రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఐ.సి.సి.ఆర్. ప్రధాన కార్యాలయంలో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటాన్ని ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించిన - భారత రాష్ట్రపతి.

Posted On: 16 AUG 2020 1:55PM by PIB Hyderabad

భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ద్వితీయ వర్ధంతి సందర్భంగా, ఆయన చిత్ర పటాన్ని, భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్, ఈ రోజు (ఆగస్టు, 16, 2020), ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐ.సి.సి.ఆర్) ప్రధాన కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించారు.   శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, తాను విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో 1977, మార్చి నుండి 1979 ఆగస్టు వరకు ఐ.సి.సి.ఆర్. సంస్థకు ఎక్స్-అఫిషియో అధ్యక్షునిగా పనిచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో అనేక అద్భుతమైన అధ్యాయాలను సృష్టించిన మహోన్నతమైన జాతీయవాదికి, ఈ ఆన్ లైన్ కార్యాక్రమం ద్వారా, మనం నివాళులు అర్పిస్తున్నామని ఆయన అన్నారు. అటల్ జీ ఎప్పుడూ ఉదారవాద ఆలోచనలకు, ప్రజాస్వామ్య ఆదర్శాలకు కట్టుబడి ఉండేవారని, ఆయన అన్నారు. ఆయన తన ప్రత్యేక వ్యక్తిత్వానికి చెరగని ముద్ర వేశారు.  పార్టీ కార్యకర్తగా, పార్లమెంటు సభ్యునిగా, పార్లమెంటు లోని ముఖ్యమైన స్టాండింగ్ కమిటీలకు చైర్మన్ గా, ప్రతిపక్ష నాయకునిగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా విభిన్న పాత్రలలో ఆయన గొప్ప కృషి చేశారు.  అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న ప్రజలకు జాతీయ ఆసక్తి ఎల్లప్పుడూ ముఖ్యమని,  అటల్ జీ, తన ప్రవర్తన ద్వారా, నేర్పించారు.

కోవిడ్ -19 కారణంగా ఈ రోజు ప్రపంచం మొత్తం ప్రమాదంలో ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  అయితే, ఈ మహమ్మారి నుండి కోలుకున్న తరువాత మనం పురోగతి, శ్రేయస్సు మార్గంలో వేగంగా పయనిస్తామనీ, 21 వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా చేయాలనే అటల్ జీ కలను సాకారం చేయడంలో విజయవంతమవుతామనీ, ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకం - "సదైవ్ అటల్ స్మారకాన్ని రాష్ట్రపతి ఈ ఉదయం సందర్శించారు, మాజీ ప్రధానమంత్రి ద్వితీయ వర్ధంతి  సందర్భంగా రాష్ట్రపతి నివాళులర్పించారు.

 

రాష్ట్రపతి హిందీ ప్రసంగం చదవడానికి ఇక్కడ "క్లిక్"చేయండి. 

***

 

 

 

 

*****



(Release ID: 1646292) Visitor Counter : 170