శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కఠినమైన పరిస్థితుల్లో నిల్వ చేయడానికి అనువైన తక్కువ ఖర్చుతో కూడిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల కిట్ కోసం అధ్యయనం ప్రారంభమయ్యింది.
సార్సు-కోవ్-వి2 సంక్రమణను గుర్తించడానికి పరిశోధకులు ఆప్టామెర్-ఆధారిత వ్యాధి నిర్ధారణ కిట్ ను అభివృద్ధి చేస్తున్నారు
ఇది కోవిడ్-19 సంక్రమణను గుర్తించడంతో పాటు, అనేక అంటువ్యాధులను కూడా తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన, సమర్థవంతమైన పద్ధతిలో గుర్తించగలదు
Posted On:
21 AUG 2020 12:29PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి, తగినంత మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో వేగంగా రోగనిర్ధారణ సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే కొత్త సవాలును విసిరింది. ఇది చాలా పటిష్టమైన నిల్వ సౌకర్యాలు అవసరం లేని తక్కువ ఖర్చుతో కూడిన పరికరాలను రూపొందించాలని పిలుపునిస్తోంది. ఈ అత్యవసర అవసరాన్ని తీర్చడానికి శాస్త్రవేత్తలు పరిశోధన ప్రణాళికను రూపొందించారు.
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్.ఈ.ఆర్.బి) సహకారంతో, రాంచీ, మెస్రాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి) కింద ఒక చట్టబద్దమైన సంస్థ పరిశోధన ప్రారంభించింది. బయోఇన్ఫర్మేటిక్స్ సాధనాన్ని ఉపయోగించి లక్ష్య ప్రోటీన్ ను గుర్తించడంతో, దీనికి వ్యతిరేకంగా డయాగ్నొస్టిక్ కిట్ ను అభివృద్ధి చేయాలి. ఈ అధ్యయనం డయాగ్నొస్టిక్ కిట్ అభివృద్ధి కోసం స్పైక్ ప్రోటీన్ యొక్క ప్రత్యేక డొమైన్‌ను తీసుకుంది.
సార్సు-కో-వి2 సంక్రమణను గుర్తించడానికి పరిశోధకులు ఆప్టామెర్-ఆధారిత వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వారి అధ్యయనం మొదట కరోనా వైరస్ సంక్రమణను గుర్తించడాన్ని నిర్ధారిస్తుంది, తదనంతరం, కిట్ కోవిడ్-19 సంక్రమణతో సహా వివిధ రకాల కరోనా వైరస్ సంక్రమణలను (సార్సు కో-వి1, ఎం.ఈ.ఆర్.ఎస్) వేరు చేస్తుంది. మూడు కరోనా వైరస్ సంక్రమణ (సార్సు కో-వి1, ఎం.ఈ.ఆర్.ఎస్. మరియు కోవిడ్-19) లో ఉన్న సంరక్షిత డొమైన్ ఆధారంగా సాధారణ కరోనా వైరస్ సంక్రమణను గుర్తించవచ్చు, అయితే సంరక్షించబడిన మరియు సంరక్షించబడని డొమైన్ వరుసగా సార్సు-కోవ్-2 వైరస్ మరియు ఎం.ఈ.ఆర్.ఎస్. వైరస్ కలయిక ఆధారంగా అవకలన కిట్ అభివృద్ధి చేయబడుతుంది.
మాలెక్యులర్ బయాలజీ మరియు డ్రగ్ డెలివరీ డొమైన్ లో అత్యాధునిక నైపుణ్యం కలిగిన బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెస్రా (బిఐటి మెస్రా) రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిమన్యు దేవ్, అదే సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశన్ జయప్రకాష్ వంటి మేధావులు ఈ పరిశోధన చేయడానికి ఒక బృందంగా కృషి చేశారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మెస్రా ల్యాబ్‌లో ఈ డయాగ్నొస్టిక్ కిట్ అభివృద్ధి చేయగా, కిట్ పరీక్ష భువనేశ్వర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఐ.ఎల్.ఎస్) లో డాక్టర్ రాజీబ్ కుమార్ స్వైన్, సైంటిస్ట్ ఇ, ఐ.ఎల్.ఎస్. భువనేశ్వర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది.
ఆప్టామెర్ ఆధారిత సాంకేతికత సాపేక్షంగా ఒక కొత్త టెక్నిక్. ఇది ఖచ్చితమైన, సమర్థవంతమైన పద్ధతిలో అనేక అంటువ్యాధులను గుర్తించగలదు. అంతేకాకుండా, ఇది కోవిడ్-19 సంక్రమణను తక్కువ ఖర్చుతో గుర్తించేలా చేస్తుంది, పరికరాలను తక్కువ కఠినమైన పరిస్థితులలో నిల్వ చేయవచ్చు. సాంప్రదాయిక యాంటీబాడీ-ఆధారిత గుర్తింపు పద్ధతుల కంటే, ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే జనాభాకు ఇది మరింత ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. ఇతర కరోనా వైరస్ సంక్రమణ (సార్సు-కో-వి1 మరియు ఎమ్.ఈ.ఆర్.ఎస్.) ను గుర్తించడం కూడా మా పరిశోధన యొక్క అదనపు ప్రయోజనం.
ఈ కిట్ కరోనా వైరస్ సంక్రమణను చాలా తక్కువ సమయంలో గుర్తించే ప్రయోజనాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ఇది రంగులో మార్పు ఆధారంగా గుర్తించడానికి వేగవంతమైన వ్యాధి నిర్ధారణ కిట్ కానుంది. అంతేకాకుండా, తక్కువ ఉత్పత్తి వ్యయం, తక్కువ కఠినమైన నిల్వ సౌకర్యం అవసరం కారణంగా యాంటీబాడీ-ఆధారిత వ్యాధి నిర్ధారణ సాంకేతిక ప్రక్రియ తో పోలిస్తే కిట్ చాలా తక్కువ ఖర్చుకే లభిస్తుంది.
కోవిడ్ -19 సంక్రమణ యొక్క ఆప్టామెర్-ఆధారిత గుర్తింపు యొక్క స్కీమాటిక్ ప్రాతినిధ్యాన్ని తెలియజేసే చిత్రం
మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి :
డాక్టర్ అభిమన్యు దేవ్,
బిర్లా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ,
మెస్రా (బి.ఐ.టి.మెస్రా)
ఈ.మెయిల్ : abhimanyudev@bitmesra.ac.in,
మొబైల్ : 9955165915
డాక్టర్ వెంకటేశన్ జయప్రకాష్,
బిర్లా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ,
మెస్రా (బి.ఐ.టి.మెస్రా )
ఈ.మెయిల్ : venkatesanj@bitmesra.ac.in,
మొబైల్ : 9470137264
*****
(Release ID: 1647612)
Visitor Counter : 211