నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

హ‌రిత దిశ‌గా భార‌తీయ విద్యుత్ మార్కెట్‌

విద్యుత్ రంగంలో గ్రీన్ ట‌ర‌మ్ అహెడ్ మార్కెట్ (జిటిఎఎం)ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ప్రారంభించిన కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

ప్ర‌పంచంలోనే పున‌రుత్పాద‌క ఇంధ‌న ఉత్ప‌త్తికి ప్ర‌త్యేక‌మైన తొలి మార్కెట్‌

పున‌రుత్పాద‌క ఇంధ‌నాన్ని కాంపిటిటివ్ ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసేవారికి ల‌బ్ధి చేకూర్చ‌నున్న జిటిఎఎం.: శ్రీ ఆర్‌.కె.సింగ్‌

దేశ వ్యాప్త మార్కెట్ స‌దుపాయం పొందడం ద్వారా అమ్మ‌కందారుల‌కు ప్ర‌యోజ‌నం

Posted On: 01 SEP 2020 4:43PM by PIB Hyderabad

 

భార‌తీయ విద్యుత్ మార్కెట్‌ను హ‌రిత‌మ‌యం చేయ‌డంలో తొలి అడుగుగా కేంద్ర విద్యుత్ ( ఇంఛార్జ్‌), నూత‌న పున‌రుత్పాద‌క ఇంధ‌న శాఖ స‌హాయ మంత్రి, నైపుణ్యాభివృద్ధి , ఎంట‌ర్ ప్రెన్యుయ‌ర్‌షిప్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్ 2020 సెప్టెంబ‌ర్ 1న వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా గ్రీన్ ట‌ర‌మ్ అహెడ్ మార్కెట్ (జిటిఎఎం)ను దేశ‌వ్యాప్తంగా ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ శ్రీ సింగ్‌, “ జిటిఎఎం ప్లాట్‌ఫాంను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్న రాష్ట్రాల భారం త‌గ్గ‌డ‌మే కాక‌, వాటి ఆర్‌పిఒ కుమించి పున‌రుత్పాద‌క ఇంధ‌న సామ‌ర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహం ల‌భిస్తుంది.  ఇది పున‌రుత్పాద‌క ఇంధ‌న వ్యాపార సామ‌ర్ధ్యాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కాక‌, దేశ పున‌రుత్పాద‌క ఇంధ‌న అద‌న‌పు సామ‌ర్ధ్యం చేరుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. జిటిఎఎం ప్లాట్‌ఫాం పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో పాల్గొనేవారి సంఖ్య‌ను పెంచేందుకు జిటిఎఎం ప్లాట్‌ఫాం ప‌నికివ‌స్తుంది. ఇది పొటీ ధ‌ర‌ల‌కు , పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌మైన ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ప్ర‌కారం పున‌రుత్పాద‌క ఇంధ‌న కొనుగోలుదారుల‌కు  ప్ర‌యొజ‌న‌క‌రం కానుంది.
ఇది అమ్మ‌కం దారుల‌కు దేశం మొత్తం మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పున‌రుత్పాద‌క ఇంధ‌న అమ్మ‌కందారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంది.
  భార‌త ప్ర‌భుత్వం 2022 నాటికి 175 గిగావాట్ల  పున‌రుత్పాద‌క ఇంధ‌న సామ‌ర్ద్యాన్ని చేరుకునేందుకు ల‌క్ష్యంగా నిర్ణయించుకుంది. గ్రీన్‌టర‌మ్ అహెడ్ మార్కెట్ కాంట్రాక్టులు పునరుత్పాద‌క ఇంధ‌న అమ్మ‌కాల‌కు సంబంధించి ఆర్‌.ఇ ఉత్ప‌త్తిదారుల‌కు అద‌న‌పు అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. ఇది ఆయా సంస్థ‌ల‌కు పున‌రుత్పాద‌క విద్యుత్‌ను పోటీ ధ‌ర‌కు రెన్యువ‌బుల్ ప‌ర్చేజ్ ఆబ్లిగేష‌న్ (ఆర్‌పిఒ) నెర‌వేర్చ‌డానికి ప‌నికివ‌స్తుంది. అలాగే ప‌ర్యావ‌ర‌ణ స్పృహ క‌లిగిన  ఒపెన్ యాక్సెస్ వినియోగ‌దారులు , సంస్థ‌లు గ్రీన్ ప‌వ‌ర్ కొనుగోలు చేసేందుకు ఒక వేదిక ను క‌ల్పిస్తుంది.
జిటిఎం కీల‌క అంశాలు:
1.     జిటిఎఎం ద్వారా లావాదేవీలు స్వ‌భావ సిద్ధంగా ద్వైపాక్షిక‌మైన‌వి. ఇది కొనుగోలుదారులు, అమ్మ‌కం దారులను స్ప‌ష్టంగా గుర్తించ‌డానికి వీలుక‌లుగుతుంది. ఆర్‌.పి.ఒ అకౌంటింగ్‌కు ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌దు.
2.జిటిఎఎం కాంట్రాక్టులు సోలార్ ఆర్‌పిఒ, నాన్ సోలార్ ఆర్‌పిఓగా వేరుచేస్తారు. ఆర్‌పిఒ ల‌క్ష్యాలు కూడా వేరు చేస్తారు.
3. దీనికితోడు రెండు సెగ్మెంట్ల‌లో జిటిఎఎం కాంట్రాక్టులు గ్రీన్ ఇంట్రా డే, డే అహేడ్‌ కంటింజెన్సీ, రోజువారి, వారం వారం కాంట్రాక్టులు ఉంటాయి.
ఎ. గ్రీన్ ఇంట్రాడే కాంట్రాక్టు, డే అహెడ్ కంటింజెన్సీ కాంట్రాక్టు- బిడ్డింగ్ 15 నిమిషాల వ్య‌వ‌ధిలో బ్లాక్‌వారీగా మెగావాట్ ఆధారంగా జ‌రుగుతుంది.
బి) రోజువారి, వారపు కాంట్రాక్టుల‌‌- బిడ్డింగులు మెగావాట్ల ప్రాతిప‌దిక‌న జ‌రుగుతాయి. అమ్మ‌కందారులు, కొనుగోలుదారులు త‌మ బిడ్ల‌ను దాఖ‌లు చేయ‌వ‌చ్చు. అయితే , అమ్మ‌కం దారులు త‌మ ప్రొఫైల్‌ను 15 నిమిషాల కాల‌వ్య‌వ‌ధిలో బ్లాక్‌వారీగా ప‌రిమాణం(మెగావాట్ల‌)లో మెగావాట్‌కు ధ‌ర‌ను తెల‌పాల్సిఉంటుంది.  కాంట్రాక్టు అమ‌లు అయిన త‌రువాత షెడ్యూలింగ్ ప్రొఫైల్ ప్ర‌కారం జ‌రుగుతుంది. ఎక్కువ‌మంది కొనుగోలుదారులు ఉంటే , ప్రొఫైల్‌ను ప్రో రేటా ప‌ద్ధ‌తిలో కేటాయిస్తారు.
4. ధ‌ర నిర్ణ‌యం  అనేది ధ‌ర కాల ప్రాధాన్య‌త ప్ర‌కారం నిరంత‌రం కొన‌సాగుతుంది. ఆ త‌ర్వాత మార్కెట్ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి  బ‌హిరంగ వేలంను రొజువారి, వార‌పు కాంట్రాక్టుల‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు.
5. జిటిఎఎం ఒప్పందం ద్వారా షెడ్యూల్ చేయబడిన ఇంధ‌నానికి సంబంధించి, ‌ కొనుగోలుదారు  RPO సమ్మతిగా పరిగణిస్తారు.
పునరుత్పాద‌క ఇంధ‌నాన్నిప్రొత్స‌హించేందుకు ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను విద్యుత్ మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి తెలిపారు. ఇవి ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని, వీటిని త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చెప్పారు.

***


(Release ID: 1650605) Visitor Counter : 283