సీలు / సంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మరియు వారి ప్రతిపాదనలను పంపవచ్చు.
(Release ID: 1651018)
Visitor Counter : 251