యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

60మందికి జాతీయ క్రీడా, సాహస పురస్కారాల ప్రదానం
అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఆన్ లైన్లో వర్చువల్ కార్యక్రమం

Posted On: 29 AUG 2020 5:48PM by PIB Hyderabad

  2020 సంవత్సరపు జాతీయ క్రీడా, సాహస పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రోజు ప్రదానం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు, క్రీడా వ్యవహారాల శాఖ కార్యదర్శి రవి మిట్టల్, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉషా శర్మ, మరి కొందరు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అనుమతితో, క్రీడా వ్యవహారాల శాఖ కార్యదర్శి రవి మిట్టల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్...) కేంద్రాలనుంచి అవార్డు విజేతలు ఆన్ లైన్ ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కొంతమంది అవార్డు విజేతలు,..విజ్ఞాన్ భవన్ లో కార్యక్రమానికి స్వయంగా  హాజరయ్యారు.

 

  సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ మహమ్మారి క్రీడా ప్రపంచాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని ఒలింపిక్ క్రీడోత్సవం వాయిదా పడిందని అన్నారు. కోవిడ్ కారణంగా దేశంలో క్రీడా కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయన్నారు. తగిన సాధన లేకపోవడం, పోటీల నిర్వహణ సాధ్యం కాకపోవడం క్రీడాకారుల, కోచ్ సన్నాహాలకు పెద్ద సవాలుగా మారిందని, తమకు అవసరమైన ప్రేరణ లభించలేదని వారు భావిస్తూ ఉండవచ్చని రాష్ట్రపతి అన్నారు. అయితే, సవాలును అధిగమించేందుకు క్రీడాకారులు, కోచ్ లు ఆన్ లైన్ ద్వారా అనుసంధానం కావడం సంతోషదాయకమని రాష్ట్రపతి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, క్రీడా సంబంధమైన కార్యకలాపాలను కొనసాగించాలన్న ప్రయత్నంలో భాగమే నేటి కార్యక్రమ నిర్వహణ అని కోవింద్ పేర్కొన్నారు.

   దేశంలో విభిన్నమైన క్రీడాంశాలు పెరగడంపట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. నాటి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న విజేతల ద్వారా 20 క్రీడాంశాలకు ప్రాతినిధ్యం లభించిందన్నారు. మన సంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖో-ఖో, మల్లఖాంబ్ వంటివాటికి ప్రజాదరణ పెరగడం, క్రీడల ద్వారా సామాన్య ప్రజల మధ్య అనుసంధానానికి దోహదపడుతుందన్నారు. క్రికెట్, ఫుట్ బాల్ క్రీడలే కాకుండా, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో లీగ్ టోర్నమెంట్లకు ప్రజాదరణ పెరుగుతోందని, ఇది హర్షణీయమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.

 రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం దయచేసి లింక్ ను క్లిక్ చేయండి.

 

  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూకరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఆయా అంశాల్లో విజేతలకు పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించిన రాష్ట్రపతికి  కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. గౌరవ రాష్ట్రపతి స్వయంగా పురస్కారాలను ప్రదానం చేసిన మొట్టమొదటి వర్చువల్ కార్యక్రమం ఇదేనని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్రపతి పాలుపంచుకోవడం యువ క్రీడాకారులకు ప్రోత్సాకరంగా ఉంటుందని, వారు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని మరింత పురోగమించేందుకు దోహదపడుతుందని అన్నారు. తమతో కలసి ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్న క్రీడాకారులకు, దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలనుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్..సి) ద్వారా అనుసంధానంతో కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. క్రీడలు, సాహస కృత్యాల రంగంలో ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు ఇందుకు ఉదాహరణలని అన్నారు. క్రీడల్లో అభివృద్ధి కోసం తాము దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేశామని, 2028లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో పతకాలు గెలిచే తొలి పది దేశాల జాబితాలో భారత్ కు స్థానం ఉండాలన్నదే తమ లక్ష్యమని మంత్రి అన్నారు. క్రీడలను, క్రీడాకారులకు మద్దతు ఇవ్వాల్సిందిగా తాను సందర్భంగా దేశ ప్రజలందరినీ కోరుతున్నానన్నారు. అవార్డు విజేతలు సాధించిన విజయాలు తరాన్నంతటికీ స్ఫూర్తిని కలిగించి, వారు క్రీడల్లో ప్రవేశించేలా చేస్తాయన్నారు.

 

   క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును, గత నాలుగేళ్లలో క్రీడల్లో అద్భుతమైన, విశేషమైన ప్రతిపాటవాలను ప్రదర్శించినందుకు గుర్తింపుగా ఇస్తారు. అవార్డు సారి ఐదుగురిని వరించింది. క్రికెటర్ రోహిత్ శర్మ, మల్లయోధుడు వినేశ్ పోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా, హాకీ ప్లేయర్ రాణీ రాంపాల్, ప్యారా అథ్లెట్ మరివప్పన్ తంగవేలు అవార్డును అందుకున్నారు. గత నాలుగేళ్లలో సుస్థిరమైన ఆటతీరుకు, ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డును ప్రదానం చేస్తారు. షూటర్లు సౌరభ్ చౌధరి, మనూ భాకర్, కుస్తీ క్రీడాకారిణి దివ్యా కాక్రాన్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, బాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు చిరాగ్ షెట్టి, సాత్వికా సాయిరాజ్ రంకిరెడ్డి సారి అర్జున అవార్డు గెలుచుకున్నారు. ఖో-ఖో, కబడ్డీ, అశ్వక్రీడ, శీతాకాల క్రీడలకు చెందిన క్రీడాకారులు కూడా సారి అర్జున పురస్కారాలు అందుకున్నారు. ఇక ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు తెచ్చిన వారికి తర్ఫీదు ఇవ్వడంలో కీలక పాత్ర వహించిన కోచ్ లను ద్రోణాచార్య అవార్డుతో సత్కరిస్తారు. జీవితకాలంలో క్రీడల అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ధ్యాన్ చంద్ అవార్డు ఇస్తారు. క్రీడలకు ప్రోత్సహించడం ద్వారా, క్రీడాభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించిన ప్రైవేటు, ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కారాన్ని అందిస్తారు.  అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీల్లో మొత్తమ్మీద అగ్రశ్రేణి ప్రతిభ చూపించిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా ట్రోఫీ) అవార్డును ప్రదానం చేస్తారు. క్రీడా పురస్కారాలకు అదనంగా,..ప్రజల్లో సాహస కృత్యాల్లో పాల్గొనే స్ఫూర్తిని కలిగించేందుకు, అలాంటి వాటిల్లో ప్రతిభను గుర్తించేందుకు టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని అందిస్తున్నారు

 

క్రీడా పురస్కారాలను అందుకున్న విజేతల జాబితాకోసం లింక్ ను క్లిక్ చేయండి.

****(Release ID: 1649692) Visitor Counter : 17