ఉప రాష్ట్రపతి సచివాలయం
మహమ్మారి సమయంలో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు
వృద్ధాప్య జనాభా నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఆరోగ్య వ్యవస్థను కొత్త రూపమివ్వాల్సిన అవసరం ఉంది
సీనియర్ సిటిజన్లను బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వ్యవస్థల వద్ద ఎక్కువ కాలం నిలబెట్టిఉంచడం మన నాగరిక విలువలకు వ్యతిరేకం - ఉపరాష్ట్రపతి
పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం యువకులతో సహా అందరి పవిత్రమైన కర్తవ్యం - ఉపరాష్ట్రపతి
సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అవసరం
మన పూర్వపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు
Posted On:
30 AUG 2020 1:46PM by PIB Hyderabad
మన వృద్ధుల పట్ల ముఖ్యంగా ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య పరంగా ఎక్కువ ప్రమాదం పెద్దవారికి ఉంది కాబట్టి, అటువంటి వారు మన ఇంట్లో ఉంటే వారి పట్ల కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘భారతదేశంలో వృద్ధ జనాభాకు సంబంధించిన సమస్యలపై’ ఈ రోజు ఫేస్‌బుక్ పోస్టులలో ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, వృద్ధాప్య ఆరోగ్య సమస్యలను చూసుకోవటానికి జిల్లా ఆసుపత్రులలో ఒక ప్రత్యేక వృద్ధుల కోసం ప్రత్యేక విభాగం అరుదుగా ఉంటుందని అన్నారు. తరచూ వయో వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి, వారిని దృష్టిలో పెట్టుకునే ఆరోగ్య వ్యవస్థ లోను, బీమా సౌకర్యం విషయంలోనూ తగు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని శ్రీ వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు.
బహిరంగ ప్రాంతాల్లో వృద్ధుల కోసం ఇబ్బందులు లేని మార్గాన్ని ఇవ్వాలని, వారి అవసరాలకు తగు విధంగా మార్గం సుగమం చేయాలనీ అన్నారు.
సీనియర్ సిటిజన్లకు సంబంధించిన వివిధ పథకాల గురించి శ్రీ వెంకయ్య నాయుడు ప్రస్తావిస్తూ, ఈ దిశగా ప్రభుత్వాల విధానాలు ఉన్నప్పటికీ, వివిధ సేవలు అందుకోవడంలో ఇంకా వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చాల సందర్భాల్లో పెద్దవారు బ్యాంకుల, పబ్లిక్ స్థలాలు, బస్సులు, రైళ్లు దగ్గర చాల సేపు నిల్చొని ఉండాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. " ఇది భగవాన్ శ్రీ రాముడు, శ్రావణ కుమార్ వంటి గొప్ప వ్యక్తులు ప్రతీకలుగా ఉన్నారని మనం గర్విస్తున్న మన 5000 సంవత్సరాల నాటి నాగరికతకు ఈ వైఖరి వ్యతిరేకంగా ఉంటుంది" అని శ్రీ వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ విషయంలో, వృద్ధులకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వ అధికారులు, ప్రజలను పెద్దగా అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
సీనియర్ సిటిజన్లు జ్ఞానం, వివేకాల భాండాగారాలని తెలిపిన ఉపరాష్ట్రపతి, వారి జీవితాల మలి సంధ్యలో వారి పట్ల గౌరవం, ఆప్యాయత, శ్రద్ధ, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. “ఇది యువకులతో సహా ప్రతి ఒక్కరి పవిత్రమైన కర్తవ్యం జనాభా, అభివృద్ధిపై భారత పార్లమెంటేరియన్ల సంఘం తీసుకువచ్చిన 'భారతదేశంలో వృద్ధుల జనాభా' స్థితిపై ఇటీవలి నివేదికను ప్రస్తావిస్తూ, వృద్దులు 10 కోట్లకు పైగా ఉన్నారని అన్నారు. 60+ వయస్సు గల వ్యక్తుల సంఖ్య సాధారణంగా జనాభా కంటే వేగంగా పెరుగుతోందని తెలిపారు.
2050 నాటికి వృద్ధ జనాభా భారతదేశ జనాభాలో 20 శాతం ఉంటుందని నివేదిక సూచిస్తుంది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారని లేదా వారి పిల్లలపై ఆధారపడి ఉన్నారని కూడా నివేదిక చెబుతోంది… వారిలో చాలామంది దుర్భాష, నిందలు, ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. .
వృద్ధాప్య సమస్యలపై పార్లమెంటు సభ్యులు చట్ట సభల్లో తక్కువ ప్రశ్నలు మాత్రమే లేవనెత్తినందున వృద్ధులకు సంబంధించిన సమస్యలు సాధారణంగా తక్కువ దృష్టిని ఆకర్షిస్తాయనే వాస్తవాన్ని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆధునిక ఔషధాల వల్ల ఆయుర్దాయం పెరగడంపై శ్రీ నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు, కాని అదే సమయంలో ఆర్థిక, భావోద్వేగ సహకారం లేకపోవడం వంటి వృద్ధులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి కూడా ఆయన హెచ్చరించారు.
వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి, వారినే ఈ మొత్తం విశ్వంతో పోలుస్తూ పురాణాల్లో ఉన్న ఘటనలను శ్రీ వెంకయ్య నాయుడు ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఇప్పటి తరం ఇటువంటి పౌరాణిక కథలను ఆదర్శంగా తీసుకునే తల్లి దండ్రులు, పెద్దలను గౌరవించడాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతీయ సంస్కృతి, సమాజంలో తల్లిదండ్రులకు ఉన్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ, మనం చరణ స్పర్శ చేసినప్పుడు లేదా పెద్దల పాదాలను తాకినప్పుడు, వారి అభిమానం, జ్ఞానం మరియు అనుభవాన్ని గుర్తించి గౌరవిస్తున్నాం అని నిరూపితమవుతుందని ఆయన చెప్పారు.
పురాతన సామెతను ఉటంకిస్తూ- 'వృద్ధులకు భక్తితో సేవ చేయడం ద్వారా, దీర్ఘాయువు, కీర్తి మరియు శక్తితో ఆశీర్వాదం పొందిన వారు అవుతారు' అలాంటి ఉత్సాహపూరితమైన ఆలోచనల నుండి ప్రేరణ పొందాలని యువతను శ్రీ వెంకయ్య నాయుడు కోరారు. సీనియర్ సిటిజన్లను వృద్ధాశ్రమాలు కుటుంబ విలువలు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనమని శ్రీ నాయుడు అన్నారు. మన సమాజం దాని నైతిక దిక్సూచిని కోల్పోతుంటే, పాత ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో స్వాభావికమైన సామాజిక భద్రతకలిగి ఉంటుంది. పిల్లలు కుటుంబంలో తమ తాతామామలతో బలమైన మానసిక బంధాన్ని పెంచుకుంటారు. ఉమ్మడి కుటుంబాలను సౌకర్యవంతంగా మరియు భద్రతతో కలిపే ఒక రకమైన సహజీవనం ఉంది అని ఆయన అన్నారు.
****
(Release ID: 1649904)
Visitor Counter : 870