సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

కలెక్టర్లు, కార్యదర్శులతో నాశముక్త్ భారత్ ప్రచారోద్యమంపై ప్రసంగించిన శ్రీ గెహ్లాట్

15న ప్రారంభమై వచ్చే మార్చి 31 దాకా ఏడు నెలలు సాగనున్న ప్రచారోద్యమం

Posted On: 14 AUG 2020 6:34PM by PIB Hyderabad

నాశ ముక్త్ భారత్ ప్రచారోద్యమానికి సంబంధించిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతా శాఖామంత్రి శ్రీ తావర్ చంద్ గెహ్లాట్ వెబ్ ద్వారా ప్రసంగించారు. 272 మంది జిల్లా కలెక్టర్లు, 31 రాష్ట్రాల కార్యదర్శులు, 500 కు పైగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామాధికారులు, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరీ అధికారులు, ఎన్ డి డి టి సి, ఎయిమ్స్ డాక్టర్లు, వృత్తి నిపుణులు, నాశ ముక్త్ భారత్ ప్రచారోద్యమానికి సంబంధించిన అధికారులు ఈ  వెబ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  దీన్ని మరింతగా ముందుకు తీసుకుపోవటానికి ఎన్ ఐ సి కృషి చేస్తోంది. నాలుగు ప్రచార గోడ పత్రికలను కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా సమాజిక న్యాయశాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్ గుర్జార్, శ్రీ రాందాస్ అతవాలే, శ్రీ రతన్ లాల్ కటారియా కూడా ప్రసంగించారు. సామాజిక న్యాయశాఖ కార్యదర్శి శ్రీ ఆర్. సుబ్రహ్మణ్ ప్రారంభోపన్యాసం చేశారు. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి రాధికా చక్రవర్తి ఈ ప్రచారోద్యమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  ఇందులో భాగంగా చేపట్టాల్సిన కార్యకలాపాలను ఆమె వివరించారు.
మంత్రి శ్రీ తావర్చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ, తమ మంత్రిత్వశాఖ మొత్తం 272  జిల్లాలో ఈ ప్రచారోద్యమం చేఒఅడుతోందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన ఈ జిల్లాలను ప్రచారానికి ఎంపిక చేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతోబాటు ఈ 272  జిల్లాల కలెక్టర్లు ఈ నెల 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, దీన్ని  7 నెలలపాటు నిర్వహించి 2021 మార్చి 31న ముగిస్తామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాశ ముక్త్ భారత్ కమిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ ప్రచారాన్ని నిర్వహిస్తాయని మంత్రి చెప్పారు. ఈ కమిటీలు ప్రచార కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయటం మీద లక్ష్యాల సాధనమీద దృష్టి సారిస్తారన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ నుమ్చి అందిన సమాచారం ఆధారంగాను, మంత్రిత్వశాఖ జరిపిన జాతీయ సర్వే ఆధారంగాను ఈ 272 జిల్లాలను ఎంపిక చేసినట్టు మంత్రి చెప్పారు. 
నాశ ముక్త్ భారత్ ను సాధించటానికి తమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని మంత్రి వివరించారు. 2017 లో కేటాయించిన రూ. 43 కోట్లను పెంచి ఇప్పుడు 2020లో రూ. 260 కోట్లుగా చేశామన్నారు. ఇలా ఐదు రెట్లు పెంచటం చూస్తేనే ప్రభుత్వం ఈ ప్రచారోద్యమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థమవుతుందన్నారు. ఈ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్న రాష్ట్రాలను కూడా ఆయన అభినందించారు.
అత్యంత ప్రభావం పడిన 272 జిల్లాలలో మాదక ద్రవ్యాల విభాగం, సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ అక్కడి ఆరోగ్య విభాగంతో కలిసి ఉమ్మడిగా చేపట్టే అవగాహనాకార్యక్రమం సత్ఫలితాలనివ్వహ్గలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఈ క్రింద పేర్కొన్న అంశాలుంటాయి. , 
అవగాహన పెంచే కార్యక్రమాలు
ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలమీద దృష్టి
సామూహిక చర్యల ద్వారా ఆధారపడిన జనాభాను గుర్తించటం
ఆస్పత్రి వాతావరణాలలో చికిత్స మీద దృష్టి పెట్టటం
సర్వీస్ ప్రొవైడర్ల కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు


మాదక ద్రవ్యాల వాడకం దేశంలో ఒక పెను సమస్యగా తయారవుతోంది. మాదకద్రవ్యాలు వాడే ఆ వ్యక్తిమీదనే కాకుండా ఆ కుటుంబం మీద, సమాజం మీద కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపే ప్రమాదముంది. దీన్ని ఎదుర్కోవటానికి నివారణ మార్గమే సరైన వ్యూహమని రుజువైంది. సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఈ మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గించే నోడల్ మంత్రిత్వ శాఖ కాబట్టి సమన్వయం, అమలు, సమీక్ష  ద్వారా నివారణ, సమస్య తీవ్రత అంచనా వేయటం, చికిత్స అందించటం, పునరావాసం, అవగాహన పెంపు లాంటి కార్యకలాపాలన్నీ చేపడుతోందన్నారు. దేసవ్యాప్తంగా ఈ సమస్య తీవ్రతను అంచనా వేయటానికి మంత్య్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టిందన్నారు. జనాభాలో ఎంత శాతం ఈ దురలవాటుకు బానిసగా మారిందో, వాళ్లలో ఎంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయో లెక్కలు తేలుస్తామన్నారు. ఈ జాతీయ సర్వే ఫలితాలను 2019లో ప్రచురించటాన్ని ఆయన గుర్తు చేశారు..

***



(Release ID: 1645904) Visitor Counter : 154