గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

17 ఆగస్టు, 2020న గిరిజన ఆరోగ్య, పౌష్టిక పోర్టల్ "స్వాస్థ్య" ను ఈ - ప్రారంభం చేయనున్న శ్రీ అర్జున్ ముండా.

Posted On: 14 AUG 2020 6:05PM by PIB Hyderabad

దేశంలో గిరిజన జనాభా ఆరోగ్య మరియు పౌష్టిక అంశాలకు సంబంధించి ఒకేచోట పరిష్కారం లభించే  మొట్టమొదటి పోర్టల్  "స్వాస్థ్య" ను  17 ఆగస్టు, 2020 (సోమవారం) కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ఈ - ప్రారంభం చేస్తారు.  ఈ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  పిరమల్ స్వాస్థ్య సంస్థ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ "స్వాస్థ్య"  పోర్టల్ ను అభివృద్ధి చేసింది.  గిరిజనుల ఆరోగ్య మరియు పౌష్టిక విషయాలకు, సమస్యలకు సంబంధించిన పోర్టల్  ఇది.  షెడ్యూల్ తెగలకు చెందిన ప్రజల ఆరోగ్య మరియు పౌష్టిక విషయాలకు సంబంధించిన సమాచారం, పరిష్కారం   "స్వాస్థ్య" పోర్టల్ ద్వారా ఒకే చోట  లభిస్తుంది.  

భారతావనికి చెందిన గిరిజన జనాభాకు సంబంధించిన ఆరోగ్య మరియు పౌష్టిక అంశాల సమాచారం అందించే మొట్టమొదటి సమగ్ర వేదిక "స్వాస్థ్య".   దానిలో ఒక డ్యాష్ బోర్డు,  జ్ఞాన నిధి,  భాగస్వాముల భాగము,  రక్తకణాలు కొడవలి ఆకృతి దాల్చే వ్యాధిగ్రస్తులకు అండగా  ఉండే వేదిక   పోర్టల్ డ్యాష్ బోర్డులో   గుర్తింపు పొందిన 177 గిరిజన జిల్లాలకు చెందిన వివిధ వర్గాల నుంచి  సేకరించిన సమాచారం మరియు  గిరిజనుల ఆరోగ్యం మరియు పౌష్టిక  విషయాలపై జరిపిన పరిశోధనల ఫలితాలు,  వినూత్న కల్పనలు మరియు వారి అలవాట్లలో మంచి వాటిని గురించిన సమాచారం పొందుపరుస్తున్నారు.   అంతేకాక  కొడవలి కణ వ్యాధిగ్రస్తులు తమ సమస్యను పోర్టల్ లో నమోదు చేసుకొని సహాయం కూడా పొందవచ్చు.  ఈ పోర్టల్ దేశంలోని గిరిజన జనాభాకు ఆరోగ్య మరియు పౌష్టిక విషయాల్లో అండగా  నిలుస్తుందని   

 గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వారధి కాగలదని  ఆశిస్తున్నారు.  

పిరమల్ స్వాస్థ్య మేనేజిమెంట్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్  సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  (సి ఓ ఈ) సంస్థ ఈ పోర్టల్ ను  పర్యవేక్షిస్తుంది.   వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, ఉత్తమ అలవాట్ల ఆధారంగా గిరిజనుల ఆరోగ్య మరియు పౌష్టికతను మెరుగుపరచడం ఈ పోర్టల్ ఉద్దేశం.  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  ఆ దిశలో కృషి చేస్తుంది.  

***


(Release ID: 1645917) Visitor Counter : 266