భారత పోటీ ప్రోత్సాహక సంఘం
నాలుగు సంస్థల ఉమ్మడి వ్యాపార ప్రతిపాదనకు సిసిఐ ఆమోదముద్ర
Posted On:
11 AUG 2020 7:03PM by PIB Hyderabad
ఉమ్మడి వ్యాపారానికి కీహిన్ కార్పొరేషన్, నిస్సిన్ కోగ్యో కంపెనీ, షోవా కార్పొరేషన్, హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలియజేసింది.
ఎచ్ ఎ ఎం సి ఎల్ జపాన్ లో స్థాపితమైన పరిమిత భాగస్వామ్య జాయింట్ స్టాక్ కంపెనీ కాగా అది మోటారు సైకిల్స్ , స్కూటర్స్, ఆటోమొబైల్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తుంది. భారత్ లో ఈ సంస్థ ప్రధానంగా ఆటోమొబైల్స్, ద్విచక్రవాహనాల వ్యాపారం చేస్తుంది. జపాన్ లో ఏర్పాటైన కెసి సంస్థాఅటోమొబైల్ విడి భాగాలు తయారు చేసి ప్రపంచమంతా అమ్ముతుంది. పరిశోధన, అభివృద్ధి, తయారీతో ప్రపంచమంతా వ్యాపారం చేస్తుంది. భారత్ లో ఆటోమోటివ్, మోతార్ సైకిల్ విడిభాగాల అమ్మకం సాగిస్తుంది.
ఎన్ కె సి ఎల్ సంస్థ వాహనాల బ్రేక్ భాగాల తయారీ కోసం జపాన్ లో ఏర్పాటైంది. భారత్ లో అది వాహనాల సమీకృత బ్రేకింగ్ వ్యవస్థల తయారీ సరఫరాలో నిమగ్నమైంది. ఎస్సీ సంస్థ షోవా ఎయిర్ క్రాఫ్ట్ ప్రెసిషన్ వర్క్స్ పేరిట ఏర్పాటైంది. విమానాల విడి భాగాల తయారీకి 1938.లో నెలకొల్పిన సంస్థ ఇది. ప్రస్తుత వ్యాపారం మోటార్ సైకిల్, హైడ్రాలిక్, ఆటోమోటివ్ పరికరాలకు పరిమితమైంది భారత్ లో ఇది ఆటోమొబైల్స్, ద్విచక్ర వాహనాల కోసం షాక్ అబ్సార్బర్స్ తయారీలో నిమగ్నమైంది. ఎచ్ ఐ ఎ ఎం ఎస్ సంస్థ 2009లో ఏర్పాటు కాగా పవర్ ట్రెయిన్ సిస్టమ్స్, చాసీల అభివృద్ధి, తయారీ, అమ్మకం పనుల్లో ఉంది. బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సర్వీసింగ్ కూడా చేపడుతుంది.
పూర్తి సిసిఐ ఆర్డర్ వెనువెంటనే వెలువడుతుంది.
(Release ID: 1645231)
Visitor Counter : 202