రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో ఎరువుల లభ్యతపై రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో సమావేశం నిర్వహించి, కొరత లేదని హామీ ఇచ్చిన - శ్రీ మాండవియ
प्रविष्टि तिथि:
18 AUG 2020 6:41PM by PIB Hyderabad
కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియ ఈ రోజు రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు, ఎరువులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శ్రీ మాండవియా మాట్లాడుతూ దేశంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇవి రైతు సమాజానికి అవసరమైన పరిమాణంలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎరువులు సజావుగా సరఫరా చేయడానికి రాష్ట్ర పరిపాలన అధికారులందరితో సమన్వయంతో పనిచేయాలని మంత్రిత్వ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో కొన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ ఛబిలేంద్ర రౌల్, సంయుక్త కార్యదర్శితో పాటు ఆ శాఖ లోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
****
(रिलीज़ आईडी: 1646780)
आगंतुक पटल : 213