వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా "పోషణ్ మాహ్" కార్యక్రమాలు నిర్వహించనున్న 'ఆహారం&ప్రజా పంపిణీ విభాగం'
Posted On:
28 AUG 2020 7:33PM by PIB Hyderabad
కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన "పోషణ్ మాహ్"ను వచ్చేనెలలో నిర్వహించనున్న నేపథ్యంలో.. భారత ఆహార సంస్థ సీఎండీ, ఇతర సీనియర్ అధికారులతో ఆహారం&ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సమావేశం నిర్వహించారు.
ఏటా సెప్టెంబర్ మాసంలో "పోషణ్ మాహ్" నిర్వహిస్తారు. దీనిలో భాగంగా, కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆహారం&ప్రజా పంపిణీ విభాగం నిర్ణయించింది. పోషకాహార భద్రతపై, లక్ష్యంగా ఎంచుకున్న ప్రజా సమూహాల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం.
***
(Release ID: 1649383)
Visitor Counter : 167