రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఏఎఫ్ మొబైల్ యాప్ ‘మై ఐఏఎఫ్’ ఆవిష్కరణ
Posted On:
24 AUG 2020 6:48PM by PIB Hyderabad
‘డిజిటల్ ఇండియా’ చొరవలో భాగంగా ఎయిర్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ‘మై ఐఏఎఫ్’ మొబైల్ అప్లికేషన్‌ను (యాప్) ఆవిష్కరించారు. వాయుసేన ప్రధాన కార్యాలయం ‘వాయు భవన్’లో సోమవారం (24 ఆగస్టు 2020న) జరిగిన ఒక కార్యక్రమంలో భదౌరియా దీనిని ఆవిష్కరించారు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) లో చేరాలని కొరుకునే వారికి వృత్తి సంబంధిత సమాచారం మరియు సంబంధిత వివరాల్ని ‘మై ఐఏఎఫ్’ మొబైల్ యాప్‌లో అందించనున్నారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డీఏసీ) సహకారంతో ఈ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఐఏఎఫ్‌లో అధికారులు మరియు వాయుసేనకులు ఎంపిక విధానం, శిక్షణా పాఠ్యాంశాలు, చెల్లింపు మరియు ప్రోత్సాహకాలు మొదలైన వివరాలు వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పై అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఐఏఎఫ్ సోషల్ మీడియాకు చెందిన ప్లాట్‌ఫారమ్‌లతో కూడా దీనిని అనుసంధానించారు. ఐఏఎఫ్ శౌర్యం యొక్క చరిత్ర మరియు వీర గాథల సంగ్రహావలోకనాన్ని కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు.
***
(Release ID: 1648405)
Visitor Counter : 218