వ్యవసాయ మంత్రిత్వ శాఖ
గత సంవత్సరంతో పోలిస్తే మొత్తం ఖరీఫ్ పంట విత్తు విస్తీర్ణం 8.54% పెరుగుదల
అన్ని ఖరీఫ్ పంటల విస్తీర్ణంలోనూ మెరుగుదల
Posted On:
14 AUG 2020 6:05PM by PIB Hyderabad
ఖరీఫ్ పంట కాలంలో విత్తు నాటే కార్యక్రమ ప్రగతి సంతృప్తి కరంగా ఉంది. 2020 ఆగష్టు 14 కి మొత్తం 1015.58 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 935.70 లక్షల హెక్టార్లుగా ఉంది. దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల గత ఏడాది కన్నా 8.54% మేర ఉంది.
బియ్యం: ఈ ఏడాది 358.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, గత ఏడాది 308.51 లక్షల హెక్టార్లు. ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే 43.35 లక్షల హెక్టార్ల విస్తీర్ణం పెరిగింది.
పప్పుధాన్యాలు: ఈ ఏడాది 124.01 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, గత ఏడాది 121.50 లక్షల హెక్టార్లు.ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే విత్తు నాటిన విస్తీర్ణం 2.51 లక్షల హెక్టార్ల ఎక్కువ.
ముతక ధాన్యాలు: ముతక తృణధాన్యాలు కింద 162.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో విత్తనాలు ఈ ఏడాది నాటితే, గత ఏడాది ఆ విస్తీర్ణం 162.28 లక్షల హెక్టార్లుగా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే 5.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణం పెరుగుదల కనిపిస్తోంది.
నూనెగింజలు: ఈ ఏడాది సుమారు 187.14 లక్షల హెక్టార్ల విస్తీర్ణం లో పంట వేస్తె, గత ఏడాది ఇదే సమయంలో 163.57 లక్షల హెక్టార్లు పంట వేశారు రైతులు. ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే 23.56 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఎక్కువగా ఉంది.
చెరకు: ఈ ఏడాది 52.02 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట వేస్తె, గత ఏడాది అది 51.40 లక్షల హెక్టార్లుగా ఉంది. ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే 0.62 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఎక్కువగా ఉంది.
జనపనార & గోగునార : ఈ పంట ఈ ఏడాది 6.96 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేస్తె గత సంవత్సరం ఈ పంట విస్తీర్ణం 6.85 లక్షల హెక్టార్లుగా నమోదయింది. ఈ విధంగా గత సంవత్సరంతో పోలిస్తే 0.11 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఎక్కువగా ఉంది.
పత్తి: సుమారు 125.48 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట ఈ ఏడాది వేస్తె, గత ఏడాది 121.58 లక్షల హెక్టార్లు వేశారు. గత సంవత్సరంతో పోల్చితే 3.90 లక్షల హెక్టార్ల విస్తీర్ణం అధికంగా ఉంది.
సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 123 జలాశయాలలో ప్రత్యక్ష నీటి నిల్వ గత ఏడాది ఇదే కాలంలో 88% ఉందని నివేదించింది.
మరింత సమాచారం కోసం :
****
(Release ID: 1646048)
Visitor Counter : 234