వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కాన్పూర్ లోని నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ఎక్జిక్యుటివ్ డవలప్‌మెంట్ కార్యక్రమం ప్రారంభం
ఆత్మనిర్భర్ సాధనకు ,చక్కెర ఫ్యాక్టరీలు జీవ ఇంధన కేంద్రాలుగా, ఇతర విలువ జోడింపు ఉత్పత్తులు, ప్రత్యేక రకాల చక్కెర తయారీ కేంద్రాలుగా మారాలి : ఆహారం, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి శ్రీసుధాంశుపాండే
Posted On:
24 AUG 2020 6:55PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌కు చెందిన నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్ , ఆన్‌లైన్ ద్వారా ఐదురోజుల పాటు నిర్వహించే ఎక్జిక్యుటివ్ డవలప్‌మెంట్ ప్రోగ్రాంను కేంద్ర ఆహార , ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశం, ఇతర దేశాలనుంచి సుమారు వందమంది సీనియర్ ఎగ్జిక్యుటివ్‌లు పాల్గొన్నారు. కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్కెట్ డిమాండ్, ఆర్ధిక వ్యవస్జల పరిస్థితులకు అనుగుణంగా చక్కెర ఫ్యాక్టరీలు చక్కెర, ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే వెసులుబాటు ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అంతర్జాతీయంగా చక్కెర పరిశ్రమ స్థితిగతులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చక్కెర ఫ్యాక్టరీలను జీవ ఇంధన కేంద్రాలుగా, ఇతర విలువ జోడింపు ఉత్పత్తులైన ప్రత్యేక చక్కెర తయారీ ద్వారా ఆత్మనిర్భర్ సాధించే విధంగా రూపుదిద్దుకోవాలని అన్నారు. ఈ సంస్థను అభినందిస్తూ ఆయన ఇలాంటి ఆన్‌లైన్ కార్యక్రమాలను మరిన్నింటిని చేపట్టాల్సిందిగా సూచించారు. ఇవి చక్కెర పరిశ్రమలో పనిచేససే వారి విజ్ఞానాన్ని మరింత పెంపొందించడానికి, ఆర్థికంగా, పర్యావరణ పరంగా చక్కెర పరిశ్రమ నిలదొక్కుకొవడానికి ఈ విజ్ఞానం దొహదపడుతుందన్నారు.
ఆహారం, ప్రజాపంపిణీ విభాగం సంయుక్త కార్యదర్శి (సుగర్, అడ్మినిస్ట్రేషన్) శ్రీ సుబోధ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, చెరకు రసం, సిరప్, బి- హెవీ మొలాసిస్‌ను ఉపయోగించి ఇథనాల్‌ను తయారుచేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టవలసిందిగా ఆయన చక్కెర పరిశ్రమకు పిలుపునిచ్చారు. మిగులు చక్కెర ఉత్పత్తి డిమాండ్ పరిస్థితులను తట్టుకునేందుకు పెట్రోలులో ఇథనాల్ కలిపేందుకు , ఇథనాల్ ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఆయన కోరారు. పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలపాలన్నది లక్ష్యం కాగా ప్రస్తుతం మనం 5 శాతం మాత్రమే కలిపే స్థితిలో ఉన్నామని అన్నారు. ఇథనాల్ మార్కెట్ నమ్మకమైన మార్కెట్ కనుక , ఇథనాల్ ఉత్పత్తి , చక్కెర ఫ్యాక్టరీలు దీనిని ఉత్పత్తి చేయడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి వీలు కలుగుతుంది. దేశ విశాల ప్రయోజనాలకు అనగుణంగా, పరిశుభ్రమైన, హరిత ఇంధనాన్ని వాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇది ఇంధన భద్రత, ముడి చమురు దిగుమతలను తగ్గించి విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదాచేసుకోవడానికి పనికివస్తుంది.
కాన్పూర్ కు చెందిన నేషనల్ సుగర్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ ప్రొఫెసర్ నరేంద్ర మోహన్ మాట్లాడుతూ, వ్యూహాత్మక ప్రణాళిక, వనరుల గరిష్ఠ వినియోగం అవసరమని సూచించారు. చక్కెర మిగులు, కోవిడ్ -19 పరిస్థితులను గమనించి ఎక్జిక్యుటివ్‌లు - పునఃసమీక్షించండి, పునః ప్రారంభించండి , పునఃసృష్టి చేయండి ”అన్న మంత్రాన్ని అనుసరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులలొ అత్యుత్తమ వ్యాపార నమూనాలను అనుసరించాలన్నారు. సురక్షితమైన ఆహారం , అలాగే ఎన్-ఓ-ఎన్ అంటే సహజ, సేంద్రీయ, పోషక విలువలు కలిగిన చక్కెరను తయారు చేయడం చక్కెర పరిశ్రమ ప్రధాన అజెండాగా ఉండాలన్నారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రోఫెసర్ బ్రాడ్‌ఫుట్ మాట్లాడుతూ, చక్కెర ఉత్పత్తి చేసే వివధ దేశాలలో సాంకేతిక పరిస్థితుల గురించి వివరించారు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా వాడుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆయన వివరించారు.
చక్కెర నుంచి వచ్చే రాబడిపై ఆధారపడడం తగ్గించేందుకు వైవిధ్యంతో కూడిన ఉత్పత్తులపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే సమర్ధతా ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకుంటూ ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవాలని చెప్పారు. ఐఐటి -రూర్కీ కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ శర్మ, సమష్టి నాయకత్వం, నాయకత్వ అభివృద్ధి అనే అంశంపై ఉపన్యసించారు. ఉత్పాదకతను గరిష్ఠస్థాయికి తీసుకువెళ్లడానికి, సానుకూల వ్యాపార వాతావరణానికి ప్రతి కార్మికుడు తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతతో చేపట్టాలని సూచించారు.
****
(Release ID: 1648406)
Visitor Counter : 174