భారత పోటీ ప్రోత్సాహక సంఘం
జేబీ కెమికల్స్‌లో వాటాల కొనుగోలుకు టౌ ఇన్వెస్ట్‌మెంట్‌కు సీసీఐ అనుమతి
Posted On:
26 AUG 2020 5:59PM by PIB Hyderabad
జేబీ కెమికల్స్‌లో వాటాలను కొనుగోలు చేసేందుకు టౌ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకున్న ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అంగీకరించింది. జేబీ కెమికల్స్&ఫార్మాసూటికల్స్‌లో 64.9 శాతం వరకు వాటాను టౌ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టౌ ఇన్వెస్ట్‌మెంట్) దక్కించుకోవచ్చు.
టౌ ఇన్వెస్ట్‌మెంట్ సింగపూర్‌కు చెందిన సంస్థ. ఇది, 'కేకేఆర్ ఏసియన్ ఫండ్ III ఎల్‌పీ' పరోక్ష యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. నిధులు, వాహనాలకు సంబంధించినది. కేకేఆర్&కో పరోక్ష అనుబంధ సంస్థ అయిన కోహ్ల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్ &కో. L.P. సలహాలను అనుసరిస్తుంది.
జేబీ కెమికల్స్&ఫార్మాసూటికల్స్ భారతీయ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయింది.
***
(Release ID: 1648780)
Visitor Counter : 130