రైల్వే మంత్రిత్వ శాఖ

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (డి.ఎఫ్.‌సి.సి.ఐ.ఎల్) పురోగతిని సమీక్షించిన - రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

నిర్ణీత సమయ వ్యవధి కంటే ముందు / లోపల తమ పనిని చేపట్టడానికి మరియు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఒక రకమైన ప్రోత్సాహకాలను అందించే అవకాశాన్ని అన్వేషిస్తున్న - డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్.


'ప్రతి కిలోమీటర్ వారీగా' ప్రాజెక్ట్ వాస్తవ పర్యవేక్షణ కోసం, రైల్వే అధికారులు తగిన చర్యలను అనుసరించడానికీ డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్. డాష్ బోర్డ్ ను కలిగి ఉండాలి. తద్వారా సమస్యలు మరియు పరిష్కారాలు అత్యవసరంగా తీర్మానించబడతాయి.


సంస్థాగతీకరించిన డాష్ బోర్డు వ్యవస్థ ద్వారా ఫిర్యాదుల పరిష్కార విధానం


రాష్ట్రాలతో సమన్వయంతో సహా అన్ని సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు; ఈ ప్రాజెక్టును వేగంగా గుర్తించడానికీ, సమన్వయ విషయాలకు సంబంధించి ఏదైనా సమస్యలను పరిష్కరించడానికీ, మంత్రిత్వ శాఖ ఇప్పటికే సంబంధిత రాష్ట్రాలకు లేఖలు రాసింది.


ప్రాజెక్ట్ పురోగతిపై వారానికొకసారి చొప్పున నిరంతర పర్యవేక్షణ.

Posted On: 01 SEP 2020 1:18PM by PIB Hyderabad
ప్రత్యేకంగా సరకు రవాణా మార్గం కోసం ఏర్పాటైన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (డి.ఎఫ్.‌సి.సి.ఐ.ఎల్) పురోగతిని, రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ఈ సమావేశంలో - సి.ఆర్.బి. మరియు డి.ఎఫ్.‌సి.సి.ఐ.ఎల్.  మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు రైల్వే బోర్డు మరియు డి.ఎఫ్.‌సి.సి.ఐ.ఎల్. కు చెందిన ఉన్నతాధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా  ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత స్థితిని సీనియర్ అధికారులు ఈ సమావేశంలో వివరించారు. 

పశ్చిమ డి.ఎఫ్.‌సి. (1504 కిలోమీటర్ల మార్గం) మరియు తూర్పు డి.ఎఫ్.‌సి. (1856 కిలోమీటర్ల మార్గం) ల్లోని పనులు వేగవంతం చేయడానికి వీలుగా సంబంధిత అన్ని విభాగాలపై చర్యలు తీసుకోవాలని శ్రీ గోయల్ డి.ఎఫ్.‌సి.‌సి.ఐ.ఎల్. యాజమాన్య బృందాన్నీ, కాంట్రాక్టర్లను ఆదేశించారు.  ప్రతి ఒక్క విభాగం యొక్క పురోగతి గురించి ఈ సమీక్షా సమావేశంలో వివరంగా చర్చించారు. అన్ని అడ్డంకులను పరిష్కరించడం ద్వారా సున్నితమైన పురోగతిని నిర్ధారించడానికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. 

ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర మంత్రి సూచించిన చర్యలలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి :-

i)     కాంట్రాక్టర్లు, విక్రేతలు, సరఫరాదారులందరితో ప్రతీ వారం సమావేశాలను నిర్వహించాలి;

ii)     నిర్ణీత సమయ వ్యవధికి ముందు తమ పనిని చేపట్టి, పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న కాంట్రాక్టర్లకు ఏవైనా ప్రోత్సాహకాలను అందించే అవకాశాన్ని పరిశీలించాలి; 

iii)     'ప్రతి కిలోమీటర్ వారీగా' ప్రాజెక్ట్ వాస్తవ పర్యవేక్షణ, తదుపరి చర్యల అనుసరణ కోసం, డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్. ద్వారా డాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలి.  ఇది రైల్వే బోర్డు అధికారులకు కూడా అందుబాటులో ఉంటుంది.   కాంట్రాక్ట్ అమలు విషయాలన్నింటినీ అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించడంలో డాష్ బోర్డు సహాయపడుతుంది.  కాంట్రాక్ట్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి, డాష్ బోర్డు సంస్థాగత యంత్రాంగం లా కూడా వ్యవహరిస్తుంది.

కాంట్రాక్టర్లందరి పనులను కఠినంగా పర్యవేక్షించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రాలతో సమన్వయంతో సహా అన్ని సమస్యల పరిష్కారాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని నిర్ణయించారు.  పెండింగ్‌లో ఉన్న స్థల వివాదాలు, ఆర్.‌ఓ.బి. లు, శాంతి, భద్రతల వంటి సమస్యలను పరిష్కరించాలని మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని సంబంధిత రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ప్రత్యేకంగా సరకు రవాణా మార్గాలు (డి.ఎఫ్.సి) అంటే భారత ప్రభుత్వం చేపట్టిన మొత్తం 3360 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటి.  ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 81,459 కోట్ల రూపాయలు.  ప్రత్యేకంగా సరకు రవాణా మార్గాలకు సంబంధించిన ప్రణాళిక, అభివృద్ధి, ఆర్థిక వనరుల సమీకరణ, నిర్మాణం, నిర్వహణ మరియు కార్యకలాపాలను చేపట్టడానికి ప్రత్యేక ప్రయోజన సంస్థగా డి.ఎఫ్.‌సి.సి.ఎల్. ‌ను ఏర్పాటు చేశారు.

*****

 



(Release ID: 1650471) Visitor Counter : 136