రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమ వైమానిక స్థావరంలో సీఏఎస్ భాదురియా పర్యటన
Posted On:
13 AUG 2020 7:23PM by PIB Hyderabad
వైమానిక దళ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్) ఆర్‌కేఎస్ భాదురియా పశ్చిమ వైమానిక స్థావరంలోని ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. ఎయిర్ బేస్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఆయకు స్వాగతం పలికి, బేస్‌లోని యూనిట్ల సంసిద్ధత, కార్యాచరణ స్థితి గురించి వివరించారు.
సాయంత్రం వరకు పర్యటన కొనసాగించిన సీఏఎస్, కార్యాచరణ సంసిద్ధతపై సమీక్షించారు. వాయుదళ యోధులతో మాట్లాడారు. అత్యుత్తమ సన్నద్ధతతో ఉండాలని వారికి సూచించారు. కొవిడ్ సమయంలోనూ వాయుసేన పోరాట పటిమను తగ్గనీయని వారి కృషిని సీఎఎస్ భాదురియా అభినందించారు.
పర్యటనలో భాగంగా, 'మిగ్-21 బైసన్'లో భాదురియా ప్రయాణించారు.
***
(Release ID: 1645594)
Visitor Counter : 167