సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎం.ఎస్.ఎం.ఇ.లకు సకాలంలో చెల్లింపులపై కేంద్రప్రభుత్వం చొరవ చారిత్రాత్మకం

బకాయిలు అందేలా ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖ ప్రధానపాత్ర
రిజిస్ట్రేషన్ పేరిట డబ్బు వసూలు చేసే నకిలీ వెబ్ సైట్లపట్ల పట్ల ఎం.ఎస్.ఎం.ఇ.లకు అప్రమత్తత అవసరమని సూచన
ప్రభుత్వ వెబ్ సైట్లలోనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని పునరుద్ఘాటన

Posted On: 02 SEP 2020 3:52PM by PIB Hyderabad

   సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం..లకు) చెల్లింపులకు సంబంధించి దీర్ఘకాలంగా నెలకొన్న సమస్య పరిష్కారానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ పథకం కింద, ప్రభుత్వ సంస్థలు 45 రోజుల్లోగా చెల్లింపులు జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

  ప్రకటనకు అనుగుణంగా ఎం.ఎస్.ఎం.. మంత్రిత్వ శాఖ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంది. అంశాన్ని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లింది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను (సి.పి.ఎస్..లను) రాష్ట్రప్రభుత్వాలను కార్యోన్ముఖం చేసింది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతుల దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.

  విషయంలో మంత్రిత్వ శాఖ ఎంతో చొరవతో తీసుకున్న మరికొన్ని చర్యలను ప్రస్తావించవలసి ఉంది. చెల్లింపులు, పెండింగ్ బకాయిల విషయంలో నెలసరి నివేదికలను సునాయాసంగా, క్రమం తప్పకుండా, నిరాటంకంగా తయారు చేసేందుకు వీలుగా ప్రత్యేకమైన ఆన్ లైన్ రిపోర్టింగ్ వ్యవస్థను ఎం.ఎస్.ఎం.. మంత్రిత్వ శాఖ రూపొందించింది. వ్యవస్థ ద్వారా అందిన సమాచారం ప్రకారం గత 3 నెలల కాలంలో వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 6,800కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిపాయి. చాలావరకు మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తాము జరపాల్సిన  నెలసరి చెల్లింపులలో నాలుగింట మూడవ వంతు మెత్తాన్ని అదే నెలలో చెల్లించినట్టు తెలుస్తోంది. మిగిలిన మొత్తం సాధారణ వ్యాపార వ్యవధిలోగా లేదా 45రోజుల్లోగా చెల్లింపు జరగవచ్చని భావిస్తున్నారు.

    క్రమంతప్పకుండా నివేదికలు తెప్పించుకోవడం, చెల్లింపులు చేయించడంలో రాష్ట్రప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చురుకుగా సంప్రదింపులు సాగుతూవస్తున్నాయి. ఇదే విషయమై రాష్ట్రాల స్పందనకోసం ఇదే తరహాలో ఆన్ లైన్ రిపోర్టింగ్ వ్యవస్థను కూడా రూపొందించారు.

  అంతే కాక, ఏదైనా కొనుగోలు సంస్థ,.. గడువులోగా కాక ఆలస్యంగా చెల్లింపులు జరిపిన పక్షంలో ఆలస్యానికి గాను నెలకు ఒకశాతం చొప్పున వడ్డీని పెనాల్టీ విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ వ్యవహారాల విభాగం ఉత్తర్వు జారీ చేసింది. ఇది కేంద్రం ప్రత్యేకంగా చూపిన మరో చొరవ.

   ఎం.ఎస్.ఎం.. మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం చారిత్రాత్మక స్థాయిలో మరో చొరవ చూపింది. ఎం.ఎస్.ఎం..లకు బిల్లుల విషయంలో డిస్కౌంట్ అందించేందుకు రూపొందించిన ట్రెడ్స్ ఆన్ లైన్ వేదికను కార్యోన్ముఖం చేయడానికి సంబంధించిన ఆన్ బోర్డింగ్ చార్జీలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాఫీ చేసిందిఇదివరకు ఎం.ఎస్.ఎం.,లు. 10వేల రూపాయల చొప్పున ట్రెడ్స్ వ్యవస్థ ఏజెన్సీలకు చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం ప్రకటించిన మాఫీ 2021 సంవత్సరం మార్చి నెలాఖరువరకూ చలామణిలో ఉంటుంది. చాలా వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పలు ప్రైవేటు కంపెనీలు కూడా ఇప్పటికే ట్రెడ్స్ యంత్రాగాన్ని వినియోగించుకుంటున్నాయి.

  ట్రెడ్స్ సదుపాయంపై చిన్నపరిశ్రమల అభివృద్ధి సంస్థ రూపొందించిన బ్రోచర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎం.ఎస్.ఎం.. సరఫరాదార్లు తక్కువ వడ్డీతో రుణాన్ని అందుకునేందుకు ట్రెడ్స్ దోహదపడుతుంది

   ఎం.ఎస్.ఎం.. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడానికి వాటి రిజిస్ట్రేషన్ కు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్  Udyam (https://udyamregistration.gov.in/)ను,.. TReDS, GeMలతో సమీకృతం చేస్తున్నారు. అందువల్ల,.. ప్రభుత్వ అధీనంలోని వెబ్ పోర్టల్ లోనే ఎం.ఎస్.ఎం..లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటేనే వాటికి ప్రయోజనం చేకూరుతుంది. TReDS, GeM ప్లాట్ ఫాంలతో వెబ్ పోర్టల్ సమీకృతమయ్యే ప్రక్రియ దానంతట అదే జరిగిపోతుంది. అంటే ఎం.ఎస్.ఎం..లను ఆన్ లైన్ ద్వారానే, పూర్తి ఉచితంగా రిజిస్టేషన్ చేయించుకోవచ్చన్న మాట. ఇది పూర్తిగా కాగిత రహితం. స్వయం ప్రకటిత వివరాల ప్రాతిపతికగానే జరుగుతుంది. రుజువుగా ఎలాంటి పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదు.

  కేవలం ఉదయం రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా రిజిస్టేషన్ చేయించుకునేలా ఎం.ఎస్.ఎం..లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2020 సంవత్సరం సెప్టెంబర్ 1నాటికి దాదాపు 4లక్షలమేర రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవస్థను గత జూలై నెలలో ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్లు జరిగాయి.

  రిజిస్ట్రేషన్లకు సహాయ పడతామంటూ కొన్ని నకిలీ వెబ్ సైట్లు డబ్బు వసూలు చేస్తున్నాయని, విషయంలో సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక వాణిజ్య వేత్తలు అప్రమత్తంగా ఉండాలని ఎం.ఎంస్.ఎం.. మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ప్రభుత్వ వెబ్ సైట్ల ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

  ఎం.ఎస్.ఎం..లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లింపుల 45రోజుల వ్యవధిలోగా జరిపేందుకు 2006 సంవత్సరపు ఎం.ఎస్.ఎం.. అభివృద్ధి చట్టం వీలు కల్పిస్తోంది. అయినా,..ఎం.ఎస్.ఎం..లకు సరుకులు, సేవలు అందించే సరఫరాదార్లకు మాత్రం నిర్దేశించిన గడువులోగా చెల్లింపులు అందలేదని తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కాలపరిమితిలోగా చెల్లింపులు జరపనందున ఎం.ఎస్.ఎం..లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇబ్బందులు తొలగించేందుకే ప్రభుత్వం ఎంతో చొరవతో అనేక చర్యలు తీసుకుంది.

******

 



(Release ID: 1650703) Visitor Counter : 202