ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్వావలంబన యొక్క ఆశయాన్ని సాధించడానికి, "స్వదేశీ మైక్రో ప్రోసెసర్ ఛాలెంజ్" ను ప్రారంభించిన - శ్రీ రవిశంకర్ ప్రసాద్
"ఆత్మ నిర్భర్ భారత్" వైపు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు.
2020 ఆగస్టు 18వ తేదీన మైగోవ్ పోర్టల్ ద్వారా ప్రారంభమైన - నమోదు ప్రక్రియ
100 సెమీ-ఫైనలిస్టులకు మొత్తం ఒక కోటి రూపాయల పురస్కారం, 25 మంది ఫైనలిస్టులకు మొత్తం ఒక కోటి రూపాయల పురస్కారం.
ఫైనల్ లోకి ప్రవేశించే మొదటి 10 స్థానాల్లో నిలిచిన జట్లకు మొత్తం 2.30 కోట్ల రూపాయల సీడ్ ఫండ్ తో పాటు 12 నెలలపాటు ఇంక్యుబేషన్ సపోర్ట్ కూడా లభిస్తుంది
దేశీయంగా అభివృద్ధి చెందిన మైక్రోప్రాసెసర్లు 'శక్తి' మరియు 'వేగా', ఎం.ఈ.ఐ.టి.వై. యొక్క మైక్రోప్రోసెసర్ అభివృద్ధి కార్యక్రమం ఆధ్వర్యంలో తయారు చేయబడ్డాయి.
Posted On:
18 AUG 2020 3:31PM by PIB Hyderabad
దేశంలో స్టార్ట్-అప్, ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ యొక్క బలమైన పర్యావరణ వ్యవస్థకు మరింత ప్రేరణనిచ్చేందుకు కేంద్ర న్యాయం, చట్టం, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు “స్వదేశీ మైక్రోప్రాసెసర్ ఛాలెంజ్ - # ఆత్మా నిర్భర్ భారత్ కోసం ఇన్నోవేట్ సొల్యూషన్స్” ను ప్రారంభించారు.
ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ యొక్క మైక్రోప్రోసెసర్ అభివృద్ధి కార్యక్రమం ఆధ్వర్యంలో ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించి, ఐ.ఐ.టి. మద్రాస్ మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సి.డి.ఎ.సి) సంస్థలు వరుసగా శక్తి (32 బిట్) మరియు వేగా (64 బిట్) అనే రెండు మైక్రోప్రోసెసర్లను అభివృద్ధి చేశాయి. “స్వదేశీ మైక్రోప్రోసెసర్ ఛాలెంజ్ - # ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఇన్నోవేట్ సొల్యూషన్స్” వివిధ సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఈ మైక్రోప్రోసెసర్లను ఉపయోగించమని ఆవిష్కర్తలు, అంకురసంస్థలు, విద్యార్థులను ఆహ్వానించడానికి ప్రయత్నిస్తోంది.
స్వావలంబన యొక్క ఆశయాన్ని సాకారం చేసే దృఢమైన దశలలో ఒకటిగా మరియు “ఆత్మ నిర్భర్ భారత్” వైపు ఒక ముఖ్యమైన అడుగు మరియు వ్యూహాత్మక మరియు పారిశ్రామిక రంగాల యొక్క భారతదేశ భవిష్యత్తు అవసరాలను తీర్చదాంతో పాటు, భద్రత, లైసెన్సింగ్, సాంకేతిక పరిజ్ఞానం వాడుకలో లేకపోవడం మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. దేశ, విదేశాలలో ఉన్న ఫౌండ్రీ వద్ద ఈ అత్యాధునిక ప్రోసెసర్ వేరియంట్ల రూపకల్పన, అభివృద్ధి, ఫ్యాబ్రికేషన్, దేశంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మరియు తయారీ యొక్క శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంతిమ లక్ష్యానికి ఇది ఒక విజయవంతమైన దశ.
"స్వదేశీ మైక్రోప్రోసెసర్ ఛాలెంజ్" అనేది దేశంలో టెక్నాలజీ నేతృత్వంలోని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, డిజిటల్ స్వీకరణలో ముందంజలో ఉండటానికి, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ తీసుకున్న చురుకైన, ముందస్తు, ఉత్తమ చర్యల శ్రేణిలో ఒక భాగం. అన్ని స్థాయిలు, అనుకర సంస్థలలోని విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్న ఈ ఛాలెంజ్ పోటీదారులను ఈ స్వదేశీ ప్రోసెసర్ ఐ.పి.లతో టింకర్ చేయడంతో పాటు, సామాజిక అవసరాలకు పొదుపు పరిష్కారాలను ఆవిష్కరించడానికి వీలు కల్పిస్తుంది. సమీప భవిష్యత్తులో ప్రపంచ మరియు దేశీయ అవసరాలను తీర్చడానికి సంక్లిష్టమైన డిజైన్లను అభివృద్ధి చేయడానికి స్వదేశీ ప్రాసెసర్ల చుట్టూ దేశీయ పర్యావరణ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
పోటీదారులకు, ఎలక్ట్రానిక్స్ మరియు ఐ.టి. మంత్రిత్వ శాఖ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దేశంలోని ఉత్తమ వి.ఎల్.సి.ఐ. మరియు ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ నిపుణుల నుండి ఇంటర్న్ షిప్ అవకాశాలు, సాధారణ సాంకేతిక మార్గదర్శకాలను మాత్రమే కలిగి ఉన్న సాంకేతిక వనరులతో పాటు, ఇంక్యుబేషన్ సెంటర్లచే సులభతరం చేయబడిన వ్యాపార మార్గదర్శకత్వం మరియు నిధుల మద్దతు కూడా లభిస్తుంది. హార్డ్ వేర్ ప్రోటోటైప్ ను అభివృద్ధి చేయడానికి, స్టార్టప్ ను ఇంక్యుబేట్ చేయడానికి ఈ ఛాలెంజ్ యొక్క వివిధ దశలలో 4.30 కోట్ల రూపాయలు అందించడం జరుగుతుంది.
ఈ ఛాలెంజ్ 2020 ఆగస్టు, 18వ తేదీన https://innovate.mygov.in వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ప్రారంభమై, 10 నెలల పాటు కొనసాగి, 2021 జూన్ నెలలో ముగుస్తుంది. 100 సెమీ-ఫైనలిస్టులకు మొత్తం ఒక కోటి రూపాయల పురస్కారం, 25 మంది ఫైనలిస్టులకు మొత్తం ఒక కోటి రూపాయల పురస్కారం పొందే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా, ఫైనల్ లోకి ప్రవేశించే మొదటి 10 స్థానాల్లో నిలిచిన జట్లకు మొత్తం 2.30 కోట్ల రూపాయల సీడ్ ఫండ్ తో పాటు 12 నెలలపాటు ఇంక్యుబేషన్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అన్నింటి కంటే మించి, ఈ పోటీలో పాల్గొనేవారు తమ ఆవిష్కరణలను స్వదేశీ ప్రోసెసర్లతో అన్వయించుకుని, అధిక వీక్షకులకు అందుబాటులో ఉండే మాధ్యమం ద్వారా ప్రదర్శించడానికి అవకాశం పొందుతారు. అదేవిధంగా, మనసులో ఉండే ఆలోచనను మార్కెట్ వరకు అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుంది. తద్వారా # ప్రభుత్వ ఆత్మ నిర్భరత యొక్క మొత్తం మిషన్ కు తోడ్పడే అవకాశం ఉంటుంది.
*****
(Release ID: 1646767)
Visitor Counter : 279