ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

3.75 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ ద్వారా పౌరులకు ఉమాంగ్ యాప్ అందుబాటు

ఉమాంగ్ యాప్ ద్వారా 140 శాఖల ఈ-గవర్మెన్స్ సేవలు
అందుకోగలిగేలా పౌరులకు సిఎస్ సి ఆపరేటర్ల సహాయం

Posted On: 26 AUG 2020 6:58PM by PIB Hyderabad

 

సాధికారతకు శక్తినివ్వటం అనే డిజిటల్ ఇండియా దార్శనికతను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతోను, దేశమంతటా అందరినీ డిజిటల్ గా కలుపుకోవటానికి నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ ఈ నెల 26న కామన్ సర్వీసెస్ సెంటర్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.దీనివలన అన్ని కామన్ సర్వీస్ సెంటర్లలోను ఉమాంగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంటే, 3.75 లక్షల సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ ద్వారా ఉమాంగ్ యాప్ ను వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. గ్రామస్థాయి ఔత్సాహిక వ్యాపారులైన కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్లు 140 ప్రభుత్వ విభాగాల సేవలను పౌరులకు అందుబాటులోకి తెస్తారు. దీనివలన స్మార్ట్ ఫోన్ సౌకర్యం లేనివారు, సొంతగా యాప్ ఆధారిత ఈ-సేవలు అందుకోలేనివారు లబ్ధిపొందుతారు. ప్రభుత్వ సేవలు అందుకోవాలనుకునే జన బాహుళ్యానికి ఇదొక్కటే మార్గం. మరిన్ని సేవలను దీని పరిధిలోకి తీసుకురావటం ద్వారా కేంద్రాల నిర్వాహకులకు తగిన ఆదాయం వచ్చేట్టు చూడవచ్చునని భావిస్తున్నారు. అన్ని ఉమాంగ్ సేవలనూ సి ఎస్ సి మీద అందుబాటులో ఉంచుతున్నారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కామన్ సర్వీస్ సెంటర్లు ఒక వ్యూహాత్మకమైన మేలి మలుపు. వివిధ ఎలక్ట్రానిక్ సేవలు గ్రామాల్లో అందుబాటులోకి తీసుకు రావటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ ప్రభుత్వ విభాగాల సేవలను ఏకీకృతం చేసి మొబైల్ ప్లాట్ ఫామ్ ద్వారా అందించటమే ఉమాంగ్ ( నవతరం పాలనకు ఏకీకృత మొబైల్ అప్లికేషన్) ప్రత్యేకత. ఉమాంగ్, సి ఎస్ సి ల మధ్య ఇలాంటి అమూల్యమైన సహోత్తేజం ద్వారా 140 విభాగాలకు చెందిన వెయ్యికి పైగా సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల ఉమాంగ్ వేదికమీద చేరిన 140 విభాగాలకూ ఇది ఎంతో ప్రయోజనకరం. ఎలాంటి ఖర్చూ లేకుండా అక్కడే ఉండే సహాయకుని ద్వారా లావాదేవీలు పూర్తిచేయించుకోవటానికి సులువుగా ఉంటుంది.

 నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వశాఖ  ఈ ఉమాంగ్ ని అభివృద్ధి పరచాయి. దీన్ని 2017 నవంబర్ 23న ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఉమాంగ్ మొబైల్ యాప్ రకరకాల వేదికలమీద  రకరకాల ప్రజలకు వీలవుతుంది. యాప్ డౌన్ లోడ్ చేసుకోదలచిన వారు   ఇక్కడ చూడండి. 


మొబైల్ ఐఒఎస్ కావాల్సినవారు 97183-97183 కి స్పందించడి. .
ఉమాంగ్, సి ఎస్ సి లమేలు కలయిక మనదేశంలోని లక్షలాదిమంది పౌరులను సాధికారులను చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి సంక్షోభ సమయాలలో పరిస్థితిని సులభతరం చేయటం, భద్రత కల్పించటం లాంటివి అందరికీ సౌకర్యవంతంగా ఉంటాయి.

***



(Release ID: 1648898) Visitor Counter : 238