రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్పటి వరకు అత్యధికంగా ప్రాజెక్టులను అవార్డు చేసిన‌ ఎన్‌హెచ్‌ఏఐ

- ఏప్రిల్-ఆగస్టు మ‌ధ్య కాలంలో రూ.31,000 కోట్ల విలువైన‌ 744 కిలోమీటర్ల నిడివి గల 26 ప్రాజెక్టుల ప్రదానం

- గ‌డిచిన మూడేండ్లలోని ఇదే కాలంతో పోలిస్తే.. ఇప్పటి వరకూ ఇది అత్యధికం

Posted On: 31 AUG 2020 5:41PM by PIB Hyderabad

న‌వ్య కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప‌లు సవాళ్లు ఎదురైన‌ప్ప‌టికీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ).. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధిక సంఖ్య‌లో ప్రాజెక్టుల్ని అవార్డు చేసింది.
ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్-ఆగస్టు మ‌ధ్య కాలంలో రూ.31,000 కోట్ల విలువైన‌ 744 కిలోమీటర్ల నిడివి గల 26 ప్రాజెక్టుల్ని ఎన్‌హెచ్ఏఐ ప్రదానం చేసింది. గ‌త
మూడు సంవత్సరాల కాలంలోని ఇదే స‌మ‌యంలో ప్ర‌దానం చేసిన‌ ప్రాజెక్టులతో పోలిస్తే ఇదే అత్యధికం. ఎన్‌హెచ్ఏఐ 2019-20 ఏప్రిల్-ఆగస్టు మ‌ధ్య కాలంలో  మొత్తం 676 కి.మీ., 2018-19 ఏప్రిల్-ఆగస్టు మ‌ధ్య కాలంలో మొత్తం 368 కి.మీ., 2017-18 ఏప్రిల్-ఆగస్టు మ‌ధ్య కాలంలో 504 కి.మీ. నిడివి గల రోడ్డు ప్రాజెక్టుల‌ను అవార్డు చేసింది. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు అవార్డు చేసిన 26 ప్రాజెక్టుల మూలధన వ్యయం రూ.31,000 కోట్లకు పైగా ఉంది. ఇందులో పౌర నిర్మాణ వ్యయం, భూసేకరణ మరియు ఇతర నిర్మాణానికి పూర్వ కార్యకలాపాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ఏఐ ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రం 4500 కి.మీ. మేర ర‌హ‌దారి ప‌నుల‌ను అవార్డు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఏడాది లక్ష్యం అధిగమించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ మ‌రియు ప్ర‌స్తుతం అనిశ్చిత‌పు పరిస్థితి ఉన్నప్పటికీ, ఈ రంగం యొక్క బిడ్డర్లలో విశ్వాసం కలిగించడానికి ఎన్‌హెచ్ఏఐ సంస్థ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. నిర్మాత‌ల‌కు న‌గ‌దు ల‌భ్య‌త స‌మ‌స్యను తగ్గించడానికి మరియు కాంట్రాక్టర్లకు నగదు ప్రవాహాన్ని నిర్ధారించడానికి గాను వివిధ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. లాక్‌డౌన్ వంటి ప‌రిస్థితుల వ‌ల్ల కార్యాలయం మూసివేసిన‌ప్ప‌టికీ..  చెల్లింపులు ఆలస్యం కాకుండా ఎన్‌హెచ్ఏఐ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప‌లు డిజిటల్ వేదిక‌ల్ని ఉపయోగించి.. లాక్‌డౌన్ సమయంలో ఈ ఏడాది మార్చిలో దాదాపు రూ.10,000 కోట్ల మేర నిధుల‌ను నిర్మాణ ప‌నుల నిమిత్తం వెండ‌ర్ల‌‌కు అందించింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికంలో ఎన్‌హెచ్‌ఏఐ దాదాపుగా రూ.15 వేల కోట్ల నిధుల‌ను వెండ‌ర్ల‌కు అందించింది. అదనంగా, కాంట్రాక్టర్లకు నెలవారీ చెల్లింపులు వంటి చర్యలు తీసుకున్నారు. బిడ్డ‌ర్ల‌ను ప్రోత్స‌హించే ఇలాంటి చ‌ర్య‌లు.. వారు ఆయా నిర్మాణ ప‌నుల‌లో భాగస్వాములు అయ్యేలా చేశాయి. ఫలితంగా రహదారి రంగం వృద్ధిపై మేటి ప్రభావం క‌నిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన‌ప్ప‌టికీ జాతీయ ర‌హ‌దారుల నిర్మాణం విస్తర‌ణ‌తో.. ఎన్‌హెచ్ఏఐ ఈ సంవత్సరానికి మంచి ప్రారంభాన్ని పొందింది. జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడానికి ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉంది. జాతీయ రహదారులపై సురక్షితమైన, మృధువైన మరియు అతుకులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు గాను ఎన్‌హెచ్ఏఐ కృషి చేస్తోంది.
                               

***



(Release ID: 1650223) Visitor Counter : 145