హోం మంత్రిత్వ శాఖ
సివిల్ సర్వీసుల సామర్ధ్య నిర్మాణ (ఎన్.పిసిఎస్‌సిబి)జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని ప్రశంసించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా.
దార్శనికతతో కూడిన ఈ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
“ సివిల్ సర్వీసులలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఉద్దేశించినదే మిషన్ కర్మయోగి”
“ ఈ సంపూర్ణ, సమగ్ర పథకం వ్యక్తిగతంగా, సంస్థాపరంగా సామర్ధ్యాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరిస్తుంది”
“21 వ శతాబ్దానికి సంబంధించి ఇది కీలక సంస్కరణ. సమాచారం పంచుకోని సంస్కృతి నుంచి కొత్త పని సంస్కృతిని తీసుకువస్తుంది.
“ లక్ష్య నిర్దేశిత , నిరంతర శిక్షణ, సివిల్ సర్వెంట్లలో జవాబుదారిత్వం, పారదర్శకతకు వీలు కల్పించడానికి వారిని చైతన్యవంతులను చేయడంతోపాటు వారికి సాధికారత కల్పిస్తుంది."
“ ఈ సంస్కరణలు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే వారికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారి పనితీరును మెరుగుపరిచి, వారు నవభారత ఆకాంక్షలను నెరవేర్చేలా చేస్తుంది”
“ శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్ కు సంసిద్ధమైన సివిల్ సర్వీసును, నవభారతం కోసం సివిల్ సర్వీసును నిర్మించేందుకు కట్టుబ
Posted On:
02 SEP 2020 7:31PM by PIB Hyderabad
కేంద్ర కేబినెట్ ఈరోజు మిషన్ కర్మయోగి పేరుతో, సివిల్ సర్వీసుల సామర్ధ్య నిర్మాణ(ఎన్.పిసిఎస్‌సిబి)జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇది సివిల్‌సర్వీసులలో పరివర్తనాత్మక మార్పు తీసుకురావడానికి ఉద్దేశించినదని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికాత్మక సంస్కరణలకు , ప్రధానమంత్రికి శ్రీ అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
“ ఈ సంపూర్ణ, సమగ్ర కార్యక్రమం వ్యక్తిగత, సంస్థాగత సామర్ధ్య నిర్మాణంపై దృష్టి పెడుతుంద”ని ఆయన అన్నారు.
“ఇది 21 వ శతాబ్దానికి అనుగుణమైన కీలక సంస్కరణ ,ఇది సమాచారం పంచుకోకుండా వ్యవహరించే వ్యవస్థకు బదులుగా నూతన పని సంస్కృతిని తీసుకు రానుంది. లక్ష్యనిర్దేశిత, నిరంతర శిక్షణ సివిల్ సర్వెంట్లను చైతన్యవంతులను చేసి జవాబుదారిత్వం, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురానుంది” అని హోంమంత్రి తెలిపారు.
“ ఈ సంస్కరణ ప్రభుత్వ యంత్రాంగం తన స్వీయ పనితీరును మెరుగు పరచుకోవడానికి, నవ భారత ఆకాంక్షలను నెరవేర్చడానికి వీలు కలిగిస్తుంది”
“ భవిష్యత్‌కు సిద్ధమయ్యే సివిల్ సర్వీసుల నిర్మాణానికి , నవభారతానికి సివిల్ సర్వీసు రూపకల్పనకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.” అని ఆయన అన్నారు.
ఎన్‌పిసిఎస్‌సిబి , సివిల్ సర్వెంట్ల సామర్థ్యం పెంపొందించడానికి అనువైన పునాదులు వేయడానికి జాగ్రత్తగా రూపొందించబడింది, తద్వారా వారు భారతీయ సంస్కృతి , సున్నితత్వాలతో అనుసంధానమై ఉండేలా చేయడానికి, భారతీయ మూలాలతో అనుసంధానమై ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ సంస్థలనుంచి ,అవి అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
సమీకృత ప్రభుత్వ ఆన్‌లైన్ శిక్షణ ప్లాట్‌ఫాం “iGOTKarmayogi” ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్యక్రమం చేపడతారు. ఇందుకోసం 46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 5 సంవత్సరాల కాలానికి 2020-21 నుంచి 2024-25 వరకు 510.86 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నారు.
***
(Release ID: 1650905)
Visitor Counter : 226