విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఫ్లై యాష్ వినియోగాన్ని పెంచేందుకు రిహాండ్ లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేసిన ఎన్‌టిపిసి

Posted On: 16 AUG 2020 1:51PM by PIB Hyderabad

దేశంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయినా కేంద్ర పిఎస్యు ఎన్‌టిపిసి దూర ప్రాంతాల్లోని వివిధ సిమెంట్ కంపెనీలకు ఫ్లై యాష్ రవాణా చేయడానికి  ఉత్తర్ ప్రదేశ్ లోని రిహాండ్ ప్రాజెక్ట్ వద్ద మౌలిక సౌకర్యాలను అభివృద్ధి  చేసింది. విద్యుత్ ప్లాంట్లలో ఫ్లై యాష్ ను 100 శాతం వినియోగించుకోవయాలనే తన విధానానికి అనుగుణంగా  ఎన్‌టిపిసి తక్కువ ధరలో ఫ్లై యాష్ అందించడానికి ఈ మౌలిక అభివృద్ధికి నడుంబిగించింది. 

సుమారు 458 కిలోమీటర్ల దూరంలో ఉన్న టికెరియా లోని ఎసిసి సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం 3450 మెట్రిక్ టన్ను (ఎమ్‌టి) ఫ్లై యాష్ కలిగిన 59 BOXN రకం రైల్వే వ్యాగన్ల మొదటి రేక్ ను ఎన్‌టిపిసి రిహండ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎన్‌టిపిసి రిహంద్) శ్రీ బాలాజీ అయ్యంగార్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్‌టిపిసి రిహంద్  సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

తూర్పు మధ్య  రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ త్రివేది, ఎసిసి సప్లై చైన్ హెడ్ శ్రీ సురేష్ రాఠీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టార్పాలిన్‌తో కప్పబడిన బాక్సన్ వ్యాగన్లలో ఫ్లై యాష్ ను  సరఫరాను ప్రారంభించడానికి ఎన్‌టిపిసి రిహంద్ అధికారులు ప్రముఖ సిమెంట్ ఉత్పత్తిదారులతో పాటు తూర్పు సెంట్రల్ రైల్వేను సంప్రదించారు. ఈ ఆవిష్కరణ విద్యుత్ ప్లాంట్ల నుండి ఫ్లై యాష్ ను పెద్ద పరిమాణంలో దూరంలో ఉన్న సిమెంట్ ఉత్పత్తి యూనిట్లకు సమర్థవంతంగా, సురక్షితంగా రవాణా చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

ఫ్లై యాష్ ను మారుమూల ప్రదేశం నుండి వినియోగ కేంద్రానికి రవాణా చేయడానికి ఈ ప్రయత్నం ఒక కొత్త శకానికి నాంది పలికింది, భారత రైల్వేలకు అదనపు మెటీరియల్ లోడింగ్ మార్గాల లభ్యత, పోటీ ధర వద్ద పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో సిమెంట్ ప్లాంట్లకు ఫ్లై యాష్ ప్రాప్యతతో దాని వినియోగాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి విద్యుత్ ప్లాంట్లను అనుమతిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోఉత్పత్తి చేసిన యాష్ 73.31% లో దాదాపు 44.33 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ ను వివిధ ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించారు. 

అంతేకాకుండా, ఫ్లై యాష్ ఆధారిత జియో-పాలిమర్ రోడ్, సిమెంట్ కాంక్రీటులో చక్కటి కంకర (ఇసుక) స్థానంలో దిగువ బూడిదను ఉపయోగించడం వంటి ఫ్లై యాష్ నిర్వహణ కొత్త మార్గాలను కంపెనీ చూస్తోంది. అలాగే, ఎగుమతి ప్రయోజనాల కోసం ఫ్లై యాష్ క్లాసి‌ఫైర్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్‌టిపిసి ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 62.9 గిగావాట్ల వ్యవస్థాపక సామర్థ్యంతో, 25 అనుబంధ & జెవి పవర్ స్టేషన్లతో కలిపి ఎన్‌టిపిసి గ్రూప్‌లో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / లిక్విడ్ ఫ్యూయల్, 1 హైడ్రో, 13 రెన్యూవబుల్స్ ఉన్నాయి . 5 జిబ్ల్యూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో సహా ఈ నిర్మాణం 20 జిడబ్ల్యూ కి పైగా సామర్థ్యాన్ని కలిగి ఉంది.

***



(Release ID: 1646314) Visitor Counter : 189