పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పట్టణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం కోసం 158 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరమవుతుంది: హర్దీప్ సింగ్ పూరి
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 900 కిలోమీటర్ల పొడవైన మెట్రో ప్రాజెక్టుల కోసం 1.17 మిలియన్ టన్నుల ఉక్కు అవసరం
గడచిన మూడేళ్ళలో ఎయిర్ పోర్టు టర్మినల్ భవనాల నిర్మాణానికి దాదాపు రూ. 570 కోట్ల విలువైన ఉక్కు ఉపయోగించారు
నిర్మాణ పనుల్లో వినియోగానికి యోగ్యమైన స్థితిస్థాపక శక్తి మరియు పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఉక్కు ఆకృతిని రూపొందించాలని ఉక్కు పరిశ్రమను గృహనిర్మాణ శాఖ మంత్రి కోరారు.
Posted On:
18 AUG 2020 1:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణానికి దాదాపు 158 లక్షల మెట్రిక్ టన్నుల
ఉక్కు మరియు 692 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు వినియోగించవలసి ఉంటుందని అంచనా వేసినట్లు కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఆత్మ నిర్భర భారత్ పై నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ తెలిపారు. గృహనిర్మాణం మరియు నిర్మాణం మరియు విమానయాన రంగంలో ఉక్కు వినియోగం ప్రోత్సహించడం జరుగుతోందని, ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభమైన /పూర్తయిన ఇళ్లకోసం దాదాపు 84 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు మరియు 370 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు వినియోగించడం జరిగిందని మంత్రి తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో పెట్రోలియం & సహజవాయువు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఎఫ్. ఎస్. కులస్తే, పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ పి.కె. ఖరోలా, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల కార్యదర్శి శ్రీ పి. కె. త్రిపాఠి, సీనియర్ అధికారులు, మరియు పరిశ్రమకు చెందిన భాగస్వాములు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 4,550 పట్టణ ప్రాంతాలలో ఇప్పటివరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.07 కోట్ల (1.12 కోట్ల ఇళ్లకు డిమాండ్) ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం/ పూర్తి చేయడం జరిగింది. మరియు 67 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం మరియు 35 లక్షల ఇళ్లను పూర్తి చేసి అందజేయడం జరిగిందని శ్రీ హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయితే 3 65 కోట్ల ఇళ్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, వాటిలో ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన ఇళ్ల ద్వారా 1.65 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగిందని శ్రీ పూరీ అన్నారు. ఇండియా 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారగలదని 2019లోనే ప్రధానమంత్రి మనఃసృష్టి చేశారని, వినూత్నతతో నిలకడైన, సమగ్ర స్వావలంబన ద్వారా దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యల ద్వారా దానిని సాధించగలమని ఆశించారని మంత్రి అన్నారు. పట్టణీకరణ గురించి మాట్లాడుతూ మన పట్టణ కేంద్రాలు /నగరాలు ఆర్ధిక ఉత్పాదకతకు, మౌలిక సదుపాయాలకు, సంస్కృతికి మరియు వైవిధ్యానికి కేంద్రాలని చెబుతూ మంత్రి 2030 నాటికి మన పట్టణ కేంద్రాలలో మన దేశ జనాభాలో 40% లేక 60 కోట్ల మంది నివసించే అవకాశముందని అన్నారు.
పట్టణ రవాణాలో ఉక్కు వినియోగాన్ని గురించి ప్రముఖంగా పేర్కొంటూ మంత్రి ప్రస్తుతం 18 నగరాలలో 700 కిలోమీటర్ల నిడివిగల మెట్రో నిర్వహణలో ఉందని, 27 నగరాల్లో దాదాపు 900 కిలోమీటర్ల నిడివి నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. మెట్రో ప్రాజెక్టులలో ఒక కిలోమీటర్ నిర్మాణానికి సగటున దాదాపు 13,000 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఉక్కు అవసరమవుతుందని అన్నారు.
***
(Release ID: 1647172)
Visitor Counter : 185