వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
"ఒక దేశం, ఒక రేషన్ కార్డు" - ఇంతవరకు సాధించినది మరియు భవిష్యత్ ప్రణాళిక
ఎన్.ఎఫ్.ఎస్.ఏ. కింద ‘దేశవ్యాప్త పోర్టబిలిటీ’ ద్వారా అవాంతరం లేకుండా దేశంలో ఎక్కడైనా వలస లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన ఆహార-ధాన్యాల పంపిణీ.
Posted On:
19 AUG 2020 4:36PM by PIB Hyderabad
"ఒక దేశం, ఒక రేషన్ కార్డు" (ఓ.ఎన్.ఒ.ఆర్.సి) ప్రణాళికను అమలు చేయడం, భారత ప్రభుత్వంలోని ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. పరిధిలో ఉన్న అర్హత కలిగిన దేశంలోని రేషన్ కార్డు హోల్డర్లు / లబ్ధిదారులందరికీ వారికి అర్హతలను బట్టి ఆహారధాన్యాలు ఎక్కడి నుండైనా పొందటానికి అవకాశం ఉంది. ఈ ప్రణాళిక కింద, ఎఫ్.పి.ఎస్. లలో ఈ.పి.ఓ.ఎస్. పరికరాలను వ్యవస్థాపించడం ద్వారా ఐ.టి. ఆధారిత వ్యవస్థను అమలు చేయడం ద్వారా రేషన్ కార్డుల దేశవ్యాప్త పోర్టబిలిటీ ద్వారా మరియు వారి రేషన్ కార్డులతో ఆధార్ లబ్ధిదారుల సంఖ్యను అనుసంధానం చేయడం మరియు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల లో బయోమెట్రిక్‌గా ప్రామాణీకరించిన ఈ.పి.ఓ.ఎస్. లావాదేవీలు అమలుచేయడం ద్వారా అధిక సబ్సిడీ కలిగిన ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరుగుతోంది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ రాష్ట్రాల ఆహార శాఖ మంత్రులు, కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఈ ప్రణాళిక అమలు పురోగతిని సమీక్షిస్తున్నారు. గత కొన్ని నెలల్లో, 13/04/20, 22/05/20 మరియు 18/06/20 తేదీలలో మంత్రి ఇలాంటి అనేక వీడియో సమావేశాలను నిర్వహించారు. వీటితోపాటు, కార్యదర్శి (డి.ఎఫ్.పి.డి) మరియు సంయుక్త కార్యదర్శి (పి.డి) కూడా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో అనేక సార్లు వీడియో కాన్ఫరెన్సు ల ద్వారా ఈ పధకం అమలు పురోగతిని చాలా దగ్గరగా సమీక్షించారు. ఏవైనా సమస్యలు మరియు సవాళ్లను సకాలంలో పరిష్కరించడానికి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన అన్ని సాంకేతిక మరియు పరిపాలనా మద్దతు విస్తరించడం జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ.ఎన్ఓ.ఆర్.సి. క్రింద జాతీయ పోర్టబిలిటీని రూపొందించడానికి సుముఖత వ్యక్తం చేసి, ఈ విభాగంతో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) పై సంతకం చేశాయి.
ప్రస్తుతం, “ఒక దేశం, ఒక రేషన్ కార్డు ప్రణాళిక” కింద రేషన్ కార్డుల జాతీయ పోర్టబిలిటీ సౌకర్యం 2020 ఆగష్టు, 1వ తేదీ నుండి సుమారుగా, 24 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఏకీకృత క్లస్టర్ల లో సజావుగా ప్రారంభించబడింది. ఆంధ్రప్రదేశ్; బీహార్; దాద్రా, నగర్ మరియు హవేలీ; డామన్ మరియు డయ్యూ; గోవా; గుజరాత్; హర్యానా; హిమాచల్ ప్రదేశ్; ఝార్ఖండ్; కర్ణాటక; కేరళ; మధ్యప్రదేశ్; మహారాష్ట్ర; మిజోరాం; ఒడిశా; పంజాబ్; సిక్కిం; రాజస్థాన్; తెలంగాణ; త్రిపుర; ఉత్తరప్రదేశ్; జమ్మూ,కశ్మీర్; మణిపూర్; నాగాలాండ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో సుమారు 65 కోట్ల మంది లబ్ధిదారులు (మొత్తం ఎన్.ఎఫ్.ఎస్.ఎ. జనాభాలో 80 శాతం) ఉన్నారు. అంటే, ఈ క్లస్టర్లలోని వలస కార్మికులు ఎక్కడ ఉన్నా వారికి రేషన్ పోర్టబిలిటీతో పూర్తిగా మరియు పాక్షికంగా రేషన్ కార్డు హోల్డర్ల అవసరాన్ని బట్టి ఆహారధాన్యాల సరఫరా జరుగుతుంది.
దీంతో పాటు, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సిద్ధం చేయడం ద్వారా 2021 మార్చి నెల లోగా మిగిలిన 12 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో (2 డి.బి.టి. నగదు బదిలీ యు.టి.లతో సహా) ఒక దేశం, ఒక రేషన్ కార్డు యొక్క సౌకర్యాన్ని ప్రారంభించడానికి డి.ఓ.ఎఫ్.పి.డి. సమిష్టిగా మరియు క్రమంగా ప్రయత్నాలు చేస్తోంది.
మిగిలిన 12 రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనలతో కొన్ని ముఖ్యమైన సమస్యలు అనుసరిస్తున్నాయి; వాటిని సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. :
i. అరుణాచలప్రదేశ్ : ఇటీవలే ఎఫ్.పి.ఎస్. లలో ఈ.పి.ఓ.ఎస్. పరికరాల సంస్థాపన ప్రారంభమయ్యింది. 2020 అక్టోబర్ నాటికి అన్ని జిల్లాల్లో వీటి సంస్థాపన పూర్తవుతుందని భావిస్తున్నారు.
ii. అస్సాం : ఐ.టి. హార్డ్ వేర్ (ఈ.పి.ఓ.ఎస్. పరికరాలు) ను సేకరించే ప్రక్రియలో ఉంది మరియు వారు నివేదించిన విధంగా 2020 డిసెంబర్ నాటికి జాతీయ పోర్టబిలిటీని ప్రారంభించడానికి యోచిస్తోంది.
iii. ఛత్తీస్ గఢ్ : పాత టాబ్లెట్ల స్థానంలో ఈ.పి.ఓ.ఎస్. పరికరాలను సేకరించే ప్రక్రియలో ఉంది మరియు 2020 డిసెంబర్ నాటికి జాతీయ పోర్టబిలిటీని ప్రారంభించడానికి యోచిస్తోంది.
iv. ఎన్.సి.టి. ఢిల్లీ : 2018 ఏప్రిల్ నెలలో జి.ఎన్.సి.టి.డి. రద్దు ఎఫ్.పి.ఎస్. ల వద్ద ఈ.పి.ఓ.ఎస్. ఆధారిత పంపిణీని తిరిగి ప్రారంభించడానికి ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంలో, అన్ని ఎఫ్.పి.ఎస్. ల వద్ద ఈ.పి.ఓ.ఎస్. పరికరాలను తిరిగి నెలకొల్పుతున్నారు. ఇవి 2020 అక్టోబర్ నాటికి సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రం నిర్ణీత గడువుకు కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు.
v. లడఖ్ : కేంద్ర పాలిత ప్రాంతం 2020 సెప్టెంబర్ నెల నుంచీ జాతీయ పోర్టబిలిటీ లావాదేవీలను పరీక్షించడం ప్రారంభించింది. కనెక్టివిటీ సమస్యలు కొన్ని భాగాలలో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని ప్రభావం గణనీయంగా ఉండదు.
vi. లక్షద్వీప్ : కేంద్ర పాలిత ప్రాంతం త్వరలో జాతీయ పోర్టబిలిటీ లావాదేవీలను పరీక్షించడం ప్రారంభించనుంది. కేంద్ర పాలిత ప్రాంతంలో 2020 సెప్టెంబర్ నాటికి జాతీయ పోర్టబిలిటీ ప్రారంభం కాగలదని భావిస్తున్నారు. కొన్ని ద్వీపాలలో కనెక్టివిటీ సమస్యలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని ప్రభావం గణనీయంగా లేదు.
vii. మేఘాలయ : ఈ.పి.ఓ.ఎస్. పరికరాల సంస్థాపన ఇటీవలే దశలవారీగా రాష్ట్రంలో ప్రారంభమైంది. 2020 అక్టోబర్ మధ్యలో పూర్తవుతుంది. 2020 డిసెంబర్ నాటికి రాష్ట్రం జాతీయ పోర్టబిలిటీని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.
viii. తమిళనాడు : అన్ని ఎఫ్.పి.ఎస్. లలో ఈ.పి.ఓ.ఎస్. పరికరాలతో బయోమెట్రిక్ స్కానర్ ల సంస్థాపన ఇటీవల ప్రారంభమైంది. మూడు జిల్లాల్లో పరీక్షించడం కూడా ప్రారంభమైంది. 2020 సెప్టెంబర్ నెల చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఈ.పి.ఓ.ఎస్. సంస్థాపన పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా, 2020 అక్టోబర్ నాటికి రాష్ట్రం జాతీయ పోర్టబిలిటీని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.
ix. పశ్చిమ బెంగాల్ : రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల పంపిణీ కోసం బయోమెట్రిక్ గా ప్రామాణీకరించబడిన లావాదేవీలను ఇంకా ప్రారంభించలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. నిర్ణయించుకున్న గడువుకు రాష్ట్రం కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు.
x. అండమాన్ మరియు నికోబార్ : లబ్ధిదారుల బయోమెట్రిక్ ధృవీకరణను ప్రారంభించడానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన పరిపాలనా యంత్రాంగం అన్ని ఎఫ్.పి.ఎస్. లలో ఈ.పి.ఓ.ఎస్. పరికరాలను భర్తీ చేస్తోంది. పరికరాలను మార్చడం ద్వారా లేదా మొబైల్ యాప్ ల వంటి ప్రత్యామ్నాయ మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా త్వరలో ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని కేంద్ర పాలిత ప్రాంతం యోచిస్తోంది. 2020 అక్టోబర్ నాటికి ఈ విధానం ప్రారంభమౌతుందని భావిస్తున్నారు.
xi. చండీగఢ్ : ఒక ఎస్.ఓ.పి. ని రూపొందించడం జరిగింది. డి.బి.టి. (నగదు) ను అమలుచేస్తున్న కేంద్ర పాలిత ప్రాంతం డి.బి.టి. నగదు బదిలీ మాధ్యమం ద్వారా ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ పోర్టబిలిటీని ప్రారంభించడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ యాప్ ను అభివృద్ధి చేయడానికి అంగీకరించింది. ఈ విధానం 2020 నవంబర్ నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
xii. పుదుచ్చేరి : జాతీయ పోర్టబిలిటీ అమలు కోసం ఒక ఎస్.ఓ.పి. ఈ డి.బి.టి. (నగదు) కేంద్ర పాలిత ప్రాంతంతో భాగస్వామ్యం చేయబడింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. అమలు చేయడానికి 2021 జనవరి ని గడువుగా నిర్ణయించారు.
*****
(Release ID: 1647149)
Visitor Counter : 438