భారత ఎన్నికల సంఘం
కోవిడ్-19 సందర్బంగా సాధారణ ఎన్నికలు/ఉప ఎన్నికలు నిర్వహించడానికి మార్గదర్శకాలు
Posted On:
21 AUG 2020 4:47PM by PIB Hyderabad
కోవిడ్-19 నేపథ్యంలో సాధారణ/ఉపఎన్నికల నిర్వహణకు విస్తృత మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఇవి ఈ వెబ్ సైట్ లో అందుబాటులో పేర్కొన్నారు: https://eci.gov.in/files/file/12167-guidelines-for-conduct-of-general-electionbye-election-during-covid-19/
కోవిడ్-19 దృష్టిలో పెట్టుకునే కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూనే ఉన్నాయి. తాజాగా 2020 జులై 29న జరీ చేసిన సర్క్యూలర్ లో రెండు మంత్రిత్వ శాఖలు మార్గదర్శకాలను ఇచ్చాయి.
అంతకుముందు, 2020 జూలై 17 న కమిషన్ 2020 జూలై 31 వరకు జాతీయ / రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయాలు / సలహాలను కోరింది. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు 2020 ఆగస్టు 11 వరకు గడువును పొడిగించింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్రాల / యుటిల ముఖ్య ఎన్నికల అధికారుల నుండి వచ్చిన అభిప్రాయాలు / సలహాలను కమిషన్ పరిశీలించింది.
మార్గదర్శకాలలో ముఖ్యమైన అంశాలు:
నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు వ్యక్తుల సంఖ్య, వాహనాల సంఖ్య నిబంధనలను కమిషన్ సవరించింది. ఇది నామినేషన్ ఫారమ్, అఫిడవిట్ ఆన్‌లైన్‌లో నింపి, ఆన్‌లైన్‌లో
సమర్పించడానికి ఐచ్ఛిక సదుపాయాన్ని కలిపించింది, ప్రింట్ తీసుకున్న తరువాత, సంబంధిత ఆర్ఓ కు సమర్పించవచ్చు. అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయడానికి భద్రతా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమచేసే అవకాశం మొదటి సారిగా కలిపించారు. నియంత్రణ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటింటికీ ప్రచారం కోసం అభ్యర్థితో సహా వ్యక్తుల సంఖ్యను ఐదుకి కమిషన్ పరిమితం చేసింది. ఎంహెచ్ఏ/ రాష్ట్రం జారీ చేసిన నియంత్రణ సూచనలకు లోబడి తగిన సూచనలతో బహిరంగ సమావేశం, రోడ్ షోలు అనుమతిస్తారు. ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్, పిపిఇ కిట్లు ఎన్నికల ప్రక్రియలో సామాజిక దూర ప్రమాణాలను నిర్ధారిస్తాయి. ఓటరు రిజిస్టర్‌లో సంతకం చేయడానికి, ఓటింగ్ కోసం ఈవీఎం బటన్‌ను నొక్కడానికి ఓటర్లందరికీ చేతి తొడుగులు అందించబడతాయి. సంబంధిత రాష్ట్రాలు / యుటిల ముఖ్య ఎన్నికల అధికారులు, ఈ మార్గదర్శకాలను అనుసరించే స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ఏర్పాట్లు, నివారణ చర్యలకు సంబంధించి సమగ్ర రాష్ట్ర / జిల్లా, ఎసి ఎన్నికల ప్రణాళికలను తయారు చేయాలి.ఈ ప్రణాళికలు ఆయా రాష్ట్రాలు / యుటిలలోని కోవిడ్-19 కోసం నోడల్ ఆఫీసర్‌తో సంప్రదించి తయారు చేస్తారు.
***
(Release ID: 1647882)
Visitor Counter : 326