ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
స్టాప్ టిబి భాగస్వామ్యం ఎక్సిక్యుటివ్ డైరక్టర్ తో డిజిటల్ విధానంలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్.
“ కోవిడ్ సమయంలోనూ , టి.బి కూడా ఒక ప్రాధాన్యతా అంశం, 2025 నాటికి ఇండియా నుంచి టిబి నిర్మూలన మిగిలిన ప్రపంచానికి ఆశ కలిగించనుంది.”
Posted On:
02 SEP 2020 6:20PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు డిజిటల్ మాధ్యమం ద్వారా స్టాప్ టిబి పార్టనర్‌షిప్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ డాక్టర్ లూసికా డిటియు తో మాట్లాడారు. టిబిని నిర్మూలించడం భారతదేశ ప్రాధాన్యతా అంశమని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. ఉచిత సత్వర మాలిక్యులార్ పరీక్షల అందుబాటును పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన అన్నారు. అలాగే పేషెంట్లకు ఆర్థిక, పౌష్టికాహార మద్దతు, మంచి నాణ్యమైన మందులు,వేగవంతమైన మాలిక్యులార్ పరీక్షల ద్వారా ఉచిత రోగ నిర్ధారణ అందుబాటును పెంచడానికి, రోగనిరోధకతపై సమాచారాన్ని అందించడానికి , టిబి ఉన్నవారికి ఉత్తమ-నాణ్యమైన మందులు అందించడానికి , రోగులకు ఆర్థికసహాయం, పౌష్టికాహార సహాయంతోపాటు ఉచిత చికిత్సను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
ప్రైవేటు రంగం కార్యకలాపాలను బలోపేతం చేయడానికి నోటిఫికేషన్లు, వాటికి కట్టుబడి ఉండడం, ప్రభుత్వేతర సంస్థలతో ముఖాముఖి అనుసంధానం వంటి వాటి విషయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పారు.
దేశం గత ఎనిమిది నెలలుగా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ , 2025 నాటికి టిబిని దేశంలో నిర్మూలించాలన్న లక్ష్యాన్ని అన్ని రాష్ట్రాలలోని ఆరోగ్య విభాగం వారికి ఆరోగ్య శాఖ అధికారులకు నిరంతరం గుర్తుచేయడం జరిగిందన్నారు. “ ముందుండి కోవిడ్‌పై సాగిస్తున్న పోరాట కృషి ద్వారా ఇండియా ఇతరులకు ఒక ఆదర్శంగా ఉండగలదని చూపింది. మనం దేశీయంగా మాస్కులు, పిపిఇ కిట్ల తయారీలో స్వావలంబన సాధించాం” అని ఆయన అన్నారు.
“ గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్ధేశంలో , ఇండియా 2025 నాటి క్షయవ్యాధి (టిబి)ని నిర్మూలించేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు చేరుకోవలసిన గడువు 2030 కి ఐదు సంవత్సరాల ముందే టిబి నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ రకంగా టి.బి రహిత ప్రపంచానికి నాయకత్వం వహించి ముందుకు సాగుతోంది” అని డాక్టర్ హర్షవర్ధన్ డిజిటల్ సమావేశం సందర్భంగా తెలిపారు. ఇటీవలి కాలంలో , టిబి రహిత ప్రపంచ సాధనకు ఇండియా నాయకత్వ స్థాయిలో ఉందన్న విషయం తెలిపేలా ఇటీవలి కాలంలో ఇండియా పలు కీలక చర్యలు తీసుకుందని, ఇందుకు పలు ముఖ్యమైన విధానాలు,ప్రణాళికలు అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. క్షయ వ్యాధిపై పోరాటంలో సాగిస్తున్న అద్భుత కృషిని ప్రశంసించి , డాక్టర్ లూసికా కృతజ్ఞతలు తెలిపారు.
***
(Release ID: 1650824)
Visitor Counter : 209