సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్మూ కశ్మీర్ లో ఆర్టీఐ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది: డాక్టర్ జితేంద్ర సింగ్
మహమ్మారి కాలంలో కూడా పరిష్కారాల సంఖ్య తగ్గలేదు, పైగా కొన్ని నెలల్లో ఎక్కువ పరిష్కారాలు
జరుగుతున్నాయి : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
24 AUG 2020 6:26PM by PIB Hyderabad
ఆర్టీఐ పరిష్కారాల రేటుపై మహమ్మారి ప్రభావం కనిపించలేదు. నిర్దిష్ట వ్యవధిలో, పరిష్కారాల రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉంది. సిఐసి, రాష్ట్ర సమాచార కమిషనర్ల సమావేశంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి (డోనెర్), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, పెన్షన్లు, అణుశక్తి,, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 2014 లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పారదర్శకత, ప్రజా కేంద్రీకృత గవర్నెన్స్ ఒక ఆదర్శ నమూనాగా రూపుదిద్దుకున్నదని ఆయన అన్నారు. సమాచార కమిషన్ల స్వతంత్రతకు భంగం కలగకుండా, వనరులను బలోపేతం చేయడానికి గత ఆరేళ్లలో తగు నిర్ణయాలు తీసుకున్నామని, అన్ని ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేశామని మంత్రి చెప్పారు.

లెక్కల గణాంకాలను ప్రస్తావిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ , ఆర్టీఐ పరిష్కారాల రేటుపై మహమ్మారి ప్రభావం పడలేదని, 2020 మార్చి నుండి జూలై వరకు, కేంద్ర సమాచార కమిషన్ కేసుల పరిష్కారం మునుపటి సంవత్సరానికి సమానంగా ఉందని అన్నారు. 2020 జూన్‌లో ఆర్టీఐ పరిష్కారాల రేటు 2019 జూన్ కంటే ఎక్కువగా ఉందని, అందరూ దీనిని గమనించాలని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి ఇదే నిదర్శనమని, ప్రధాని నరేంద్ర మోడీ పాలన కు ఏవీ అడ్డు కావని ఆయన అన్నారు. డూప్లికేట్ విజ్ఞాపనలు, తప్పుదారి పట్టించే ఆర్టీఐలను నివారించడం వల్ల దరఖాస్తులు పేరుకుపోయే అవకాశం లేకుండా, పనిభారం తగ్గడానికి సహాయపడి సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.

కొత్తగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లో కూడా వర్చ్యువల్ మాధ్యమంలో ఆర్టీఐ దరఖాస్తులను స్వీకరించడం, విచారించడం, పరిష్కరించడాన్ని మహమ్మారి మధ్యస్థంలో అంటే మే 15న కేంద్ర సమాచార కమిషన్ ప్రారంభించిన ఘనత వారికీ, వారి సిబ్బందికి దక్కుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
భారతదేశంలోని ఏ పౌరుడైన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఆర్టీఐ దరఖాస్తు చేయవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆ అవకాశం ఆ రాష్ట్రంలోని పౌరులకు మాత్రమే ఉండేదని , ఆర్టీఐని 2019 పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చాక పరిస్థితి మారించని మంత్రి తెలియజేశారు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ఆమోదం తర్వాత, జమ్మూ కశ్మీర్ సమాచార హక్కు చట్టం 2009, అక్కడ ఉన్న నిబంధనలు రద్దు అయ్యాయి, సమాచార హక్కు చట్టం 2005, అక్కడ ఉన్న నియమాలు 31.10.2019 నుండి అమలులోకి వచ్చాయి అన్న విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన ముఖ్య అంశమని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ చర్యను జమ్మూ కాశ్మీర్ ప్రజలు,యుటి అధికారులు విస్తృతంగా ప్రశంసించారు.
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ బిమల్ జుల్కా మాట్లాడుతూ, లాక్ డౌన్ వ్యవధిలోనూ, తరువాత కూడా కమిషన్ తన ఇంటరాక్టివ్, ఆవుట్రీచ్ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించిందని అన్నారు. వీటిలో, పౌర సమాజ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమీషన్స్ (ఎన్ఎఫ్ఐసిఐ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి కార్యకలాపాలు ఉన్నాయి.
<><><><><>
(Release ID: 1648328)