రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఈ జులై వరకు జమ్మూ కశ్మీర్,లడాఖ్ ప్రాంతాల్లో 94 జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు, మరో 73 కొత్తవాటికి ప్రతిపాదనలు

2019 ఆగష్టు 5వ తేదీ వరకు జన్ ఔషధి కేంద్రాల్లో మొత్తం అమ్మకాలు రూ.4.39 కోట్లు, దీని ద్వారా ఆ ప్రాంతాల్లో నివసించే వారికి మొత్తం రూ.31 కోట్ల రూపాయలు ఆదా

జమ్మూ కశ్మీర్,లడాఖ్ ప్రాంతాలకు బిపిపిఐ 1.56 కోట్ల జన ఔషధి సువిద శానిటరీ ప్యాడ్లను సరఫరా చేసింది, ఎన్‌హెచ్‌ఎం ఈ ప్యాడ్‌లను యుక్త వయసు బాలికలు, మహిళలకు “రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమ్" లో భాగంగా ఉచితంగా పంపిణీ చేస్తోంది

Posted On: 11 AUG 2020 5:14PM by PIB Hyderabad

బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్‌యుస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) నాణ్యమైన జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు జమ్మూ కాశ్మీర్‌లో 91 జన ఔషధి కేంద్రాలను,లడాఖ్ ప్రాంతంలో 3 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించింది. 

ఫార్మాస్యూటికల్స్ విభాగంలో బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్‌యుస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పిఎమ్‌బిజెపి) అమలు సంస్థ. 

జమ్మూ కశ్మీర్ లో మొదటి  జన్ ఔషధి కేంద్రాన్ని శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద 2011 మే 9 న ప్రారంభించారు.లడాఖ్ మొదటి  జన్ ఔషధి కేంద్రాన్ని ఎస్ఎన్ఎమ్ ఆసుపత్రిలో 9 జనవరి, 2012 న ప్రారంభించారు. గత ఒక సంవత్సరంలో, అంటే 2019 ఆగస్టు 5 నుండి, బిపిపిఐ జమ్మూ కశ్మీర్ లో 31 కొత్త కేంద్రాలు, లడాఖ్ లో ఒకటి కేంద్రాలను ప్రారంభించింది. గత ఏడాదిలో మొత్తం అమ్మకాలు జమ్మూ & కశ్మీర్,  లడాఖ్   లో  రూ.4.39 కోట్లు, ఇది మొత్తం ఈ ప్రాంత నివాసితులకు రూ. 31 కోట్లు ఆదా చేసింది. 

జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం,  లడాఖ్  ప్రభుత్వం 73 కొత్త జన ఆషాధి కేంద్రాలను తెరవాలని ప్రతిపాదించాయి, వీటి కోసం ఇప్పటికే ప్రదేశాలు గుర్తించారు. రెండు యుటిలలో కొత్త ఫార్మసీ కౌన్సిళ్లు ఏర్పడిన తరువాత ఈ కేంద్రాల ప్రారంభం పూర్తవుతుంది.
2020, మార్చి 7వ తేదీ జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్వయంగా ఈ పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా లబ్ధిదారులలో ఒకరైన కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వయో వృద్ధ పౌరుడు శ్రీ గులాం నబీ దార్ ఈ పథకం ప్రయోజనాల గురించి, ముఖ్యంగా పేద అణగారిన వారికి ఎలా ఉపయోగపడుతోందో మాట్లాడారు. జన్ ఔషధి కేంద్రాలలో లభించే జెనెరిక్ ఔషధాలు తక్కువ ఖర్చు వల్ల పొదుపును, ఇతర నిర్మాణాత్మక పనుల కోసం ఉపయోగిస్తున్నందున వారి జీవితాలు మెరుగుపడ్డాయని ఆ పౌరుడు వివరించారు. ఈ ప్రాంతంలో ఈ కేంద్రాలను తెరవాలని ఆయన ప్రధానిని అభ్యర్థించారు. ఈ జన్ ఔషధి కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి సువిధ శానిటరీ ప్యాడ్లను దేశవ్యాప్తంగా నిరుపేద మహిళలకు ప్యాడ్‌కు ఒక రూపాయికే అందుబాటులో ఉంచారు. జమ్మూ కశ్మీర్ ఈ ప్యాడ్లను బిపిపిఐ నుండి నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఉచిత పంపిణీ కోసం నేరుగా కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు బిపిపిఐ జమ్మూ, కశ్మీర్,  లడాఖ్  ప్రాంతాలకు 1.56 కోట్ల ప్యాడ్లను సరఫరా చేసింది. “రాష్ట్రీయ కిషోర్ స్వస్త్య కార్యక్రమ్ (ఆర్కెఎస్కె)” లో భాగంగా ఎన్‌హెచ్‌ఎం ఈ ప్యాడ్‌లను యువతులు, మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది.

****


(Release ID: 1645227) Visitor Counter : 200