రైల్వే మంత్రిత్వ శాఖ
దిల్లీ సమీప ప్రాంతాల్లో రైల్వే మౌలిక సదుపాయాల వృద్ధి, నగరీకరణ చేపట్టిన రైల్వే శాఖ
రోహ్‌తక్‌లోని రోహ్‌తక్-గొహానా మార్గాన్ని ఎలివేటెడ్ ట్రాక్‌గా మార్చిన రైల్వే శాఖ
నగరంలోని నాలుగు లెవెల్ క్రాసింగ్‌లు తొలగింపు
Posted On:
21 AUG 2020 7:36PM by PIB Hyderabad
రైల్వే మౌలిక సదుపాయాల కల్పన వృద్ధి, నగరీకరణ సాయంలో భాగంగా, రైల్వే శాఖ దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా, రోహ్‌తక్‌లోని రోహ్‌తక్-గొహానా మార్గాన్ని 4.8 కి.మీ. ఎలివేటెడ్ ట్రాక్‌గా మార్చింది. ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో కొత్త మార్గం ప్రారంభమవుతుంది.
ఈ రైల్వే మార్గం రోహ్‌తక్ నగరం మధ్య నుంచి వెళ్తుంది. ఈ మార్గంలో నగర పరిధిలోనే నాలుగు లెవెల్ క్రాసింగులు ఉన్నాయి. దీనివల్ల భారీ ట్రాఫిక్ జాంలతోపాటు, ఎప్పుడూ గేట్లు పడుతూనే ఉంటాయి. రైళ్ల భద్రత, వేగంలోనూ రాజీ పడాల్సివచ్చి, రైళ్ల రాకపోకలు ప్రమాదకర స్థితిలో పడ్డాయి. పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ లెవెల్ క్రాసింగులను తీసివేసి, ఎలివేటెడ్ ట్రాక్ తీసుకురావడం రోహ్‌తక్ ప్రజలకు అతి పెద్ద ఊరటగా మారింది. ఈ మార్గం అందుబాటులోకి వచ్చాక, రైళ్ల రాకపోకలు కూడా సాఫీగా సాగుతాయి. రైళ్ల వేగాన్ని కూడా పెంచవచ్చు.
రైల్వే శాఖ, హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్నాయి. ఇప్పటికే రూ.315 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో హర్యానా వాటా 225 కోట్ల రూపాయలు. రోహ్‌తక్ ప్రజల దీర్ఘకాల కలను రైల్వే శాఖ సాకారం చేస్తోంది.
***
(Release ID: 1647759)
Visitor Counter : 189