ఆర్థిక మంత్రిత్వ శాఖ

2020-21 సంవత్సర‌పు జీఎస్టీ పరిహార అవసరాల్ని తీర్చడానికి గాను రుణ ఐచ్ఛికాలు

Posted On: 29 AUG 2020 3:45PM by PIB Hyderabad

27 ఆగస్టు, 2202న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 41 వ సమావేశంలో జరిగిన చర్చల మేర‌కు.. 2020-21 సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ పరిహారపు అవసరాన్ని తీర్చడానికి గాను రుణాలు తీసుకునే విష‌య‌మై రెండు ఐచ్ఛికాలు రాష్ట్రాలకు తెలియజేయబడ్డాయి. ఈ ప్రెస్ నోట్‌తో జతచేయబడిన పత్రం ప్రకారం ఆయా రాష్ట్రాలు త‌మకు న‌చ్చిన‌ ఐచ్ఛికాన్ని ఏడు పని దినాలలో తెలియ‌జేయాల‌ని కోరడ‌మైంది. ఈ విష‌య‌మై ఏవైనా సమస్యలు ఉంటే స్పష్టత ఇవ్వడానికి గాను సెప్టెంబర్ 1వ తేదీన కేంద్ర ఆర్థిక కార్యదర్శి, కార్యదర్శి (వ్యయం) తో రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశం నిర్వ‌హించ‌నున్నారు.

అనుబంధ ద‌స్త్రాన్ని వీక్షించేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి

 

*****(Release ID: 1649508) Visitor Counter : 77