నీతి ఆయోగ్
జాతీయ నిర్దేశిత సహకారం(ఎన్.డి.సి) -ఆసియాకోసం రవాణా రంగానికి సంబంధించి (టిఐఎ) ఇండియా చర్యలను ఆగస్టు 27న ఆవిష్కరించనున్న నీతి ఆయోగ్
ఇండియాలో రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా తీర్చిదిద్దే విషయమై బహుళ పక్ష భాగస్వాములతో చర్చా వేదిక ఏర్పాటుపై దృష్టిపెట్టనున్న ఎన్‌డిసి-టిఐఎ
Posted On:
26 AUG 2020 6:32PM by PIB Hyderabad
జాతీయ నిర్దేశిత సహకారం(ఎన్.డి.సి) -ఆసియా కోసం రవాణా రంగానికి సంబంధించి (టిఐఎ) ఇండియా చర్యలను నీతి ఆయోగ్ ఆగస్టు 27 న ఆవిష్కరించనుంది,
దక్షిణాసియా విభాగం జిఐజెడ్ డైరక్టర్, కొరినా కుసెల్, జర్మన్ ఎంబసీ డిప్యూటీ అంబాసిడర్ స్టీఫెన్ గ్రభెర్‌లు ఈ సమావేశాన్ని ఆగస్టు 27 సాయంత్రం 6 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ కార్‌స్టెన్ శాచ్, డైరక్టర్ జనరల్ ఐ.కె., ఇంటర్నేషనల్ యూరోపియన్ పాలసీ మాట్లాడతారు.
నీతి ఆయోగ్ సి.ఇ.ఒ అమితాబ్ కాంత్ కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం ఇంటర్నేషనల్ ట్రాన్సుపోర్టు ఫోరం (ఐటిఎఫ్) సెక్రటరీ జనరల్ డాక్టర్ యంగ్ టే కిమ్ ప్రత్యేక ప్రసంగం చేస్తారు.
ఈ ఈవెంట్ ఇండియాలోని రవాణా, ఇంధన, వాతావరణ రంగాలకు చెందిన స్టేక్ హొల్డర్లకు, రాగల సంవత్సరంలో చేపట్టనున్న ప్రణాళికా బద్ధ కార్యకలాపాలను తెలియజేయనుంది.అలాగే భారతదేశ రవాణారంగ సవాళ్లు, అవి ఏ రకంగా కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు లక్ష్యాలతో సంబంధం కలిగి ఉన్నాయన్నది తెలియజేస్తుంది. ఈ చర్చ భారతదేశ ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన కార్యకలాపాలపై దృష్టిపెట్టడానికి దోహదపడుతుంది.
ఇండియా, వియత్నాం, చైనాలలో రవాణా రంగాన్ని కార్బన్ రహితం చేసేందుకు ఒక సమగ్ర విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఎన్‌డిసి-టిఐఎ ఒక సంయుక్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనికి జర్మన్ మినిస్ట్రీ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్, నేచర్ కన్సర్వేషన్, న్యూక్లియర్ సేఫ్టీ (బిఎంయు) కు చెందిన ఇంటర్నేషనల్ క్లైమేట్ ఇనిషియేటివ్ (ఐకెఐ) మద్దతు ఇవ్వనుంది. దీనిని ఏడు సంస్థల కాన్సార్టియం అమలు చేయనుంది. అవి:
1. జిఐజెడ్ జిఎంబిహెచ్
2.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్సుపోర్టేషన్ (ఐసిసిటి)
3. వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యుఆర్ఐ)
4.ఇంటర్నేషనల్ ట్రాన్సుపోర్టు ఫోరమ్ (ఐటిఎఫ్)
5.ఎ.జి.ఒ.ఆర్.ఎ
6. సుస్థిర, తక్కువ కార్బన్ రవాణా భాగస్వామ్య ఫౌండేషన్ (ఎస్.ఎల్.ఒ.సి.ఎ.టి)
7. 21వ శతాబ్దానికి పునరుత్పాదక ఇంధన విధాన నెట్‌వర్కు (REN21)
ఇండియా కాంపొనెంట్‌ను ఆరు కాన్సార్టియం సంస్థలు అమలు చేయనున్నాయి. ఎస్.ఎల్.ఒ.సిఎటి మినహా పై అన్ని సంస్థలు ఇందులో ఉన్నాయి. భారత ప్రభుత్వం తరఫున దేశ ప్రముఖ విధాన మేథోమధన సంస్జత నీతిఆయోగ్ అమలు భాగస్వామ్య సంస్థగా ఉంటుంది.
ఎన్.డి.సి-టిఐఎ కార్యక్రమం నాలుగు సంవత్సరాల వ్యవధి కలిగినది. ఇది ఇండియా ఇతర భాగస్వామ్య సంస్థలు జవాబుదారిత్వంతో కూడిన దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చడానికి వీలు కల్పిస్తుంది.ఇందుకు అనుగుణంగా వివిధ చర్యలు చేపట్టనున్నారు. ఇందులోని భాగస్వామ్య పక్షాలతో కలసి పరస్పర సహకారంతో కూడిన చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తమ తమ దేశాలలో ఎన్.డి.సిని సాధించడానికి 2025 రవాణారంగపు ఎన్‌డిసి లక్ష్యాలను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇండియాలో పెద్ద ఎత్తున , వైవిధ్యపూరిత రవాణా రంగం ఉంది. ఇది వంద కోట్ల మంది ప్రజల రవాణా అవసరాలు తీర్చుతుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్కు. ఇది అన్ని రకాల రవాణా ద్వారా గరిష్టంగా గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు కారణమౌతోంది. నానాటికీ పట్టణీకరణ పెరగడంతో , వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2030 నాటికి దేశంలో వాహనాల సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా.
ఎన్‌డిసి -టిఐఎ ఇండియా కాంపొనెంట్ ఇండియా, దేశంలో రవాణా రంగాన్ని కార్బన్ రహితం చేసేందుకు బహుళ పక్ష చర్చా వేదికపై దృష్టిపెట్టనుంది. ఇది జిహెచ్‌జిని , రవాణా నమూనా సామర్ద్యాలను బలోపేతం చేయడం, జిహెచ్‌జి ఉద్గారాల తగ్గిపంపు చర్యలకు సాంకేతిక మద్దతునివ్వడం, రవాణా రంగంలో వాతావరణ చర్యలకు ఫైనాన్సు సమకూర్చడం,విద్యుత్ వాహనాలకు సంబంధించిన సిఫార్సులు, డిమాండ్-సరఫరా విధానాలు, బిజినెస్ నమూనాల విశ్లేషణ వంటి వాటిపై దృష్టిపెడుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. ఇందుకు రవాణా, ఇంధన రంగాలను అనుసంధానం చేయడం, వివిధ మంత్రిత్వశాఖలనుంచి, డవలప్‌మెంట్ ఏజెన్సీలనుంచి, మేధోమధన సంస్థల నుంచి పబ్లిక్, ప్రైవేటు సంస్థలనుంచి నిపుణుల సూచనలు అవసరం. మొత్తంగా ఈ కార్యక్రమం విద్యుత్‌వాహనాలను ప్రోత్సహించడం , వాటికి చార్జింగ్ సదుపాయాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పెంపొందించడం, ఇండియాలో సులభంగా పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలు వినియోగించేట్టు చూసేందుకు తగిన విధానాలు, నియంత్రణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఎన్‌డిసి-టిఐఎ ప్రోగ్రామ్ బృందం భారత ప్రభుత్వ ఏజెన్సీలు , స్థానిక నిర్ణయాధికార వ్యక్తులు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, మేధావులు, పౌరసమాజ సంస్థలతో కలిసి సన్నిహితంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమం దేశంలోని ఎన్‌డిసి లక్ష్యాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ, రవాణా రంగ ఉన్నత ఆశయాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యకలాపాలను విజయవంతంగా అమలు చేయడానికి రాజకీయ సంకల్పం , ఆసక్తి అవసరం. కన్సార్టియం సభ్యులు , సంబంధిత స్టేక్ హోల్డర్లతో ప్రస్తుత కార్యకలాపాలకు సంబంధించిన చర్చ,ప్రస్తుతకార్యక్రమాల స్థితిగతుల అంచనాపై చర్చ ఆయా కార్యక్రమాల లక్ష్యాలకు సంబంధించి నిబద్ధతను సూచిస్తుంది.
ఏమిటి : జాతీయ నిర్దేశిత సహకారం(ఎన్.డి.సి) -ఆసియాకోసం రవాణా రంగానికి సంబంధించి (టిఐఎ) ఇండియా (NDC-TIA) ఆవిష్కరణ
ఎప్పుడు: 27 ఆగస్టు 18:00- 19:45 ఐ.ఎస్.టి
ఎక్కడ : యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ https://youtu.be/fEVcZZbhTxk
***
(Release ID: 1648921)
Visitor Counter : 312