శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశం రూపురేఖల మార్పుపై సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యచరణ ప్రణాళిక ప్రస్తుత, మాజీ కార్యదర్శుల చర్చ

Posted On: 02 SEP 2020 5:53PM by PIB Hyderabad

  కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డి.ఎస్.టి.) స్వర్ణోత్సవం సందర్భంగా శాఖకు చెందిన ప్రస్తుత, మాజీ కార్యదర్శులు చర్చ నిర్వహించారు. ‘సైన్స్ టెక్నాలజీ శాఖ యాబై స్వర్ణ వత్సరాలను స్మరిస్తూనిర్వహించిన ప్రారంభ చర్చలో డి.ఎస్.టి. విజయాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇకముందు చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను గురించి కూడా చర్చించారు.

  సైన్స్ టెక్నాలజీ మాజీ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వపు ప్రస్తుత వైజ్ఞానిక సలహాదారు కె. విజయ రాఘవన్ సందర్భంగా మాట్లాడుతూ,.. దేశ శాస్త్ర సాంకేతిక రంగాలపై సైన్స్ టెక్నాలజీ శాఖ ప్రభావం అసాధారణమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా దేశం రూపు రేఖలు మార్చడంలో సైన్స్ టెక్నాలజీ శాఖ ఎంతో కీలకపాత్ర పోషించిందన్నారు.

  “విజ్ఞాన శాస్త్ర రంగంలో ప్రపంచంలోనే ముందువరసలో ఉన్న దేశాలను భారత్ అందిపుచ్చుకోవాలంటే, మన దేశ మేధావివర్గాల వనరులను సమర్థంగా వినియోగించుకోవలసి ఉంది. స్థూల స్వదేశీ ఉత్పత్తిలో మనం కేటాయిస్తున్నపెట్టుబడుల నిష్పత్తికి అనుగుణంగా విషయంలో చర్యలు తీసుకోవలసి ఉంది. సాంకేతిక పరిజ్ఞాన రంగంలోని వివిధ అవకాశాలను పరిశీలించినపుడు పెట్టుబడుల పెట్టే ఏదైనా రంగంలో నవ్యవత్వానికి ఆస్కారం ఉందేమో మనం తరచి చూసుకోవాలిఆయన అన్నారు.

  సైన్స్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ,..శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, సృజనాత్మక రంగాల్లో సైన్స్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు అనేది గొప్ప మలుపు అన్నారు. పాఠశాల విద్యార్థులనుంచి, పి.హెచ్.డి స్థాయి వరకూ విభాగం అనుసంధానమై ఉందని, యువశాస్త్రవేత్తలు, పరిశోధనా అభివృద్ధి లాబరేటరీలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో శాఖకు అనుబంధం ఉందని ఆయన అన్నారు.

  సైన్స్ టెక్నాలజీ శాఖ ఏర్పాటు చేసిన గొప్ప సంస్ధాగత వ్యవస్థలను గురించి అశుతోష్ శర్మ వివరించారుస్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి బోర్డు (టి.డి.బి.)ను, అనేకమంది శాస్త్రవేత్తలకు సాధికారత కల్పించిన సైన్స్, ఇంజనీరింగ్ పరిశోధనా బోర్డు (ఎస్..ఆర్.బి.)ను ఆయన సందర్భంగా ఉదహరించారు. సైన్స్ టెక్నాలజీ రంగంలో ఇప్పటివరకూ వేసిన బలమైన పునాదులను, ఐదు దశాబ్దాలుగా అభివృద్ధి చేసుకున్న మానవ వనరులను క్రియాశీలకం చేసుకోవచ్చని ఆయన సూచించారు. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో వీటిని సమర్థంగా వినియోగించుకున్నామని ఆయన చెప్పారు

    సైన్స్ టెక్నాలజీ శాఖ మాజీ కార్యదర్శి (2006-14) ప్రొఫెసర్ టి. రామసామి మాట్లాడుతూ,..భారతీయ వైజ్ఞానిక వ్యవస్థలో సైన్స్ టెక్నాలజీ శాఖ ప్రాణవాయువు పాత్రను పోషించిందన్నారు. “వైజ్ఞానిక శాస్త్ర విజయాల సంబరాల్లో దేశ పౌరులంతా పాలుపంచుకోవలసి ఉంది. వైజ్ఞానిక శాస్త్ర ప్రయోజనాలు ఇప్పటి వరకూ  పూర్తిగా అందని, లేదా  అసంపూర్తిగా అందిన ప్రజలకు కూడా సంపూర్ణ ఫలితాలు అందేలా కొత్త తరహా సైన్స్ టెక్నాలజీ విధానాన్ని రూపొందించుకునే అవకాశాలపై దేశం దృష్టిని కేంద్రీకరించాలిరామసామి అభిప్రాయపడ్డారు.

  సైన్స్ టెక్నాలజీ శాఖ మరో మాజీ కార్యదర్శి (1995-2006) ప్రొఫెసర్ వి.ఎస్. రామమూర్తి మాట్లాడుతూ, డి.ఎస్.టి. తో అనుబంధాన్ని, తన జ్ఞాపకాలను పంచుకున్నారు. “విద్యా సంస్థతో సంబంధంలేని తొలి టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏడాది మరో వంద ఇంక్యుబేటర్లను డి.ఎస్.టి. ఏర్పాటు చేస్తుంది. సైన్స్ టెక్నాలజీలో   స్థాయిలో మనం ప్రగతి సాధించాలనుకుంటున్నాం. జనాభాకు తగిన సంఖ్యలో పరిశోధకులు, సాంకేతిక పరిజ్ఞానం మనకు అవసరం. కోవిడ్ కాలంలో మన సాంకేతిక పరిజ్ఞాన బలమేమిటో తెలిసి వచ్చింది. మనం మరింత పురోగమించేందుకు ఇది దోహదపడుతుందిఅని ఆయన వ్యాఖ్యానించారు.

  స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా, పలు గొలుసుకట్టు కార్యక్రమాలను ఆన్ లైన్ లో వర్చువల్ విధానంలో నిర్వహించారు. డి.ఎస్.టి. అంతర్భాగమైన జాతీయ సైన్స్, టెక్నాలజీ కమ్యూనికేషన్ కౌన్సిల్ (ఎన్.సి.ఎస్.టి.సి.), విజ్ఞాన్ ప్రసార్ సంస్థలు కార్యక్రమాలను నిర్వహించాయి.

***


(Release ID: 1650818) Visitor Counter : 177