హోం మంత్రిత్వ శాఖ
అన్‌లాక్ -3 సమయంలో వ్యక్తుల రాకపోకలు, సరకురవాణా, సేవల వంటివి ఎలాంటి ఆటంకం లేకుండా సాగేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించిన కేంద్ర హోంమంత్రిత్వశాఖ.
జిల్లా పాలనాయంత్రాంగాలు, లేదా రాష్ట్రప్రభుత్వాలు స్థానిక స్థాయిలో విధించే ఆంక్షలు, విపత్తు నిర్వహణ ఛట్టం 2005 నిబంధనల కింద జారీచేసిన మార్గదర్శకాలకు విరుద్ధం.
Posted On:
22 AUG 2020 5:31PM by PIB Hyderabad
రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలు, సరకు రవాణా, సేవల కు సంబంధించి ముందుకు సాగిపోవడానికి ,ప్రస్తుత అన్‌లాక్ -3 మార్గదర్శకాల ప్రకారం , ఎలాంటి ఆంక్షలు విధించరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ (ఎం.హెచ్.ఎ) సవివరమైన సమాచారం పంపింది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల పాలనాయంత్రాంగాలు స్థానిక స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఆంక్షలు, సరకు రవాణా, సేవలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అందడంలో ఇబ్బందులు కలిగిస్తాయని తెలిపింది. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని, ఇది ఉపాధిపైన, సరకులు ,సేవల అందుబాటుపైన ప్రభావం చూపుతుందని తెలిపింది.
స్థానిక స్థాయిలో జిల్లా పాలనాయంత్రాంగాలు, లేదా రాష్ట్రప్రభుత్వాలు ఇలాంటి ఆంక్షలు విధించడం విపత్తుల నిర్వహణ చట్టం 2005 నిబంధనల కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
కేంద్ర హోంమంత్రిత్వశాఖ 2020 జూలై 29న అన్ లాక్ -3 కి సంబంధించి జారీ చేసిన ఆదేశాలను గుర్తు చేస్తూ, రాష్ట్రంలోపల,రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదని తెలిపింది. ఇలా రాకపోకలు సాగించడానికి ఎవరూ విడిగా అనుమతి, ఈ -పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇది పొరుగుదేశాలతో వాణిజ్యానికి సంబంధించి గల ఒప్పందాల క్రింద, సరకు రవాణా వ్యక్తుల రాకపోకలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
*****
(Release ID: 1647966)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam