ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తదుపరి తరం స్టార్టప్ ఛాలెంజ్ పోటీ చునౌతిని ప్రారంభించిన కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ కార్యక్రమం, ఎంపిక చేసిన అంశాలలో పనిచేస్తున్న 300 స్టార్టప్‌లను గుర్తించేందుకు, వీటికి రూ 25 లక్షల సీడ్ ఫండ్, ఇతర సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించినది.
బీహార్ లోని ముజఫర్‌పూర్‌లో ఎన్.ఐ.ఇ.ఎల్.ఐ.టి కి చెందిన ఐటి సామర్ధ్యాల నిర్మాణ సంస్థకు శంకుస్థాపన.
దేశంలోని యువ, ప్రతిభావంతులైన ఆవిష్కర్తలు ముందుకు వచ్చి , చునౌతి సవాలును స్వీకరించి దాని ప్రయోజనాలు పొందవలసిందిగా, నూతన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు యాప్‌లు రూపొందించాల్సిందిగా శ్రీ రవిశంకర్ ప్రసాద్ పిలుపు
Posted On:
28 AUG 2020 4:18PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఈరోజు , తదుపరి తరం స్టార్టప్ సవాలు పోటీ చునౌతి ని ప్రారంభించారు. దేశంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మూడు సంవత్సరాల కాలానికి 95.03 కోట్ల రూపాయలను కేటాయించింది. దీనికింద ఎంపిక చేసిన రంగాలలో పనిచేస్తున్న 300 స్టార్టప్‌లను గుర్తించి, వీటికి 25 లక్షల రూపాయల మేరకు సీడ్ ఫండ్‌ను , ఇతర సదుపాయాలను కల్పించనుంది.
ఈ సవాలు కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ కింది రంగాలలో స్టార్టప్‌లను ఆహ్వానించనుంది.
ప్రజలకు ఎడ్యు-టెక్, అగ్రి -టెక్, ఫిన్-టెక్ సొల్యూషన్లు
సరఫరా చెయిన్, లాజిస్టిక్స్, రవాణా మేనేజ్‌మెంట్
మౌలికసదుపాయాలు, రిమోట్ మానిటరింగ్
వైద్య ఆరోగ్య సంరక్షణ, వైద్య పరీక్షలు, ముందస్తు, మానసిక ఆరోగ్య సంరక్షణ
ఉద్యోగాలు, నైపుణ్యాలు, భాషా ఉపకరణాలు, సాంకేతికత
చునౌతి ద్వారా ఎంపికైన స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి దేశవ్యాప్తంగా గల సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కుల ద్వారా వివిధ రకాల మద్దతును కల్పించడం జరుగుతుంది. వారు ఇంక్యుబేషన్ సదుపాయాలు, మెంటార్‌షిప్, సెక్యూరిటీ టెస్టింగ్ సదుపాయం, వెంచర్ కాపిటల్ ఫండింగ్, పరిశ్రమ అనుసంధానం, న్యాయపరమైన సలహాలు, మానవ వనరులు (హెచ్.ఆర్), ఐపిఆర్, పేటెంట్ విషయాలలో సలహాలు పొందుతారు.దీనికితోడు 25 లక్షల రూపాయల వరకు సీడ్ ఫండ్ తో పాటు, ప్రముఖ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా క్లౌడ్ క్రెడిట్స్ పొందుతారు. ఆలోచన దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద ఎంపికచేసి, వాటికి ఆరునెలల వరకు మెంటారింగ్ చేస్తారు. వీటికి వ్యాపార ప్రణాళికలు, ప్రతిపాదిత ఆలోచనచుట్టూ ఉన్న సమస్యల పరిష్కారం వంటి వాటిపై సూచనలు ఇస్తారు. ప్రతి ఇంటర్నుకు (ప్రీ ఇంక్యుబేషన్ కింద స్టార్టప్‌లకు) నెలకు పది వేల రూపాయలు ఆరు నెలల కాలం అందిస్తారు.
స్టార్టప్‌లు ఎస్.టి.పి.ఐ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఈ లింక్‌ను క్లిక్ చేయవచ్చు.
https://innovate.stpinext.in/
కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి) డిజిటల్ శిక్షణ,నైపుణ్యాల కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రాన్ని భారతప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 9.17 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధిచేయనుంది. బీహార్ ప్రభుత్వం ఈ సంస్థకు ఒక ఎకరా స్థలాన్ని కేటాయించింది. ఈ కేంద్రానికి అధునాతన శిక్షణ సదుపాయాలు, డిజిటల్ లేబరెటరీ సదుపాయం కల్పించనున్నారు. ఓ-లెవల్, సిసిసి, బిసిసి , ప్రోగ్రామింగ్ , మల్టీమీడియా శిక్షణ, ఈ కేంద్రంలో ఇవ్వనున్నారు.
బీహార్ ఉపముఖ్యమంత్రి సమక్షంలో వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్, “ దేశంలోని ప్రతిభకలిగిన యువ ఆవిష్కర్తలు ముందుకు వచ్చి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న చునౌతి పోటీ అందిస్తున్న ప్రయోజనాలను అందిపుచ్చుకోవలసిందిగా కోరుతున్నాను. ఆ రకంగా కొత్త సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, యాప్‌లు రూపొందించాల్సిందిగా పిలుపునిస్తున్నాను. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్‌భారత్ పిలుపు మేరకు దీనిని ప్రారంభించడం జరిగింది ”. అని ఆయన అన్నారు.
***
(Release ID: 1649340)
Visitor Counter : 254
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam