సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భారత పురావస్తు సర్వే లో ఏడు కొత్త సర్కిళ్ళు ప్రకటించిన సాంస్కృతిక మంత్రిత్వశాఖ

తిరుచ్చి, రాయిగంజ్, రాజ్ కోట్, జబల్పూర్, ఝాన్సి, మీరట్
కొత్త సర్కిల్స్ గాను, హంపీ ని పూర్తిస్థాయి సర్కిల్ గాను ప్రకటన

కొత్త సర్కిల్స్ పురావస్తు స్మారకాల పరిరక్షణ, నమోదు
ప్రక్రియను బలోపేతం చేస్తాయి: శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 26 AUG 2020 6:03PM by PIB Hyderabad

భారత పురావస్తు సర్వే లో ఏడు కొత్త సర్కిళ్ళను సంస్కృతి మంత్రిత్వశాఖ ప్రకటించింది. కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు ట్వీట్ చేసిన వీడియో సందేశంలో తెలియజేశారు. పురావస్తు స్మారకాల పరిరక్షణ, కళాకృతుల నమోదు ప్రక్రియను బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి పిలుపుమేరకు తమ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ పటేల్ వెల్లడించారు.  కొత్త సర్కిళ్ళు మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్టాల్లో కొత్త సర్కిళ్ళు ఏర్పాటు చేశామన్నారు. పురాతత్వ విభాగంలో తిరుచ్చి, రాయిగంజ్, జబల్పూర్, ఝాన్సి, మీరట్ కొత్తగా సర్కిల్ హోదా పొందగా అంతర్జాతీయ ఖ్యాతిపొందిన కర్నాటకలోని హంపీ మినీ సర్కిల్ ను ఇప్పుడు పూర్తి స్థాయి సర్కిల్ గా మార్చామన్నారు. ఇంతకుముందు దేశవ్యాప్తంగా 29 భారత పురావస్తు సర్వే సర్కిల్స్ ఉండేవని కూడా మంత్రి తెలియజేశారు.

పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో వేలాది ఆలయాలున్నాయని, చోళ రాజుల వైభవ స్మారకాలు అనేకం ఉన్నాయని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చెన్నై సర్కిల్ ఇప్పటికే ఉండగా ఇప్పుడు తిరుచ్చి సర్కిల్ ఏర్పాటు చేశామన్నారు. పవిత్రతలో ముఖ్యమైన స్థానం ఉన్న కర్నాటక రాష్ట్రంలోని హంపీ పురావస్తు పరంగా అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకుందన్నారు. అందుకే హంపీ సబ్ సర్కిల్ ను ఇప్పుడు పూర్తి స్థాయి సర్కిల్ గా స్థాయి పెంచినట్టు వివరించారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ఉన్న కోల్ కతా సర్కిల్ కు తోడుగా ఇప్పుడు రాయి గంజ్ సర్కిల్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందువలన పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో భౌగోళిక దూరాన్ని కూడా తగ్గించగలిగామన్నారు. గుజరాత్ లో ఇప్పటికే వడోదర ఒక సర్కిల్ గా ఉండగా ఇప్పుడు రాజ్ కోట్ ను కూడా ప్రకటించామని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో భోపాల్ కు తోడుగా ఇప్పుడు జబల్పూర్ ఒక సర్కిల్ గా మారిందన్నారు. దీంతో రేవా, షాదోల్, సాగర్ డివిజన్లలోని స్మారక చిఖ్నాలున్ దీని పరిధిలోకి వస్తాయన్నారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో, ఆగ్రా సర్కిల్స్ కు తోడుగా ఇప్పుడు  బుందేల్ ఖండ్ లోని ఝాన్సీని, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ను కూడా కొత్త సర్కిల్స్ లో చేర్చామని కేంద్రమంత్రి శ్రీ పటేల్ అన్నారు.

***



(Release ID: 1648845) Visitor Counter : 173