భారత పోటీ ప్రోత్సాహక సంఘం

సీఅండ్ఎస్ ఎలక్ట్రిక్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు సీమెన్స్ లిమిటెడ్‌కు సీసీఐ ఆమోదం

Posted On: 20 AUG 2020 5:55PM by PIB Hyderabad

సీఅండ్ఎస్ ఎలక్ట్రిక్ లిమిటెడ్‌ కొనుగోలుకు సంబంధించి సీమెన్స్ లిమిటెడ్ సంస్థ స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌కు 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) ఆమోదం తెలిపింది. సీఅండ్ఎస్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ సంస్థ‌లో (సీ అండ్ ఎస్‌) మొత్తం 100 శాతం మేర వాటా మూలధనాన్ని సొంతం చేసుకోనేలా అనుమ‌తినివ్వాల‌ని కోరుతూ సిమెన్స్ లిమిటెడ్ (సిమెన్స్ ఇండియా) సీసీఐకి ప్ర‌తిపాద‌న చేసింది. ప్రతిపాదిత వాటా కొనుగోలు ప్ర‌క్రియ త‌రువాత తక్కువ-వోల్టేజ్ (ఎల్వీ) స్విచ్ గేర్ భాగాలు మరియు ప్యానెళ్లు, ఎల్వీ మరియు మీడియం వోల్టేజ్ (ఎంవీ) పవర్ బస్‌బార్లు అలాగే సీ అండ్ ఎస్ యొక్క రక్షణ మరియు మీటరింగ్ పరికరాల వ్యాపారాలు సీ అండ్ ఎస్ యొక్క వ్యాపార పరిధిలో ఉండ‌నున్నాయి. వీటికి తోడు సీ అండ్ ఎస్ యొక్క కొన్ని ఇతర వ్యాపారాలు, ఎంవీ స్విచ్ గేర్ మరియు ప్యాకేజీ సబ్ స్టేషన్, లైటింగ్, డీజిల్ జనరేటింగ్ సెట్లు, ఇంజినీరింగ్, సేకరణ మరియు నిర్మాణ వ్యాపారం మరియు “ఎటాకామ్” బస్ ‌బార్స్ వ్యాపారం సీ అండ్ ఎస్ యొక్క ప్రస్తుత ప్రమోటర్ల వ‌ద్ద‌నే ఉండ‌నున్నాయి.
మ‌రోవైపు సిమెన్స్ ఇండియా విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ, భ‌వ‌నాల‌కు
తెలివైన మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, పంపిణీ చేయబడిన వివిధ విద్యుత్తు వ్యవస్థలతో పాటు‌గా తయారీ పరిశ్రమలలో ఆటోమేషన్ మరియు డిజిటలైజేషన్ రంగాలపై దృష్టి పెడుతోంది. సంస్థ‌ రైలు మరియు రహదారి రవాణా కోసం స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలను మరియు స్మార్ట్ సిటీలకు మౌలిక సదుపాయాల పరిష్కారాలను కూడా అందిస్తుంది. సీ అండ్ ఎస్ ఎలక్ట్రికల్ స్విచ్ గేర్, పవర్ ప్రొటెక్షన్ మరియు ఎలెక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఉత్పత్తుల శ్రేణిని తయారు చేస్తుంది. సీ అండ్ ఎస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ వ్యాపారాన్ని కలిగి ఉంది, ఇది పారిశ్రామిక మరియు వాణిజ్య విద్యుదీకరణ, సబ్‌స్టేషన్లు మరియు విద్యుత్ ప్లాంట్లకు త‌గిన పరిష్కారాలను చేప‌డుతోంది. దీనికి తోడు సీ  అండ్ ఎస్ గ్రిడ్ కనెక్ట్ చేసిన సౌర ఫోటో-వోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ల రూపకల్పన మరియు అమలులో కూడా ఈ సంస్థ  నిమగ్నమై ఉంది.

సీసీఐకి చెందిన పూర్తి వివరణాత్మక ఆర్డ‌రు వెలువ‌డాల్సి ఉంది.


 

****


(Release ID: 1647440) Visitor Counter : 167