యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ కార్య‌క్ర‌మాన్ని విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించిన కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు

దేశంలోని అన్ని వ‌ర్గాల‌నుంచి ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ కార్య‌క్ర‌మానికి వెల్లువెత్తిన మ‌ద్ద‌తు. శారీర‌క దృఢ‌త్వ సాధ‌న‌కోసం అద్భుత కార్య‌క్ర‌మంగా అవ‌త‌రిస్తుందంటున్న నిర్వాహ‌కులు

Posted On: 14 AUG 2020 7:51PM by PIB Hyderabad

విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ఆన్‌లైన్ ద్వారా ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ కార్య‌క్ర‌మాన్ని  కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు శుక్ర‌వారంనాడు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు పాల్గొంటూ వున్నాయి. దీన్ని శారీర‌క దృఢ‌త్వ సాధ‌న‌కోసం ప‌నికొచ్చే ఒక‌ అద్భుత్వ కార్య‌క్ర‌మంగా తీర్చిదిద్దుతున్నామ‌ని నిర్వాహ‌కులు దీమా వ్య‌క్తం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా ఈ సారి దీన్ని వినూత్న ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్నారు. దీనిలో పాల్గొనేవారు త‌మ త‌మ ప్రాంతాల్లో త‌మకు అనుకూల‌మైన స‌మ‌యంలో ఆగ‌స్టు 15నుంచి అక్టోబ‌ర్ 2 మ‌ధ్య‌లో ఎప్పుడైనా చేప‌ట్ట‌వ‌చ్చు. 
స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం ( బిఎస్ ఎఫ్‌), ఇండో టిబెటిన్ బార్డ‌ర్ పోలీస్ ( ఐటిబిపి), సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ ( సిఆర్ పి ఎఫ్‌)ల‌తో క‌లుపుకొని ప‌లు సైనిక ద‌ళాలు దేశ వ్యాప్తంగా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటాయి. భార‌తీయ రైల్వేలు, సిబిఎస్ ఇ, ఐ సిఎస్ ఇ పాఠ‌శాల‌లు పాల్గొంటాయి. నెహ్రూ యువ కేంద్ర సంఘ‌ట‌న్ కు చెందిన 75 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు, జాతీయ సేవా ప‌థ‌కం ( ఎన్ ఎస్ ఎస్) స‌భ్యులు, ఇండియా స్పోర్ట్స్ అథారిటీ శిక్ష‌కులు..ఇలా ప‌లువురు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. 
ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ లో పాల్గొన‌డానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆసక్తి చూడం ఎంతో సంతోషంగా వుంద‌ని కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ఆనందం వ్య‌క్తం చేశారు. ఉద్యోగుల‌ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను, అన్ని క‌మ్యూనిటీల ప్ర‌జ‌ల‌ను  ఈ కార్య‌క్ర‌మంలోకి తీసుకొని రావ‌డంవ‌ల్ల‌ అది భార‌త స్వాతంత్ర్య స్ఫూర్తిని ఘ‌నంగా చాటుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఫిట్ ఇండియా ఉద్య‌మం ప్ర‌జ‌ల ఉద్య‌మంగా మారాల‌నేది ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త అని ఆయ‌న క‌ల వాస్త‌వ రూపం దాలుస్తోంద‌ని కేంద్ర మంత్రి అన్నారు. 
బిఎస్ ఎఫ్ జవాన్లు తాము సేవ‌లందిస్తున్న స‌రిహ‌ద్దుల్లో ఉద‌య‌మే జాతీయ‌జెండాలు చేత‌బ‌ట్టి ఫ్రీడ‌మ్ ర‌న్ లో పాల్గొంటార‌ని బిఎస్ ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ త‌న‌తో చెప్పిన‌ట్టు కేంద్ర‌మంత్రి అన్నారు. ప్ర‌జ‌ల్లో దేశ‌భ‌క్తిని నింపడానికి ఇది ఎంతగానో దోహ‌దం చేస్తుంద‌ని భార‌తీయ పౌరులుగా వారి ఆలోచ‌నాశ‌క్తిని ఘ‌నంగా చాటుతుంద‌ని ఆయ‌న‌ అన్నారు. మ‌న బ‌ల‌గాల్లోవున్న సంస్కృతి ఎంతో అంద‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రీడ‌మ్ ర‌న్ అనేది ఒక సంబ‌రం , పండ‌గ‌లాంటిద‌ని ఆయ‌న వివ‌రించారు. 
సిఆర్ పిఎఫ్ జ‌వాన్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దీంట్లో పాల్గొంటార‌ని సిఆర్ పిఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అన్నారు. త‌మ‌వైపునుంచి ఈ కార్య‌క్ర‌మంలో 12 ల‌క్ష‌ల‌కు పైగా పాల్గొంటార‌ని ఆయ‌న అన్నారు. ఒక కోటి కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఫ్రీడ‌మ్ ర‌న్ కొన‌సాగించాలని తాము ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. 
ఫిట్ ఇండియా ఫ్రీడ‌మ్ ర‌న్ అనేది త‌మ ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపుతోంద‌ని వారు శారీర‌క ప‌టుత్వానికి కావ‌ల‌సిన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేలా చేస్తోంద‌ని రైల్వే బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వినోద్ యాద‌వ్ అన్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో త‌మ విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులుపాల్గొంటార‌ని సిబిఎస్ ఇ, ఐసిఎస్ ఇ ఛైర్మెన్లు తెలిపారు. 

 

***



(Release ID: 1645999) Visitor Counter : 164