గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
బెంగళూరు జాతీయ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల అకాడమీకి ఈ-శంకుస్థాపన
గ్రామీణ పేదరిక సమస్యను పరిష్కరించడానికి ఆర్‌ఎస్‌ఇటిఐల చొరవ ప్రత్యేకమైనది - గ్రామీణాభివృద్ధి కార్యదర్శి
Posted On:
03 SEP 2020 12:04PM by PIB Hyderabad
నేషనల్ అకాడమీ ఆఫ్ రుడ్సేటి (ఎన్ఏఆర్) కొత్త శిక్షణా సంస్థ భవనం ఈ-శంకుస్థాపన కార్యక్రమం నిన్న జరిగింది. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థల సిబ్బంది (585 ఆర్‌ఎస్‌టిఐలు దేశంలోని 566 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి), రాష్ట్ర / యుటి గ్రామీణ జీవనోపాధి మిషన్ సిబ్బంది, సంబంధిత బ్యాంకు అధికారుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడం ఎన్ఏఆర్ చేపట్టింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తరపున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా, ఆర్ఎస్ఇటిఐల ప్రత్యేకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, వాణిజ్య బ్యాంకులు గ్రామీణ పేదరిక సమస్యను పరిష్కరించడానికి దీనిలో కలిసి పనిచేస్తున్నాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించే ప్రయత్నాలను మరింతగా పెంచడానికి ఏర్పాటైన ఆర్‌ఎస్‌ఇటిఐలు, ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావించారు. ఆర్‌ఎస్‌ఇటిఐల కార్యకలాపాలను ప్రామాణీకరించడంలో ఎన్‌ఏఆర్ పాత్రను ప్రశంసిస్తూ, ఈ దిశలో ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆయన ఎన్ఏఆర్ కు సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఎన్ఏఆర్ కొత్త క్యాంపస్‌ను స్థాపించడం ఎంతో ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం, ఈ శిక్షణ కార్యక్రమాలను బెంగళూరులోని అద్దె ప్రాంగణంలో లేదా రాష్ట్రాలు / యుటిలలోని వివిధ ప్రాంగణాల్లో నిర్వహిస్తున్నారు. అందమైన గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులో రూ .25 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిపాదిత క్యాంపస్ అభివృద్ధి చేస్తే నైపుణ్యాలు, సామర్థ్యాల పెంచడంలో ఎదురవుతున్న చాలా ఇబ్బందులు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఆర్ అధ్యక్షుడు పద్మవిభూషణ్ డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే, కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ఎ మణిమేఖలై పాల్గొన్నారు.
ఎన్ఏఆర్ అధ్యక్షుడు డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే మాట్లాడుతూ విజయవంతమైన రుడ్సేటి నమూనాను స్వీకరించడంలో ప్రభుత్వం చురుకైన పాత్రను ప్రశంసించారు. ఆర్ఎస్ఇటిఐల రూపంలో ఈ చక్కటి ప్రతిరూపం లక్షలాది గ్రామీణ నిరుద్యోగ యువత జీవితాలలో కొత్త ఆశలు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని బ్యాంకులు ఆర్‌ఎస్‌ఇటిఐ నమూనాను అంగీకరించేలా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ఫలితంగా దేశంలో అతిపెద్ద ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి శిక్షణా నెట్‌వర్క్ ఏర్పాటైంది.
కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఎ మణిమేఖలై మాట్లాడుతూ ఎన్ఏఆర్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న పాత్రను ప్రశంసించారు. భవిష్యత్ లో చేపట్టే కార్యక్రమాల్లో కూడా కెనారా బ్యాంక్ ఎన్ఏఆర్ కు పూర్తిగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

*****
(Release ID: 1650965)
Visitor Counter : 281