మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహాత్మా గాంధీ 150 వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆలోచన మరియు తత్వశాస్త్రం పై వెబ్ నార్ నుద్దేశించి ప్రసంగించిన - కేంద్ర విద్యాశాఖ మంత్రి.
Posted On:
11 AUG 2020 8:19PM by PIB Hyderabad
"గాంధేయ ఆలోచన మరియు తత్వశాస్త్రం" పై యు.కె. లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ సహకారంతో జామియా మిలియా ఇస్లామియా (జె.ఎం.ఐ) ఈరోజు నిర్వహించిన వెబినార్ ను ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ప్రసంగించారు. గాంధేయ ఆలోచన మరియు తత్వశాస్త్రంపై వెబినార్ సిరీస్‌లో ఇది మొదటి ఉపన్యాసం. మేధావుల సమాజంలో గాంధేయ ఆలోచన మరియు తత్వశాస్త్రాన్ని వ్యాప్తి చేయడానికి మహాత్మా గాంధీ 150 వ పుట్టిన రోజును జరుపుకోవాలన్న విశ్వవిద్యాలయ గ్రాంట్సు కమిషన్ ప్రతిపాదనతో కలిసి ఈ వెబినార్ సిరీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్ కూడా పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ 150 వ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, శ్రీ ప్రొఖ్రియాల్ తన ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. జామియా మిలియా స్థాపనలో తన పూర్తి మద్దతు ఇచ్చిన మహాత్మా గాంధీ సూత్రాలను అనుసరిస్తూ, 1920 లో ప్రారంభమైనప్పటి నుండి జామియా మిలియా దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన అభినందించారు. మొత్తం ప్రపంచం గాంధేయ తత్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మరియు సత్యం, ప్రేమ, వినయం, అహింస వంటి ఆయన సూత్రాల ప్రాముఖ్యతను, ముఖ్యంగా అది కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్న సమయాల్లో గుర్తించింది. గాంధీ ఔచిత్యం అందరికీ తెలిసిందే. గాంధీ ఆలోచనలు మన జీవితంలోని ప్రతి సందర్భానికీ సంబంధించినవిగా ఉంటాయి. సత్యం, శాంతి, అహింస, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, విలువ ఆధారిత విద్య వంటి అనేక అంశాలపై గాంధీజీ ఆలోచనలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి.
దేశ నిర్మాణంలో విద్యార్థులు ఎలా సహకరించగలరో, గాంధీజీ జీవితం నుండి ఈ రోజు విద్యార్థులకు చాలా నేర్చుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఈ రోజు దేశంలోని ప్రతి పౌరుడు దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి గాంధీ ఆలోచనలు మరియు తత్వశాస్త్రం నుండి ప్రయోజనం పొందవచ్చు.
వివిధ విద్యా రంగాలలో జె.ఎమ్.ఐ. యొక్క నిరంతర మెరుగైన పనితీరు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సివిల్ సర్వీసెస్ మరియు ఇటీవల తన మంత్రిత్వ శాఖ నిర్వహించిన హాకథాన్‌లో జె.ఎం.ఐ. పనితీరు గురించి ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
*****
(Release ID: 1645269)
Visitor Counter : 160