శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సైన్స్ టెక్నాలజీ ఇన్నొవేషన్ పాలసీ (ఎస్‌టిఐపి)2020 రూపకల్పనలో పాలుపంచుకోవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్.
ఎస్.టి.పిపై దేశవ్యాప్తంగా ఆలోచనా పరులతో ప్రత్యేక సమావేశాలకు సంబంధించి సంభాషణ కార్యక్రమం ‘ఇన్ కాన్వర్సేషన్ విత్’ ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్దన్.
మై గవ్ పోర్టల్ లో ఎస్.టి.ఐ.పి 2020 పేజి, దీనితోపాటు పిల్లల కోసం పాపులరైజేషన్ క్విజ్ కూడా ప్రారంభం.
“ప్రతిపాదిత ఎస్.టి.ఐ పాలసీ లక్షలాది మంది యువ భారతీయ శాస్త్రవేత్తలు, విద్యార్ధుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలి”--డాక్టర్ హర్షవర్ధన్.
Posted On:
28 AUG 2020 7:32PM by PIB Hyderabad
దేశంలో సాక్ష్యాధారాలతో కూడిన, సైన్సు టెక్నాలజీ ఇన్నొవేషన్ పాలసీ(ఎస్‌టిఐపి2020) కి రూపకల్పన చేయడంలో స్టేక్ హోల్డర్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కేంద్ర సైన్సు, టెక్నాలజీ, భూ విజ్ఞాన శాస్త్రం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. ఇది స్వావలంబన సాధించడానికి సాంకేతిక దేశీయతను తీసుకువస్తుందని, అభివృద్ధి , పరిశోధనతో సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలను తీసుకువస్తుందని, పరిశ్రమ-విద్యాసంస్థలను బలోపేతం చేస్తుందని, ప్రభుత్వ అనసంధానత, సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.
ఇన్ కన్వర్సేషన్ విత్, పేరుతో దేశవ్యాప్తంగా గల ఆలోచనా పరులు, ప్రముఖులతో ప్రతిపాదిత ఎస్‌టిఐపి 2020 పై నిర్వహిస్తున్న సంభాషణ కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు.మై గవ్ పోర్టల్ లో ఎస్‌టిఐపి 2020 పేజీని కూడా ఆయన ప్రారంభించారు.అలాగే పాఠశాల విద్యార్ధుల కోసం పాపులరైజేషన్
పాపులరైజేషన్ క్విజ్ కార్యక్రమాన్ని వర్చువల్ ఈవెంట్‌లో ఆగస్టు 28,2020న ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ హర్ష వర్ధన్, ఇటీవలి కాలంలో ఎస్.టి.ఐ పరిస్థితులలో మార్పులు వచ్చాయని అన్నారు. దీనిని విధాన రూపంలోకి తీసుకురావాలని దేశ అభివృద్ధి, దార్శనికతకు ఇది ఉపయోపడాలని అన్నారు. అంతేకాకుండా, కోవిడ్ -19 కొన్ని అనుభవాలను ఇచ్చిందని, ఎస్.టి.ఐ వ్యవస్థకు కొత్త కోణాన్ని జోడించిందని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంపై మరింత దృష్టిపెట్టాలని, క్షేత్ర స్థాయిలో నవకల్పనలను ప్రోత్సహించాలని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. వివిధ రంగాలపై ప్రభావం చూపే సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకుంటున్నదని దీనినుంచి దేశం ప్రయోజనం పొందాలని ఆయన అన్నారు.
ప్రతిపాదిత ఎస్.టి.ఐ విదానం ఇటీవలి కాలంలో జరిగిన ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, కోట్లాది మంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యార్థుల కలలను ఆకాంక్షలను నెరవేర్చేందుకు వీలుగా దీర్ఘకాలిక మార్గాన్ని నిర్మించవలసి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. దీనిని మనం సమష్టిగా, అందరి భాగస్వామ్యంతో మాత్రమే రూపకల్పన చేయగలమని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
విధాన రూపకల్పన విధానాన్ని వివరిస్తూ మంత్రి, ఎస్.టి.ఐపి-2020 ప్రక్రియను నాలుగు అనుసంధానిత కార్యక్రమాలుగా విభజించడం జరిగిందన్నారు. ట్రాక్ -1 కింద ప్రజలు , నిపుణుల సంప్రదింపులు ఉంటాయి, ఇవి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసిస్తున్న ప్రతి పౌరుడి నుంచి వారి ఆలోచనలు, సూచనలు లేదా వారి వ్యాఖ్యలను తెలుసుకోవడం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరుగుతుంది. ట్రాక్ -2 కింద నిపుణులతో సంప్రదింపులు చ ఏస్తారు, ట్రాక్ -3 కింద మంత్రిత్వశాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు ఉంటాయి. ట్రాక్ -4 కింద ఉన్నత స్థాయి సంప్రదింపులు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, ప్రస్తుత కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఇండియా, ప్రపంచ దేశాలూ తమను తాము పునర్‌నిర్వచించుకుంటున్న దశలో ఎస్.టి.ఐ.పి 2020 విధాన రూపకల్పనకు ప్రస్తుత కీలక దశలో ప్రభుత్వం చొరవ తీసుకోవడం చరిత్రాత్మకమని ఆయన అన్నారు. ఈ విధాన రూపకల్పన కూడా సమ్మిళిత సంప్రదింపుల ద్వారా భాగస్వామ్య పద్ధతిలో వివిధ కార్యకలాపాలను అనుసంధానం చేయడం ద్వారా రూపుదిద్దుకోబోతున్నదని ఆయన అన్నారు.
అనంతరం జిరగిన చర్చకు డిఎస్‌టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మోడరేటర్‌గా వ్యవహరించారు. డాక్టర్ హర్షవర్ధన్ ఎస్.టి.ఐ పరిస్థితిపై , ఎస్.టి.ఐ సంబంధిత అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లైవ్ వెబెక్స్ ప్లాట్‌ఫారం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. వారి నుంచి వినూత్న సూచనలను కూడా స్వీకరించారు. ఈ చర్చల ద్వారా వస్తున్న సూచనలు ఎస్.టి.ఐ.పి 2020 విధాన రూపకల్పన ప్రక్రియలో కీలక సమాచారంగా ఉపయోగపడనున్నాయి.
వర్చువల్ సమావేశంలో పాల్గొన్నవారిలో, డాక్టర్ అఖిలేష్ గుప్త, హెడ్-పాలసీ ప్లానింగ్, శ్రీ అభిషేక్ సింగ్, సిఇఒ, మైగవ్, శ్రీ ఆదిత్య కౌశిక్ , సహ వ్యవస్థాపకుడు సైన్స్ పాలసీ ఫోరం, డాక్టర్ రబీంద్ర పాణిగ్రాహి, డి.ఎస్.టి శాస్త్రవేత్త, డాక్టర్ నమిత పాండే, డిఎస్‌టి -ఎస్‌టిఐ పాలసీ ఫెలో,అలాగే భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్రవిజ్ఞాన సలహాదారు కార్యాలయం, సాంకేతిక నిపుణులు డాక్టర్ చగున్ బాషా లు ఉన్నారు.
హైపర్ లింక్‌లు:
ఎస్.టి.ఐ.పి-2020 కి సంబంధించి నేపథ పత్రం
తయారీ ప్రక్రియకు సంబంధించిన ఉపోద్ఘాతం
గత ఆరు సంవత్సరాల ప్రయాణం- శాస్త్ర విజ్ఞాన, భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ
*****
(Release ID: 1649469)
Visitor Counter : 194