వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
అర్హులైన దివ్యాంగులందరినీ , జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద చేర్చవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన ఆహారం, ప్రజాపంపిణీ విభాగం
Posted On:
23 AUG 2020 4:11PM by PIB Hyderabad
జాతీయ ఆహారభద్రతా చట్టం 2013 కింద అర్హులైన దివ్యాంగులందరిని చేర్చాల్సిందిగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఆహారం, ప్రజా పంపిణీ విభాగం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది.
ఈ చట్టం లోని సెక్షన్ 38 కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలకు , ఈ చట్టం సక్రమ అమలుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేసే అధికారం కల్పిస్తున్నది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద లబ్ధిదారులుగా ఉండడానికి అర్హతగల దివ్వాంగులందరికీ ఈ పథకం వర్తించే లా చూడాల్సిందిగా రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ విభాగం సలహాఇచ్చింది. ఎన్.ఎఫ్.ఎస్.ఎ, అలాగే పిఎంజికెఎవై లకింద వారికి అందవలసిన ఆహారధాన్యాల కోటాను ఈ చట్టం కింద అందేట్టు చూడాల్సిందిగా సూచించింది.
ఇప్పటికే ఈ పథకం కిందికి రాని అర్హులైన వారికి తాజాగా కార్డులను జారీచేయాలని అందులో పేర్కొన్నారు. ఎఎవై కుటుంబాల కింద లబ్ధిదారుల పేర్లు చేర్చుకోవడానికి అంగ వైకల్యం ఒక ప్రాతిపదిక అని, వీరు సమాజంలో అణగారిన వారని అందులో పునరుద్ఘాటించారు. లబ్ధిదారుల ఎంపికకు తాము సూచించిన ప్రాధాన్యతల ప్రకారం దివ్యాంగులను కూడా చేర్చుకోవడం తప్పనిసరి అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ లేఖలో సూచించారు.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోని సెక్షన్ 10, అంత్యోదయ అన్న యోజన పథకానికి వర్తించే నిబంధనలకు అనుగుణంగా ఆయా వ్యక్తులను దీని పరిధి కిందికి తెస్తుంది. మిగిలిన కుటుంబాలను రాష్ట్రప్రభుత్వాలు రూపొందించే మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతగల కుటుంబాలుగా పరిగణిస్తారు.
.
భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, ఎన్.ఎఫ్.ఎస్.ఎ లేదా ఏ రాష్ట్ర పథకం పిడిఎస్.కార్డుల పరిధి కిందికి రాని వారికి ఉద్దేశించినది. అందువల్ల రేషన్ కార్డులేని దివ్యాంగులు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. ఈ పథకానికి ఆగస్టు 31, 2020 తో కాలం చెల్లనున్నందున, ఇప్పటికీ ఇందుకు ఒక వారం గడువు ఉంది. అందువల్ల , రేషన్ కార్డులేని దివ్యాంగులను గుర్తించి వారికి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ప్రయోజనం కల్పించాల్సిందిగా ఆహార , ప్రజా పంపిణీ విభాగం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
ఈ పథకం 2020 మే నెలలో ప్రారంభమైందని, దివ్యాంగులతోపాటు రేషన్ కార్డులేని అర్హులైన లబ్ధిదారులందరూ దీనికిందికి వచ్చిఉంటారని భావిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కింద అందుకున్న రేషన్‌ను , దివ్యాంగులు సహా, రేషన్‌కార్డులు లేని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలు వాడిఉంటాయని భావిస్తున్నట్టు తెలిపింది. ఇందుకు అనుగుణంగా సానుకూల చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
****
(Release ID: 1648073)
Visitor Counter : 245