శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి & ఐఐటి మద్రాస్ అంకుర సంస్థకోవిడ్-19 కోసం తరలించగల చిన్న ఆసుపత్రి సదుపాయాన్ని రూపొందించింది

‘‘మడత పెట్టగల, చిన్నవైన, ముందుగానే తయారైన ఈ ఆసుపత్రులను అవసరమైన ప్రదేశంలో సులువుగా కూర్చవచ్చు. మహమ్మారులు, విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన అవసరాలను సమర్ధవంతంగా తీర్చడానికి ఇవి తక్షణ పరిష్కారంగా ఉపయోగపడతాయి’’- ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

ముందస్తు నిర్మాణ క్రమజాల సాంకేతికత, టెలిస్కోపిక్ ఫ్రేముల అమరికగా ఉండే ఈ ఆసుపత్రి వాస్తవ పరిమాణంలో ఐదో వంతు స్థలంలోనే ఇమిడిపోతుంది. అందువల్ల నిల్వ చేయడం, రవాణా చేయడం తేలిక

ఇప్పటిదాకా చెన్నై చెంగల్ పేటలో సుగాహ్ హెల్త్ కార్ప్ ప్రైవేట్ కార్పొరేషన్ వద్ద రూ. 34 లక్షల ఖర్చుతో ఓ 30 పడకల ఆసుపత్రి, కేరళ వాయనాడ్ జిల్లాలోని వరదూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ సంస్థ) వద్ద రూ. 16 లక్షల ఖర్చుతో ఓ 12 పడకల ఆసుపత్రి- ‘ఫోర్- జోన్’ ఆసుపత్రులుగా విజయవంతంగా ఏర్పాటయ్యాయి

Posted On: 19 AUG 2020 5:14PM by PIB Hyderabad

ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే వ్యవస్థల ఏర్పాటుకు (నిర్ధిష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో) ఉన్న అవసరాన్ని కోవిడ్-19 ఎత్తిచూపింది. స్థానిక ప్రజా సమూహాల్లో కోవిడ్-19 పేషెంట్లను కనిపెట్టి, పరీక్షించి, గుర్తించి, విడిగా ఉంచి, చికిత్స చేసేందుకు పోర్టబుల్ (విడదీసి తరలించగల చిన్న) ఆసుపత్రులు సమీప భవిష్యత్తులో ఓ పరిష్కారం కానున్నాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న డిమాండ్లను అధిగమించేందుకు ఇవి దోహదపడతాయి.

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి) పరిధిలో ఉండే స్వయంప్రతిపత్తి గల సంస్థ శ్రీ చిత్ర తిరునల్ ఇన్ట్సిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి)... ఐఐటి మద్రాస్ తీర్చిదిద్దిన అంకుర సంస్థ ‘మాడ్యులస్ హౌసింగ్’తో కలసి ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. తేలిగ్గా తరలించగల సూక్ష్మ నిర్మాణాల ద్వారా వికేంద్రీకృత పద్ధతిని అనుసరించి స్థానిక సమూహాల్లోని కోవిడ్-19 పేషెంట్లను కనిపెట్టి చికిత్స అందించడమే ఆ పరిష్కారం.

ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. శాస్త్రవేత్తలు మిస్టర్ ఎన్.ఎన్. సుభాష్, మిస్టర్ సి.వి. మురళీధరన్ ‘మాడ్యులస్ హౌసింగ్’ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మిస్టర్ శ్రీరాం రవిచంద్రన్ తో, ఆయన సహాయకులతో కలసి... తేలికగా తరలించగల ఓ సూక్ష్మ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘‘మెడిక్యాబ్ (MediCAB)’’. అది పలు విడి భాగాల సమాహారం, తరలించగల చిన్న నిర్మాణం, మన్నికైనది, తేలికగా ఏర్పాటు చేయగలిగినది. వినియోగదారు అవసరాలకు అనుగుణంగా అందులో మార్పులు చేసి నిర్మించుకోవచ్చు. మడత పెట్టగలిగిన ఈ నిర్మాణం నాలుగు జోన్లు- వైద్యుని గది, ఐసొలేషన్ గది, వైద్యం చేసే గది/ వార్డు, రెండు పడకల ఐసియు- గా ఉంటుంది. ప్రతికూల పీడనంతో నిర్వహించబడుతుంది. దాన్ని తేలికగా తరలించవచ్చు. ఏ భౌగోళిక ప్రాంతంలోనైనా స్థాపించే వీలుంది. నలుగురు మనుషుల సాయంతో కేవలం రెండు గంటల్లోనే ఏర్పాటు చేయవచ్చు. ‘మెడిక్యాబ్’ లోని క్యాబిన్లు బిగువుగా కప్పబడి ధూళి చొరబడలేని విధంగా ఉంటాయి. ‘మెడిక్యాబ్’ అంతర్గత విద్యుత్ అనుసంధానంతో ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణాన్ని, భారీ వర్షాలను కూడా ‘మెడిక్యాబ్’ తట్టుకోగలదు.

ఈ ఆసుపత్రి ముందస్తు నిర్మాణ క్రమజాల సాంకేతికత, టెలిస్కోపిక్ ఫ్రేముల అమరికగా ఉంటుంది. వాస్తవ పరిమాణంలో ఐదో వంతు స్థలంలోకి కుదించడానికి వీలు కలుగుతుంది. అందువల్ల నిల్వ చేయడం, తరలించడం తేలిక. ఈ పోర్టబుల్ యూనిట్లు 200, 400, 800 చదరపు అడుగుల పరిమాణాల్లో లభ్యమవుతాయి. సంస్థల అవసరాలు, స్థల లభ్యతను బట్టి ఈ యూనిట్లను కారు పార్కింగ్ స్థలంలో గానీ, ఆసుపత్రుల డాబాల పైన గానీ ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇప్పటిదాకా చెన్నై చెంగల్ పేటలో సుగాహ్ హెల్త్ కార్ప్ ప్రైవేట్ కార్పొరేషన్ వద్ద రూ. 34 లక్షల ఖర్చుతో ఓ 30 పడకల ఆసుపత్రి, కేరళ వాయనాడ్ జిల్లాలోని వరదూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ సంస్థ) వద్ద రూ. 16 లక్షల ఖర్చుతో ఓ 12 పడకల ఆసుపత్రి- ‘ఫోర్- జోన్’ ఆసుపత్రులుగా విజయవంతంగా ఏర్పాటయ్యాయి. 

ఈ తరలించే ఆసుపత్రులను వేగంగా కోవిడ్-19 ఐసొలేషన్ వార్డులుగా ప్రారంభించగలిగేలా... ద్వంద్వ నమూనాపై పని చేస్తున్నట్లు ‘మాడ్యులస్ హౌసింగ్’ బృందం తెలిపింది. ‘మాడ్యులస్ హౌసింగ్’ ఇదివరకు వరదల సమయంలో ఎల్ & టి, టాటా గ్రూపు, షాపూర్జీ, సెల్కో వంటి వివిధ రంగాల్లోని ప్రతిష్టాత్మక ఖాతాదారులకు అత్యవసర గృహ పరిష్కారాలను సమకూర్చింది. తాజా ప్రయత్నాన్ని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తమ సామాజిక మాధ్యమ వేదికపై ప్రశంసించింది. 

‘‘మడత పెట్టగల, చిన్నవైన, ముందుగానే తయారైన ఈ ఆసుపత్రులను అవసరమైన ప్రదేశంలో సులువుగా కూర్చవచ్చు. మహమ్మారులు, విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన అవసరాలను సమర్ధవంతంగా తీర్చడానికి ఇవి తక్షణ పరిష్కారంగా ఉపయోగపడతాయి’’- ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కార్యదర్శి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ.

 

A picture containing indoor, kitchen, cabinet, buildingDescription automatically generatedA picture containing outdoor, grass, truck, streetDescription automatically generatedA bed in a roomDescription automatically generated

A close up of a doorDescription automatically generatedA house with a grass fieldDescription automatically generated

[For further details, Mr. Subhash NN (Subhashnn@sctimst.ac.in) and Mr. Shreeram Ravichandran (Shreeramdpm[at]gmail[dot]com)  can be contacted.

Author:

Originally from India, Er. Arvind Kumar Prajapati is a Scientist/Engineer at Sree Chitra Tirunal Institute for Medical Sciences & Technology who now lives in Trivandrum, Kerala. Arvind has about eight years of work experience in Medical Devices, New Product Development Process (NPDP), CAD modeling (PTC Creo), Design Control documents (DIOVV, DFMECA), Verification activity & Tolerance analysis, Finite Element Analysis, Welding, Biomechanics of Knee & Hip joint, Geometric Dimensioning and Tolerancing (GD&T), Manufacturing Methods, Design & development of customised Knee & Hip instruments.

Web page: https://sctimst.ac.in/People/arvind]

 

 

*****



(Release ID: 1647074) Visitor Counter : 175