పర్యటక మంత్రిత్వ శాఖ

'ఏక్ భార‌త్.. శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని పెంపొందించేలా ఐహెచ్ఎం శ్రీనగర్, ఐహెచ్ఎం చెన్నై ఆన్‌లైన్ నృత్య కార్యక్రమం

-'తమిళనాడు, జమ్మూ & కాశ్మీర్, లడఖ్ యొక్క మనోహరమైన జానపద నృత్యాలు’ పేరిట నిర్వ‌హ‌ణ‌

Posted On: 26 AUG 2020 4:14PM by PIB Hyderabad

 

'ఏక్ భార‌త్ శ్రేష్ఠ భారత్‌' (ఈబీఎస్‌బీ) స్ఫూర్తిని పెంపొందించడానికి, పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఐహెచ్ఎం శ్రీనగర్ మరియు ఐహెచ్ఎం చెన్నై ఆన్‌లైన్‌లో నృత్య కార్యక్రమాన్ని నిర్వ‌హించాయి. ‘తమిళనాడు, జమ్మూ & కాశ్మీర్ & లడఖ్ యొక్క మనోహరమైన జానపద నృత్యాలు’ పేరిట ఈ వారం దీనిని నిర్వహించారు. ఈబీఎస్‌బీ ఆధ్వర్యంలో ఐహెచ్‌ఎం చెన్నై విద్యార్థులు మ‌రియు ఐహెచ్‌ఎం శ్రీనగర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జ‌త‌కూడి జానపద నృత్యాలు చేశారు. విద్యార్థులు రిమోట్‌లో ప్రదర్శ‌న చేసి.. వారి ప్ర‌తిభ‌ను రికార్డింగ్‌ చేసి.. స‌ద‌రు వీడియోను ఆన్‌లైన్‌లో పంచుకున్నారు. ఆన్‌లైన్ వేదిక‌ ఉపయోగించి నృత్యాలు ప్రసారం చేయబడ్డాయి. ఈ సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల జానపద నృత్యాల ప్రాముఖ్యత గురించి ప్రశంసిస్తూ నోడల్ అధికారి ప్రసంగం చేశారు. ఈ వినూత్న నృత్య కార్యక్రమాన్ని రెండు సంస్థ‌ల‌కు చెందిన విద్యార్థులు మరియు సిబ్బంది ఎంత‌గానో అభినందించారు.
తోలు బొమ్మల‌ ప్రదర్శన గురించి వివ‌ర‌ణ‌..
ఆయా ప్రదేశాల నుండి ప్రసిద్ధ జానపద నృత్యాలు, వివాహాలలో ప్రదర్శించే ఫోర్గ్ నృత్యాలు మరియు కాశ్మీర్‌లో కుడ్, దుమ్హాల్, రౌఫ్, హఫీజా, భండ్‌జాషన్ వంటి ప్రధాన కార్యక్రమాలకు సంబంధించి త‌గిన పరిచయం ఇవ్వబడింది. అదే విధంగా, తమిళనాడులోని గిరిజన నృత్యాలలో ఒకటైన‌ తోలు బొమ్మల‌ ప్రదర్శన గురించి వివ‌రించారు. సరళమైన రూపం నుండి పోయిక్కల్ కుతిరై అట్టం వరకు నృత్యాలు ఉన్నాయి, ఇందులో ప్రదర్శనకారులు మాయిల్ అట్టం కోసం నెమలిలా దుస్తులు ధరిస్తారు, పోయికల్కుతిరై చేస్తున్నప్పుడు గుర్రం వలె , కలైఅట్టంలో ఎద్దులాగా, పాంపు అట్టం కోసం పాము మరియు పాము కరాడిఅట్టంలో ఎలుగు బంటిలాగా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చే విధానం గురించి తెలియ చేశారు. ఇందులో పాల్గొన్న‌వారి సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు గొప్పతనాన్ని కొనియాడే అభినంద‌న‌ల మ‌ధ్య‌ ఈ కార్యక్రమం ముగిసింది. ప్రదర్శనకారులు మరియు పాల్గొన్న వారందరికీ ఈ-సర్టిఫికెట్లు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 192 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆన్‌లైన్ యూ ట్యూబ్ లింక్: https:// youtu.be/_nmxgeju68 EBSB పోర్టల్‌లో అందుబాటులో ఉంది. దీనికి తోడు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అందుబాటులో ఉంది.

 


'తమిళనాడు, జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ యొక్క మనోహరమైన జానపద నృత్యాలు' కార్య‌క్ర‌మంలో ఒక  దృశ్యం


'తమిళనాడు, జమ్మూ, కాశ్మీర్ & లడఖ్ యొక్క మనోహరమైన జానపద నృత్యాలు' కార్య‌క్ర‌మంలో ఒక దృశ్యం

 

 

***********

 



(Release ID: 1648848) Visitor Counter : 169