ప్రధాన మంత్రి కార్యాలయం

స్థానిక బొమ్మల ఖ్యాతిని చాటాలని మన్ కీ బాత్ లో చెప్పిన ప్రధానమంత్రి

Posted On: 30 AUG 2020 3:00PM by PIB Hyderabad

పిల్లలకు కొత్త కొత్త బొమ్మలు లభ్యమయ్యేలా చూడటం మరియు ఇండియాను బొమ్మల ఉత్పత్తి కేంద్రంగా మార్చే విషయమై గాంధీ నగర్ లోని బాలల యూనివర్సిటీ ,  కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎం ఎస్ ఎం ఈ  మంత్రిత్వ శాఖలతో తానూ జరిపిన చర్చలను గురించి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ తాజా సంచికలో మాట్లాడారు.  

బొమ్మల వల్ల చురుకుదనం పెరగడమే కాక మన కోరికలు తీరేందుకు తోడ్పడుతాయని ఆయన అన్నారు.  బొమ్మలు వినోదంతో పాటు మన మేధో వికాసానికి తోడ్పడి మన సంకల్పాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.  

బొమ్మలను గురించి గురుదేవ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన ఉపాఖ్యానాన్ని ప్రధాని గుర్తుచేశారు.   అసంపూర్తిగా ఉన్నదే మంచి బొమ్మ అని,  ఆట ఆడుకుంటూ పిల్లలు దానిని పూర్తి చేయాలనీ,  పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బొమ్మలు బయటికి తేవాలని గురుదేవ్ తరచుగా చెప్పే వారని ఆయన వెల్లడించారు.  

పిల్లల జీవితాలకు సంబంధించిన వివిధ అవస్థలలో బొమ్మల ప్రభావాన్ని గురించి జాతీయ విద్యా విధానంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని ప్రధానమంత్రి  ప్రముఖంగా తెలిపారు.  మంచి బొమ్మలు తయారుచేసే కళాకారులెందరో మన దేశంలో ఉన్నారని,  కర్ణాటకలో చెన్నపట్టణ ,  రామనగరం ,  ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని  కొండపల్లి , తమిళనాడులోని తంజావూరు,  అస్సాం లోని దుబారి,  ఉత్తరప్రదేశ్ లోని వారణాశి కూడా బొమ్మల తయారీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా బొమ్మల పరిశ్రమ 7 లక్షల కోట్లకు పైగా విలువైన బొమ్మలను తయారు చేస్తుండగా దానిలో ఇండియా వాటా చాలా కొంచమని అయన తెలిపారు.  

విశాఖపట్నానికి చెందిన శ్రీ సి. వి. రాజు కృషి వల్ల ఏటికొప్పాక బొమ్మలకు ఘనకీర్తి వచ్చిందని.  స్థానిక బొమ్మలకు మంచి గుర్తింపు వచ్చిందని,   బొమ్మల తయారీ రంగంలో ప్రవేశించి బొమ్మల కళాకారులతో కలసి స్థానిక బొమ్మల ఖ్యాతిని ఎల్లెడలా వ్యాపింపజేయాలని ప్రధాని అన్నారు.  

ఇప్పుడు ఎక్కువగా కంప్యూటర్ గేములు ఆడుతున్నారని,  మన చరిత్ర చదివితే కలిగే   కలిగే భావనలు, అభిప్రాయాలపై ఆధారపడిన
ఆటలను రూపొందించాలని అన్నారు.  

***


(Release ID: 1649911)