భారత పోటీ ప్రోత్సాహక సంఘం
'ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్'లో 'కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు', ఈక్విటీ వాటాలు పొందేందుకు 'కంఫర్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ II'కు సీసీఐ అనుమతి
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2020 4:42PM by PIB Hyderabad
'ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్'లో 'కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు', ఈక్విటీ వాటాలు పొందేందుకు, 'కంఫర్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ II' పెట్టుకున్న ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతించింది. విలువగట్టడం పూర్తయిన తర్వాత, సీసీపీఎస్‌లను ఈక్విటీ వాటాలుగా మారుస్తారు.
'కంఫర్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ II', ప్రతిపాదిత కార్యకలాపాలు పూర్తి చేయడానికి మారిషస్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్. కార్లయిల్ గ్రూపునకు చెందిన సంస్థ ఇది. కార్లయిల్ గ్రూప్, ప్రత్యామ్నాయ ఆస్తి నిర్వహణ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పెట్టే పెట్టుబడులను ఇది నిర్వహిస్తుంది.
ఎన్‌ఎక్స్‌ట్రా డేటా లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ. దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో ఉన్న 10 సమాచార కేంద్రాల (ముంబయిలోని రెండు భాగస్వామ్య సమాచార కేంద్రాలతో కలిపి) ద్వారా క్లౌడ్ సర్వీసులను ఇది అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 1649030)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185