సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అశోక్ వైద్ సంకలనం చేసిన కాన్సర్ పై పుస్తకాన్ని వర్చ్యువల్ కార్యక్రమంలో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 AUG 2020 8:17PM by PIB Hyderabad
ప్రఖ్యాత ఆంకాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత డాక్టర్ అశోక్ కె. వైద్ డిఎం (ఆంకాలజీ) సంకలనం చేసిన క్యాన్సర్ గురించి ఒక పుస్తకాన్ని ఈ రోజు నుండి ఇక్కడ ప్రారంభమయ్యే ఆంకాలజీపై 3-రోజుల వర్చువల్ కాన్ఫెరెన్క్ లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయానా ప్రముఖ డయాబెటాలిజిస్టు, వైద్య వృత్తిలో ఉన్నవారు.
భారతదేశంలో మారుతున్న వ్యాధి రూపురేఖల గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి రుగ్మతల పెరుగుదలతో గత రెండు దశాబ్దాలుగా సంక్రమణ వ్యాధుల నుండి సంక్రమించని వ్యాధులకు గణనీయమైన మార్పు జరిగింది. . ఇంతలో, హఠాత్తుగా కోవిడ్ మహమ్మారి చుట్టముట్టింది. ఇది విభిన్న వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మరింత హానికరంగా ఉందని నిరూపితమైంది. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాప్తి దేశవ్యాప్తంగా వేగంగా పెరిగింది, వివిధ అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, జమ్మూ & కాశ్మీర్లో, ముఖ్యంగా లోయలో, జీర్ణశయాంతర, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి, ఈశాన్య ప్రాంతంలో తల, మెడ క్యాన్సర్లు అత్యధికంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి అయన ప్రస్తావిస్తూ, ప్రతి భారతీయ పౌరుడికి ఇది నిరంతరాయంగా సమాచార ప్రవాహాన్ని, నవీకరించబడిన ఆరోగ్య సంరక్షణను సులభతరం చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపును అందించబోతోందని అన్నారు.
****
(Release ID: 1647500)
Visitor Counter : 165