రాష్ట్రపతి సచివాలయం
దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
21 AUG 2020 5:09PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం ఇచ్చారు:
"వినాయక చవితి శుభ సందర్భంగా, దేశ ప్రజలతోపాటు, విదేశాల్లో ఉన్న భారతీయులకు నా శుభాకాంక్షలు".
"లంబోదరుడి పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటాం. సమాజంలోని అన్ని వర్గాలు కలిసి ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునే వేడుక ఇది".
"కరోనా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయమిది. ఈ సవాళ్లను సాధ్యమైనంత త్వరగా అధిగమించి, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా పార్వతీ తనయుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నా".
"భారతీయులందరి మధ్య సామరస్యం, సోదరభావం, ఐక్యతను బలోపేతం చేద్దామని ఈ పండుగ సందర్భంగా అంతా ప్రతిజ్ఞ చేద్దాం".
రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 1647740)
Visitor Counter : 179